Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

పోలింగ్ ప్రశాంతం

$
0
0

విజయనగరం, జూలై 23: జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అక్కడక్కడ అపశ్రుతులు మినహా మిగిలిన అన్ని చోట్ల ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. మంగళవారం పార్వతీపురం రెవెన్యూ డివిజన్‌లోని 15 మండలాలకు పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే వెబ్‌కాస్టింగ్ విధానం ద్వారా పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తు సిబ్బందికి పలు సూచనలు చేశారు. డిఐజి ఉమాపతి, ఎస్పీ కార్తికేయ పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. తొలి విడత పోలింగ్‌లో అత్యధికంగా రామభద్రాపురంలోని 95.38 శాతం పోలింగ్ జరిగింది. మండలాల వారీగా పోలింగ్ శాతాన్ని పరిశీలించినట్టయితే పార్వతీపురం 88.69, గరుగుబిల్లిలో 90.37, సాలూరులో 90, పాచిపెంటలో 87.74, మక్కువలో 87.42, బొబ్బిలిలో 85, బలిజపేటలో 88.92, సీతానగరం 91, జియ్యమ్మవలస 87.83, బాడంగి 90, కొమరాడ 91, కురపాం 82, తెర్లాం 85, గుమ్మలక్ష్మిపురం 80 శాతం పోలింగ్ జరిగింది. రామభద్రాపురం మేజర్ పంచాయతీలో ఓటర్లు ఉదయం ఆరు గంటల నుంచే క్యూలో వేచి ఉండటం కన్పించింది. అక్కడ పోలింగ్ అనంతరం స్వల్ప ఘర్షణ మినహా అంతా ప్రశాంతంగా జరిగింది.
కాగా, ఉదయం ఆరు గంటల నుంచి ఆటోల్లో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించారు.
ఓటింగ్ సమయంలో కొన్ని చోట్ల అభ్యర్థులు గుర్తులు తారుమారయ్యాయని బొబ్బిలి మండలం మెట్టవలస పంచాయతీ ఒకటో వార్డుకు బరిలో నిలిచిన అభ్యర్థులు మీసాల చంద్రశేఖరరావు, వెంకటరమణ శిఖలు పోలింగ్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా దీనికి పోలింగ్ ఆఫీసర్ మాట్లాడుతూ మీరు ఆరోజు ఒక గుర్తుకు వేరొక గుర్తు రాసుకొని ఉంటారని బదులిచ్చారు. దీంతో వీరిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని శాంతింపజేశారు. ఇదిలా ఉండగా ఓటర్లు తమకు ఓటు వేశారా అని అడిగితే నిజం చెబుతారో లేదోనని ఆరికతోటలో వైకాపా నేతలు మరో ముందడుగు వేసి తమ నుంచి తాయిలాలు అందుకున్న ఓటర్లను తమ ఎదుట దైవసాక్షిగా ప్రమాణాలు చేయాలని వత్తిడి తెచ్చినట్టు సమాచారం. సాలూరు మండలం నేరెళ్లవలస పంచాయతీలో ఓటర్లను తీసుకెళ్తున్న వ్యాన్ మలుపు వద్ద బోల్తాపడటంతో 30 మందికి గాయాలయ్యాయి. వీరిలో తీవ్రంగా గాయాలపాలైన 10 మందిని జిల్లా కేంద్రానికి తరలించారు. జియ్యమ్మవలసలోని దుడ్డికల్లులో తాగుబోతులు వీరంగం చేయడంతో పోలింగ్ కొద్దిసేపు నిలిపివేశారు. రామభద్రాపురం మండలం తారాపురంలో ఓటర్లకు బ్యాలెట్ పేపర్లను తప్పుగా మడతపెట్టి ఇవ్వడం వల్ల తాము వేసిన ఓటు ముద్ర రెండు గుర్తులపై పడి అవి చెల్లకుండా పోతాయని సుమారు 50 మంది మహిళా ఓటర్లు పోలింగ్ కేంద్రం వద్ద గొడవకు దిగారు. చదువుకున్న వారు ఓటర్ల జాబితాలో సంతకాలు చేస్తే ఒకలాగా బ్యాలెట్ పేపరు మడతపెట్టి ఇస్తున్నారని, సంతకం రాని వారికి ఇంకొకలాగా బ్యాలెట్ పేపరు మడతపెడుతున్నారని వారు ఆరోపించారు. కురపాం మండలం పెద్దగొత్తిలిలో ఒక వార్డుకు ఉపయోగించాల్సిన బ్యాలట్‌లను వేరొకవార్డుకు ఉపయోగించడంతో ఆ వార్డులో ఓటర్లకు బ్యాలెట్లు చాలక ఓటర్లు ఓటువేయకుండా మిగిలిపోయారు. దీంతో అధికారులు జోక్యం చేసుకొని వివాదాన్ని పరిష్కరించారు. ఈ విధంగా చిన్న చిన్న సంఘర్షణలు మినహా మిగిలిన అన్ని చోట్ల ప్రశాంతంగా పోలింగ్ జరిగింది.

ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

విజయనగరం (్ఫర్టు), జూలై 23: ఈనెల 27 తేదీన విజయనగరం డివిజన్‌లో జరుగనున్న పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్భందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అన్నారు. పార్వతీపురం డివిజన్‌లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలపై మంగళవారం జిల్లా పంచాయతీ అధికారి సత్యశ్రీనివాస్‌తో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పార్వతీపురం డివిజన్‌లో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గిరిజన, శివారు ప్రాంతాల్లో చిన్నచిన్నలోపాలు జరిగాయన్నారు. అయితే విజయనగరం డివిజన్‌లో అలాంటి లోపాలు లేకుండా చూడాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. విజయనగరం డివిజన్‌లో 73 పంచాయతీ సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైనందున, అక్కడ సిబ్బందిని ఎన్నికలు జరిగే గ్రామాల్లో నియమించాలమన్నారు. పార్వతీపురం డివిజన్‌లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలపై ఎప్పటికప్పుడు కలెక్టర్ ఆరా తీశారు. బొబ్బిలి సమీపంలో మెట్టవలసలో చిన్నపాటి అల్లరి సంఘటనలు జరిగినట్లు కలెక్టర్ దృష్టికి జిల్లా పంచాయతీ అధికారి తీసుకువెళ్లారు. కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస ఏజెన్సీ మండలాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు. విజయనగరం డివిజన్‌లో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. సమస్యాత్మక గ్రామాల్లో ఎటువంటి అల్లర్లు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

తొలివిడతలో కాంగ్రెస్‌దే హవా
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, జూలై 23: జిల్లాలో తొలి విడత కింద 15 మండలాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక పంచాయతీలను కైవశం చేసుకుంది. రెండో స్థానంలో వైకాపా నిలిచింది. మంగళవారం ఉదయం ఏడు గంటలకే అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా గట్టి పోలీసు బందోబస్తు, పారా మిలటరీ బలగాలను వినియోగించారు. జిల్లాలో మొత్తం 921 పంచాయతీలు ఉండగా వాటిలో తొలి విడత కింద 409 పంచాయతీలకు, 3866 వార్డులకు ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. కాగా, వీటిలో 59 పంచాయతీలు, 1412 వార్డులు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 349 పంచాయతీలకు, 2419 వార్డులకు ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో కాంగ్రెస్‌కు 148, టిడిపి 81, వైకాపాకు 113, ఇండిపెండెంట్లు ఇతరులు కలిపి 66 పంచాయతీలు దక్కాయి. సీతానగరం మండలం వియ్యంపేట పంచాయతీకి ఎన్నిక జరగలేదు. అలాగే ఈ ఎన్నికలు పార్టీలకతీతంగా నిర్వహించినప్పటికీ పార్టీల మద్దతుతో అభ్యర్థులు గెలుపొందిన విషయం విధితమే.

రేపటితో రెండో విడత ప్రచారం సమాప్తం
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, జూలై 23: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత కింద ప్రచారానికి మరో రెండు రోజులే గడువు ఉంది. 25న సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగియనుంది. రెండో విడత కింద విజయనగరం డివిజన్‌లోని 19 మండలాలకు ఎన్నిక నిర్వహించనున్నారు. వాటిలో విజయనగరం, బొండపల్లి, గజపతినగరం, మెంటాడ, దత్తిరాజేరు, మెరకముడిదాం, గరివిడి, చీపురుపల్లి, గుర్ల, నెల్లిమర్ల, డెంకాడ, పూసపాటిరేగ, భోగాపురం, గంట్యాడ, ఎస్.కోట, జామి, కొత్తవలస, ఎల్.కోట, వేపాడ మండలాలకు ఎన్నిక నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి పోలింగ్ సామాగ్రిని ఈ నెల 25న ఉదయం అందజేయనున్నట్టు సమాచారం. కాగా, ఈ ఎన్నికలకు టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌గజపతిరాజు విజయనగరం మండలంలో పర్యటిస్తున్నారు. ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి కూడా కొన్ని మండలాల్లో పర్యటిస్తూ అభివృద్ధిని చూసి ఓటేయాలని ఓటర్లను కోరుతున్నారు. ఈ ఎన్నికల్లో పిసిసి అధ్యక్షుడు, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిథ్యం వహిస్తున్న చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌గజపతిరాజు నియోజకవర్గం, వైకాపా జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు నియోజకవర్గం ఉండటంతో ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఇప్పటికే ఎన్నికల్లో గెలుపు కోసం తొలిసారిగా కత్తులు దూసుకున్నారు. జిల్లాలోని నెల్లిమర్ల మండలం దన్నానపేటకు చెందిన జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు గేదెల రాజారావుపై ఇటీవల హత్యాయత్నం జరిగింది. కాంగ్రెస్ వర్గీయులే అతనిపై దాడి చేశారని రాజారావు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా చీపురుపల్లిలో కాంగ్రెస్‌లోనే రెబెల్స్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా జెడ్పీ మాజీ చైర్మన్ బెల్లాన చంద్రశేఖరరావు సతీమణి బెల్లాన శ్రీదేవి చీపురుపల్లి మేజర్ పంచాయతీకి కాంగ్రెస్ నుంచి బరిలో నిలవగా, అదే పంచాయతీకి మరో కాంగ్రెస్ వర్గీయుడు మీసాల వరహాలరావు సతీమణి సరోజిని బరిలో దిగింది.
దీంతో నేతలు ఎవరిని ఓదార్చాలో అర్థంగాక తలలు పట్టుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం నేతలు సరోజినికి మద్దతుపలికేందుకు ముందుకు వచ్చినట్టు సమాచారం. దీంతో ఈ ఎన్నిక మలుపు ఎటుతిరుగుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దత్తిరాజేరు, మానాపురం, గంట్యాడ, ఎస్.కోట, విజయనగరం మండలాల్లో నేతలు సుడిగాలి పర్యటనలు జరుపుతున్నారు. ఏది ఏమైనా మరో రెండు రోజులే ప్రచారానికి గడువు ఉండటంతో నేతలు నానా హైరానా పడుతున్నారు.

అరగంట వ్యవధిలో తండ్రి, కూతురు హఠాన్మరణం
కురుపాం, జూలై 23: కూతురు చనిపోయిందన్న బాధను జీర్ణించుకోలేక తండ్రి చనిపోయిన సంఘటన ఇక్కడ జరిగింది. మంగళవారం కురుపాం పంచాయతీ శివ్వన్నపేటకు చెందిన కొత్తకోట కృష్ణారావు(48), అతని కుమార్తె నీలవేణి(10) ఇద్దరూ అరగంట వ్యవధిలో చనిపోయారు. నీలవేణికి మంగళవారం వేకువ జామున ఆస్త్మాతో ఊపిరి అందకపోవడంతో ఆసుపత్రికి తీసుకువచ్చారు. కురుపాంలో ఆక్సిజన్ సదుపాయం లేకపోవడంతో పార్వతీపురం తరలించారు. అక్కడ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. దీనిని చూసి తట్టుకోలేక తండ్రి కృష్ణారావు కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. బిపి తగ్గి అక్కడికక్కడే మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. అర గంట వ్యవధిలోనే చనిపోయిన వీరిద్దరి మృతదేహాలను మంగళవారం కురుపాం తీసుకువచ్చారు. తండ్రీకూతుళ్లు మృతిచెందిన విషయం తెలుసుకున్న గ్రామస్థులు తీవ్ర ఆవేదన చెందారు. కృష్ణారావు చిరువ్యాపారి. ఈయనకు భార్య ఈశ్వరమ్మ, నలుగురు ఆడ పిల్లలు. ఇద్దరు ఆడ పిల్లలకు వివాహం జరిగింది. మిగిలిన ఇద్దరిలో నీలవేణి శివ్వన్నపేట పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. కుమార్తె మరణాన్ని జీర్ణించుకోలేక కృష్ణారావు చనిపోయినట్లు బంధువులు తెలిపారు. ఆక్సిజన్ వెంటనే అందించకపోవడం, 108 సిబ్బంది సమ్మెలో ఉండటంతోనే చిన్నారి ప్రాణం పోయిందని పలువురు ఆరోపిస్తున్నారు. వీరి ఇద్దరి మరణంతో కురుపాం, శివ్వన్నపేట గ్రామాలు దుఃఖ సాగరంలో మునిగిపోయాయి.

జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో
english title: 
p

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles