హైదరాబాద్, జూలై 8: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావు నిర్వహించుటకు అన్ని రాజకీయ పార్టీలు తోడ్పాటునందించాలని, అలాగే డబ్బు, మద్యం పంపిణీ జరుగకుండా నిఘా ఏర్పాటుచేస్తున్నామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ బి.శ్రీధర్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా డబ్బు పంపిణీని అరికట్టేందుకు ప్రైవేటు వీడియోగ్రఫీని ఏర్పాటుచేస్తున్నామని, దీని వ్యతిరేకంగా వ్యవహరించిన అభ్యర్థిపై తన అభ్యర్థిత్వం కోల్పోవడంతోపాటు చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతందని అన్నారు. జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, మూడవ విడత జరిగే గ్రామాలకు ప్రచారానికి ఎక్కువ సమయం ఉందని, ప్రభుత్వం నిర్దేశించిన అభ్యర్థి ఖర్చు కంటే ఎక్కువ ఖర్చుచేసినట్లయితే వారిపై తీసుకుంటామని తెలిపారు. బిజెపి ప్రతినిధి మల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి జి.నర్సింలు, సిపిఐ (ఎం) పార్టీ ప్రతినిధి డి.జి.నర్సింగ్‌రావు, టిడిపి ప్రతినిధి సుభాష్ యాదవ్, సిపిఐ ప్రతినిధి బాలమల్లేష్ అడిగిన సందేహాలను సమావేశంలో కలెక్టరు నివృత్తి చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు చంపాలాల్, ఎం.వి.రెడ్డి, డిఆర్‌ఓ రవీందర్‌రెడ్డి, డిపిఓ మునావర్ పాల్గొన్నారు.
జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావు నిర్వహించుటకు అన్ని
english title:
collector
Date:
Tuesday, July 9, 2013