న్యూఢిల్లీ, జూలై 19: క్రీడాకారులకు కూడా దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘్భరత రత్న’ అవార్డును ప్రకటించవచ్చంటూ కేంద్రం నిబంధనలను మార్చిన మరుక్షణం నుంచి వినిపించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెండూల్కర్ పేరు మరుగున పడింది. ‘్భరత రత్న’ను స్వీకరించే తొలి క్రీడాకారుడిగా అతను రికార్డు పుటల్లో శాశ్వత స్థానం సంపాదిస్తాడన్న అంచనాల తల్లకిందులయ్యాయి. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం సచిన్‌కు నిరాశనే మిగిల్చింది. అంతర్జాతీయ హాకీలో తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచి, భారత్‌కు వరుసగా మూడు ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలను సాధించి పెట్టిన ధ్యాన్ చంద్ పేరును ‘్భరత రత్న’కు ప్రతిపాదిస్తూ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కేంద్ర క్రీడల మంత్రి జితేంద్ర సింగ్ లేఖ రాయడంతో, అతనికే అవార్డు దక్కడం దాదాపు ఖాయమైంది. ఎంతోకాలంగా సచిన్‌కు భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తున్నది. ఎంతోమంది క్రికెటర్లతోపాటు వివిధ క్రీడలకు చెందిన వారు, చివరికి రాజకీయ నాయకులు కూడా సచిన్‌కు అనుకూలంగా ప్రకటనలు గుప్పించారు. అయితే, భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అతని పేరును ప్రతిపాదించలేదు. క్రికెట్ సహా ఇతర క్రీడా సంఘాలు, సంస్థలు, సమాఖ్యల నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాకపోవడంతో, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ధ్యాన్ చంద్ పేరును ఖరారు చేసింది. ఈ ప్రతిపాదనను ప్రధాని మన్మోహన్ సింగ్‌కు పంపింది. ఆయన అంగీకారం తెలిపితే, రాష్టప్రతి ఆమోద ముద్ర పడడం, ధ్యాన్ చంద్‌కు భారత రత్న అవార్డు లభించడం ఖాయం. మొత్తానికి క్రీడా రంగంలో ఈ అవార్డుకు ఎవరు అర్హులని ఎంతోకాలంగా సాగుతున్న చర్చకు క్రీడా శాఖ తెరదించింది. సచిన్ కంటే ధ్యాన్ చంద్ ఈ అవారుడకు అర్హుడని చెప్పకనే చెప్పింది.
ధ్యాన్ చంద్‌కు ‘్భరత రత్న’ అవకాశం
english title:
s
Date:
Saturday, July 20, 2013