మంత్రి వద్దకు వెళ్లిన వానికి, నీతిమంతుడైన ఆ మంత్రి పూజాగృహంలో అతణ్ణి ప్రశ్నించడం, అతడు రావడానికి నిరాకరిస్తే చంపడం వంటి ఘాతుకాలను చేయడం ఇష్టంలేక, ఎనిమిది గంటల వరకూ ఆగి, అప్పుడు మంత్రిగారిని దర్శించుకొని, రాజుగారు తనని అప్పటికప్పుడు పిలుచుకు రమ్మన్నారని, వెంటనే బయలుదేరి రాని పక్షంలో తల తెగవేసి తీసుకురమ్మన్నారనీ చెప్పాడు. తాను ఈ పనులేవీ చేయలేక, పూజను ఆటంకపరచలేక, పూజా కార్యక్రమం అయ్యేంతవరకూ ఆగి వున్నాననీ చెప్పుకున్నాడు.
మంత్రి అతడి మాటలన్నీ విని, ఖజానా తాళపు చెవితో, రాజ సేవకుణ్ణి వెంటబెట్టుకొని రాజు వద్దకు వచ్చాడు.
‘మీరు మళ్లీ ఇంత త్వరగా ఎందుకు వచ్చారు? తీరికగా, తర్వాత ఎప్పుడో రమ్మని ఇంతకు మునుపే కదా మీకు చెప్పింది? ఇందాక వచ్చి, ఖజానా తెరచి, అక్కడ వున్న నగలన్నిటి వివరాలు నాకు చెప్తిరి. మళ్లీ ఖజానా తాళం పెట్టుకుంటిరి. ‘మీరు వెళ్లిరండి’ అని సెలవు ఇచ్చి పంపిస్తిని. మళ్లీ ఇంత హడావిడిగా ఎందుకు తిరిగి వచ్చినట్టు?’ అని ఆశ్చర్యంతో అడిగాడు రాజు.
మంత్రికి విషయమంతా అర్థమైంది. ఏదో ఆశకు లోనై రాజు, తన వ్రతాన్ని భంగపరచడానికి సిద్ధపడ్డాడు కానీ, తనని పిలవడానికి వచ్చిన రాజసేవకుడు, మర్యాద పాటించి, రాజాజ్ఞను కూడా ధిక్కరించి, పూజ అయేంతవరకూ ఆగిపోయాడు.
కానీ రాజు అసహనం పెరగకముందే, మంత్రిపైనా, రాజ సేవకునిపైనా ఆగ్రహం మిన్నుముట్టక ముందే, భగవంతుడే స్వయంగా మంత్రి వేషం ధరించి, మాయ తాళపు చెవితో ఖజానా తీసి రాజుగారికి కావలసిన సమాచారం అందించాడు.
రోజుకు ఇరవై మూడు గంటలు రాజసేవలో వున్నా, క్షణికోద్రేకంలో రాజు, అన్నీ మరచి, మర్యాదలూ ఉల్లంఘించి, తన తల తీయించేటంతటి ఆగ్రహోదగ్రుడయ్యాడు.
రోజులో ఇరవై నాలుగు గంటల్లో ఒక గంట మాత్రమే భగవంతుడి పూజకు కేటాయించినప్పటికీ, ఆ కాస్తకే సంతోషించి, తనకు ఎట్టి ఇక్కట్లు రాకుండా, తన వేషాన్ని భగవంతుడు ధరించి, రాజ ఉత్తర్వులు పాటించాడు. ఎవర్ని సేవిస్తే నిజమైన ఫలితం దక్కుతుందో మంత్రికి పూర్తిగా అర్థమయింది. మరుక్షణం, మంత్రి మహారాజుతో ‘మీకూ నాకూ ఆ జగద్రక్షకుడే రక్ష. భగవంతుణ్ణి రోజూ నిర్విరామంగా సేవించుకోడానికి, నాకు అవకాశం ఇప్పించండి. నన్నీ మంత్రి పదవి నుండి విడిపించండి’ అంటూ వెళ్లిపోయాడు.
మిత్రశ్రీ ‘కథను’, తాను చెప్పి, ఉత్కళరావు తన ఇంగ్లీష్ పాండిత్యాన్ని ప్రదర్శించాడు. ‘్హ్యతీ ని ఇఖఆ ఒళ్పూళజూ ద్యిజూ తీజఆ్ద ఘఒ ౄఖష్ద చీళ్ఘ ఘఒ ని ఒళ్పూళజూ ౄక జశ. హళ త్యీఖజూ శ్యఆ ద్ఘ్పళ ళఛిఆ ౄళ జశ ళక ద్ఘజూఒ’ అన్నాఢు, ఇంగ్లండ్‌లోని చర్చి పూజారి టామస్ వుల్సీ. ఎనిమిదవ హెన్రీ మహారాజు, తన ఆజ్ఞ పాటించలేదని పుల్సీకి మరణశిక్ష విధించాడు.
వుల్సీ, మాట వరసకిలా అలా అన్నాడే కానీ, నిజంగా భగవంతుడు దిగి వచ్చి, భక్తుణ్ణి రక్షిస్తాడా అనుకుంటుండేవాణ్ణి. మిత్రశ్రీ ఈ పురాతన కథను పునరుద్ధరించి, ఆ అనుమానం తొలగించేశాడు’ అన్నాడు ఉత్కళరావు.
*
నీలంరాజు నోట్‌బుక్
english title:
neelamraju notebook
Date:
Sunday, July 21, 2013