హైదరాబాద్, జూలై 6: విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణాన్ని విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. గత వారం రోజులుగా వివిధ విద్యార్థి సంఘాలు దశల వారిగా ఆందోళన చేస్తున్నాయి. శనివారం బంజారాహిల్స్‌లో విద్యార్థి సంఘాల నేతలతో పాటు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, టాస్మోట్సిస్ చార్జీలను పెంచాలని, ప్రతి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నిధులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలని వారు సూచించారు. నిబంధనలు పాటించని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని సూచించారు. మంత్రుల నివాస ప్రాంతాల్లోకి విద్యార్థులు వస్తున్నారని తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మంత్రుల నివాస ప్రాంగణ ముట్టడికి ప్రయత్నించగా విద్యార్థులను పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. సమస్యలు త్వరగా పరిష్కరించకపోతే బంద్‌లు, రాస్తారోకోలకు పిలుపు ఇస్తామని విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు. (చిత్రం) బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణాన్ని ముట్టడించేందుకు యత్నిస్తున్న విద్యార్థి సంఘాల నేతలు
విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని
english title:
ministers
Date:
Sunday, July 7, 2013