ఈ కాలంలో మనం ఎన్నో
ఎలక్ట్రానిక్ ఉపకరణాలను
చూస్తున్నాం.
వాడుతున్నాం. ఈ
ఎలక్ట్రానిక్ ఉపకరణాలు
పరికరాలు ఎక్కువగా
వైర్లతో, కేబుల్స్‌తో
కలిపితేనే పనే్జస్తాయి!
ఐతే వైర్లతో, కేబుల్స్‌తో
అన్ని వేళలా
ఉపయోగించడం కష్టమైన
పని. ఉదాహరణకు,
రెండు మొబైల్ ఫోన్లను
కలపడం లేదా మొబైల్
ఫోన్‌ను పీసీకి కలపడం,
డ్రైవింగ్‌లో ఫోన్‌ను
వాడకుండా మాట్లాడటం -
వగైరా. మరి అలాటపుడు
ఉపకరణాలను వాడటం
ఎలా (అవి లేని కాలంలో
పరిస్థితి వేరేగా ఉండేది)
దీని కోసం వైర్లెస్
పరిజ్ఞానం అవసరమైంది.
అందుకే, బ్లూ టూత్ అనే
వైర్‌లెస్ టెక్నాలజీని
రూపొందించారు. ఈ
బ్లూటూత్ అనే పదాన్ని
చాలా కంప్యూటర్స్,
సెల్‌ఫోన్ ప్రకటనలలో
వింటూన్నాం.
బ్లూ టూత్‌ను మొదట
ఎరిక్సన్ సంస్థ
రూపొందించింది. ఆ
తరువాత ఐబిఎం,
ఇన్‌టెల్, నోకియా,
తోషిబా సంస్థలు మరింత
అభివృద్ధి చేశాయి. ఈ బ్లూ
టూత్ అనే పేరు 10వ
శతాబ్దానికి చెందిన డానిష్
రాజు హెరాల్డ్ బ్లూ టూత్
పేరు నుంచి వచ్చింది.
జాగ్రత్తగా పరిశీలిస్తే దీని
లోగోలో ‘హెచ్’ ‘బి’
అక్షరాలు కనిపిస్తాయి.
బ్లూ టూత్ అంటే
ఎలక్ట్రానిక్ ఉపకరణాలను
ఒకదానితో ఒకటి కలిపి
ఉంచే తక్కువ పరిధిలో
(30 అడుగుల
దూరంలోపే) పనిచేసే
వైర్లెస్ రేడియో టెక్నాలజీ,
వైర్లు, కేబుల్స్‌ను వాడి
ఎలాగైతే మనం
కంప్యూటర్‌తో కీబోర్డు,
వౌస్‌లను, యంపి3
ప్లేయర్‌తో హెడ్ ఫోన్లను
కలుపుతున్నామో అదే
విధంగా మనం బ్లూ టూత్
వైర్లెస్ టెక్నాలజీని
ఉపయోగించి
కలుపుతున్నాం.
బ్లూ టూత్ ఎలా పని
చేస్తుందీ అంటే...
* ఒక రేడియో చిప్‌ను
ఉపకరణాల్లో వాడటం
ద్వారా మనం ఈ బ్లూ
టూత్ టెక్నాలజీని
వాడగల్గుతున్నాం.
* రెండు ఉపకరణాల
మధ్య ఏక కాలంలో
ఒక్కొక్క బిట్ (0 లేదా
1) లేదా కొన్ని బిట్స్
సమూహంగా గాలి
తరంగాల ద్వారా డేటా
బట్వాడా జరుగుతుంది.
* గాలి తరంగాల ద్వారా
బిట్స్ రూపంలో వచ్చిన
మెసేజ్‌ను ఎలా
తీసుకోవాలి, ఎలా
చదవాలి, మెసేజ్ తనకు
అందేలోగా ఎవరన్నా
మార్పులు చేశారా?
ఇలాంటి అన్ని ప్రశ్నలను
బ్లూటూత్ సంబంధించిన
ప్రామాణికమైన ప్రోటోకాల్
చూసుకుంటుంది.
బ్లూటూత్ టెక్నాలజీ
తక్కువ ఖర్చుతో
కూడుకుంది. అంతేకాదు.
బ్లూ టూత్‌ను
ఉపయోగించి మనం
డేటాను లేదా శబ్దాన్ని
లేదా విడియో,
ఫొటోలనూ కూడా
పంపొచ్చు. సాధారణంగా
బ్లూ టూత్ ప్రామాణికమైన
ప్రోటోకాల్‌నే వాడుతుంది.
కాబట్టి దీనిని అందరూ
వాడొచ్చు. బ్లూ టూత్
తక్కువ శక్తిగల వైర్లెస్
తరంగాలను వాడటం వల్ల
ఆట్టే సమస్యలుండవ్.
ఐతే, ఆధునిక
టెక్నాలజీలో ఏదీ పూర్తి
భరోసా ఇవ్వదు. దేని
నష్టాలు దానికున్నాయి.
సరిగ్గా తెలీకుండా దేన్నీ
వాడకూడదు. అదే
రీతిలో, బ్లూ టూత్‌ను
కూడా వాడుకుంటే ఆట్టే
సమస్యలుండవ్.
షార్ట్ కట్స్ (్ఫటోషాప్
7.0 టూల్స్)
shift + I
సైకిల్
ఐడ్రాపర్ లేదా శాంప్లర్
లేదా మెషర్ వాడటానికి
shift + J
హీలింగ్ బ్రష్, పాచ్ టూల్
టాగిల్ చేయడానికి
shift + K స్లైస్
లేదా స్లైస్ టూల్స్ మధ్య
టాగిల్ చేయడానికి
shift + L సైకిల్
లాసో టూల్ వాడటానికి
నెట్ న్యూస్
కింద పడ్డా పైచేయి
మాదే...
అదేదో సామెత చెప్పినట్టు,
కింద పడ్డా పైచేయి మాదే
అని ప్రింట్ మీడియా
కాలర్
ఎగరేయచ్చంటున్నారు.
విషయం ఏమిటంటే, ఈ
ఆధునిక బ్లాగ్, నెట్
యుగంలో వార్త
కాంతికన్నా వేగంగా
వ్యాపిస్తోంది. సోషల్ నెట్
వర్క్‌లేమిటి, ట్విటర్లో
ట్వీట్ లేమిటి, వార్తా
పత్రికల న్యూస్
ఏజెన్సీలకన్నా వేగంగా
వార్తలను
అందించేస్తున్నాయి.
ముఖ్యంగా ట్విటర్. ఐతే,
ట్విటర్‌కన్నా న్యూస్
ఏజెన్సీలే మిన్న అని
యుకేకి చెందిన ఎడిన్‌బర్గ్
యూనివర్సిటీ
సైంటిస్టులంటున్నారు.
వాళ్లు 11 వారాలలో
ప్రధాన వార్తలకు
సంబంధించిన దాదాపు
51 మిలియన్ల ట్వీట్‌లను
స్టడీ చేశారట (దీనికి
2011 సమ్మర్
కాలాన్ని ఎంచుకున్నారు)
దానికీ, వార్తలందించే
ఏజెన్సీల నుంచి వచ్చే
వార్తలనూ కంపేర్ చేసి
చూస్తే ఏజెన్సీలే వేగంగా
వార్తలందిస్తున్నాయని
తెలిసింది(ట).
అదన్నమాట విషయం.
తెలుసుకోవాల్సిన
సంగతి..
వర్జిన్..ఎప్పటికీ వర్జినే...
వర్జిన్ అనేది బాగా
పాపులరయిన టెలికామ్
సంస్థ పేరు. ఈ సంస్థ
రికార్డింగ్, విమానయానం
వంటి రంగాల్లోనూ
వ్యాపారం చేస్తోంది. దీని
వ్యవస్థాపకులు రిచర్డ్
బ్రాసన్. రిచర్డ్ మొదట్లో
రికార్డింగ్ కంపెనీ
ఆరంభించాడు. అది బాగా
లాభాలను
తెచ్చిపెట్టడంతో, ఒక
బ్రాండ్ నేమ్ కావాలని
ఆలోచించాడు. అతని
బిజినెస్‌లో ఒక
భాగస్వామి (పేరు తెలీదు)
మనం మచ్చలేని
వ్యాపారం చేస్తున్నాం
కదా, వర్జిన్ అని పేరు
పెడితే ఎలా ఉంటుందీ
అన్నాడు. అంతే, తన
సంస్థకు వర్జిన్ అని
పేరెట్టాడు. వర్జిన్
యాహూ అంటే
మచ్చలేనిది అనీ, కన్య
అనీ అర్థం. అందరూ
భాగస్వాములూ వర్జినా
ఐతే ఓకే అనేశారు. అదీ
సంగతి. అన్నట్టు, ఈ
విషయాన్ని రిచర్డ్ తన
ఆత్మకథలో
రాసుకున్నాడు. ఇంతకీ
ఆ ఆత్మకథకు రిచర్డ్
పెట్టిన పేరేంటో తెల్సా..
లూజింగ్ మై వర్జినిటీ..
బావుంది కదూ.
*
పద పారిజాతం
Bleg
సమాఛారాన్ని
అడుక్కోడానికి పెట్టే బ్లాగ్
Audiocast/Pop
cast శబ్దంతో
కూడిన బ్లాగ్. ఆడియో
క్లిపింగ్ ద్వారా తమ
పోస్ట్‌ని ఉంచడం
Blogroll ఒక భ్లాగ్‌లో
వేరే ఇతర బ్లాగ్‌లను లింక్
చేయడం
Vblog విఢియో
బ్లాగ్ అనడానికి క్లుప్త
రూపం.
సామెత
వైరస్సెరిగి వాత పెట్టాలి..