మార్టూరు, ఫిబ్రవరి 29: అవినీతి నిరోధక శాఖ అధికారులు అధికారులు మార్టూరులో బుధవారం వలపన్ని వ్యవసాయ శాఖ అధికారి కుసుమకుమారిని పట్టుకున్నారు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. రాజవరపు లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఎరువులు, పురుగు మందుల వ్యాపారం చేసుకోవటానికి దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తును పరిశీలించి ఎరువులు, పురుగుమందులు నిల్వ చేసుకోవటానికి ఏర్పాటుచేసుకున్న గోడౌన్‌ను పరిశీలించి దరఖాస్తులను ఎడిఏకి పంపవలసి ఉంది. దరఖాస్తులు పంపటానికి 12 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా లక్ష్మీనారాయణ గత్యంతరం లేక ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో వారు ప్రణాళికలు సిద్ధం చేసుకుని బుధవారం ఎవోకు 12 వేలు లంచం అందజేస్తుండగా ఎసిబి డిఎస్‌పి భాస్కర్‌రావు, ఒంగోలు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ప్రతాప్‌కుమార్, నెల్లూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ చంద్రవౌళి, వారి సిబ్బంది వలపన్ని పట్టుకున్నారు. ఎవో కుసుమకుమారి మాత్రం అతనెవరో తనకు తెలియదని, కావాలని తనను ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
=============
షాపులో అగ్నిప్రమాదం
20 లక్షల ఆస్తి నష్టం
ఒంగోలు, ఫిబ్రవరి 29: నగరంలోని కర్నూలు రోడ్డులో గల శ్రీలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన ఏజన్సీ షాపులో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో సుమారు 20 లక్షల రూపాయల విలువైన బ్యాగ్‌లు, సూట్‌కేస్‌లు కాలిపోయాయి. విద్యుత్ షార్ట్‌షర్క్యూట్ కారణంగా షాపుల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుని ఉండవచ్చని షాపు యజమాని సుబ్బారావు తెలిపారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఒంగోలు ఫైర్ స్టేషన్ ఆఫీసర్ సునీల్ ఆధ్వర్యంలో సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. ప్రమాదం జరిగిన సమయంలో కర్నూలురోడ్డులో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
అవినీతి నిరోధక శాఖ అధికారులు అధికారులు మార్టూరులో బుధవారం వలపన్ని వ్యవసాయ శాఖ
english title:
agricultural officer in acb net
Date:
Thursday, March 1, 2012