హైదరాబాద్, జూలై 6: చార్‌ధామ్‌లో వరద బాధితులకు రాష్ట్రంలో రైతుల రుణాలకు సంబంధం ఉందని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. చార్‌ధామ్ వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేయలేని పనిని ప్రతిపక్షంగా చేసి చూపించాం, రైతులకు రుణ మాఫీని సైతం ఇదే విధంగా చేసి చూపిస్తామని చంద్రబాబు ధీమాగా చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలంగాణలోని ఐదు జిల్లాల ప్రాంతీయ సదస్సు శనివారం కొంపల్లిలో జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు - కార్యాచరణ ప్రణాళికపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. పంచాయితీ ఎన్నికల్లో ప్రచారం చేయాల్సిన అంశాల్లో చార్‌ధామ్‌లో టిడిపి అందించిన వరద సహాయం గురించి ప్రధానంగా ప్రచారం చేయాలని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రాగానే రుణ మాఫీ పైనే తొలి సంతకం చేయనున్నట్టు ప్రకటించిన చంద్రబాబు అది ఎలా సాధ్యం అవుతుందనే సందేహాలకు చార్‌ధామ్ వరద సహాయమే దానికి ఉదాహరణ అని వివరించారు. రైతులకు రుణ మాఫీ సైతం అదే విధంగా చేసి చూపిస్తామని అన్నారు.
పంచాయతీ అజెండాలో ‘చార్‌ధామ్’ * చంద్రబాబు వ్యూహం
english title:
babu
Date:
Sunday, July 7, 2013