హైదరాబాద్, జూలై 6: సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సభ నిర్వహించుకుంటే తమకు అభ్యంతరం లేదు కానీ వారు సమైక్యాంధ్ర సభ అనవద్దని తెలంగాణ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు పొన్నం ప్రభాకర్ సూచించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కూడా ఆ సభకు హాజరైతే సమైక్యాంధ్ర సభ అనాలే తప్ప, సీమాంధ్రకు చెందిన వారు సభ నిర్వహించినప్పుడు సమైక్యాంధ్ర సభ అని ఎలా అంటారని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ మరింత పటిష్టం కావాలంటే వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ చేపట్టాలని ఆయన పార్టీ అధిష్ఠానాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే చాలా జాప్యం జరిగిందని ఆయన అన్నారు. పెళ్ళిలో ఆడపిల్ల వారు అణిగిమణిగి ఉన్నట్లు తాము సంయమనంతో ఉంటున్నామని ఆయన తెలిపారు. ఎంపి రాజయ్య మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరగాలని తాము కోరుతుంటే సీమాంధ్రకు చెందిన వారు బలవంతంగా కాపురం చేస్తామని అంటున్నారని విమర్శించారు. సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ నాయకులు పార్టీ అధిష్ఠానాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆయన విమర్శించారు.
టి.కాంగ్రెస్ ఎంపి పొన్నం హితవు
english title:
ponnam
Date:
Sunday, July 7, 2013