Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ద్వితీయార్ధంలో పురోగతి శూన్యం

$
0
0

ముంబయి, జూలై 24: ఈ ఏడాది ద్వితీయార్ధంలో దేశ ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి పురోగతి కనిపించకపోవచ్చని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడిస్‌కు చెందిన ఆర్థిక నిపుణులు విశే్లషించారు. ప్రథమార్ధంలో పెట్టుబడులు, తయారీ రంగంలో మందగమనం ప్రభావమని బుధవారం మూడీస్ విశే్లషకులు అభిప్రాయపడ్డారు. ఈ మందగమనం మరిన్ని రంగాలకు విస్తరించడం వల్ల ఆర్థిక పురోగతి కానరాదని మూడీస్ సీనియర్ ఆర్థిక విశే్లషకులు గ్లేన్ లెవిన్ తెలిపారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న క్రమంలో ఎన్నికలకు ముందు ఎలాంటి చెప్పుకోదగ్గ సంస్కరణలు ఉండకపోవచ్చన్నారు. గడిచిన 2012-13 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక పురోగతి 5 శాతం మాత్రమేనని, పారిశ్రామిక ప్రగతి గణాంకాల్లోనూ ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ వృద్ధి నమోదు కాలేదన్నారు. అయినప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరంలో జిడిపి 6 శాతం నమోదవగలదనే ఆశాభావం ప్రభుత్వం నుంచి వ్యక్తమవుతుండగా, ఈసారి జిడిపి ఎంత ఉంటుందనేదానిపై మూడిస్ నిపుణులు ఎలాంటి అంచనాలు వెలిబుచ్చలేదు. అయితే డాలర్ విలువతో పోల్చితే రూపాయి విలువ రికార్డు స్థాయిలో పతనమవుతుండటం, ద్రవ్యవిధానాన్ని ఆర్‌బిఐ సరళతరం చేయడంలో వెనుకాడుతున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరం జిడిపి 5 శాతంగానే అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో ఆ అంచనాలకు తగ్గట్లు మూడీస్ కూడా ఇప్పుడు ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఎలాంటి ఆర్థిక పురోగతి ఉండదనే అభిప్రాయాన్ని వెలిబుచ్చడం ఆందోళన కలిగిస్తోంది.

నిరాశపరిచిన ‘హీరో’ ఫలితాలు

త్రైమాసిక ఫలితాలు

న్యూఢిల్లీ, జూలై 24: దేశీయ ఆటో రంగంలో ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ నికర లాభాలు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 11 శాతం క్షీణించాయి. ఏప్రిల్-జూన్ వ్యవధిలో 548.58 కోట్ల రూపాయల నికర లాభాలను హీరో మోటోకార్ప్ ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో 615.46 కోట్ల రూపాయల నికర లాభాలను ఈ సంస్థ అందుకుంది.
అధిక పన్నుల భారంతోపాటు ముందస్తు వర్షాకాలం అమ్మకాలను దెబ్బతీసిందని పేర్కొంది. కాగా, నికర అమ్మకాల విలువ క్రితంతో పోల్చితే ఈసారి 6,207.78 కోట్ల రూపాయల నుంచి 6,126.84 కోట్ల రూపాయలకు పడిపోయాయని సంస్థ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇక ఈ ఏప్రిల్-జూన్ కాలంలో 15,59,282 యూనిట్ల అమ్మకాలు జరిగాయని, గతంలో 16,42,292 యూనిట్ల అమ్మకాలు జరిగాయని వివరించింది.
తగ్గిన కెయిర్న్
ఇండియా లాభాలు
చమురు రంగ సంస్థ కెయిర్న్ ఇండియా లాభాలు ఈ ఏప్రిల్-జూన్‌లో 18 శాతం పడిపోయాయి. పన్ను చెల్లింపుల తర్వాత సంస్థ నికర లాభాలు 3,127 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. ఇంతకుముందు 3,826 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు కెయిర్న్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. రాజస్థాన్ చమురు క్షేత్రాల్లో ప్రభుత్వ వాటా పెరగడం, చమురు ధరలు నిరాశాజనకంగా ఉండటం లాభాల క్షీణతకు కారణమని పేర్కొంది.
సెంట్రల్ బ్యాంక్
లాభాల్లో 93 శాతం క్షీణత
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర లాభాలు ఏప్రిల్-జూన్ కాలంలో 93.5 శాతం క్షీణించాయి. ఈసారి 21.93 కోట్ల రూపాయల నికర లాభాలను మాత్రమే అందుకున్న ఈ సంస్థ.. క్రిందటిసారి 335.9 కోట్ల రూపాయల నికర లాభాలను సొంతం చేసుకుంది.
మొండి బకాయిలు పెరిగిపోవడమే లాభాల క్షీణతకు కారణమని బుధవారం తెలిపిం ది. అయితే ఆదాయం మా త్రం 5,62 4.97 కోట్ల రూపాయల నుంచి 6,44 3.45 కోట్ల రూపాయలకు పెరిగింది.
ఇండియాబుల్స్ సెక్యూరిటీస్ లాభాలు రెండింతలు
ఇండియాబుల్స్ సెక్యురిటీస్ ఏకీకృత నికర లాభాలు గతంతో పోల్చితే రెండింతలకుపైగా పెరిగాయి. సంస్థ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం ఈ జూన్ 30తో ముగిసిన మూడు నెలల కాలంలో 21.42 కోట్ల రూపాయల నికర లాభాలను నమోదు చేసింది. అంతకుముందు 9.82 కోట్ల రూపాయల నికర లాభాలను పొందింది. ఆదాయం సైతం 41.23 కోట్ల రూపాయల నుంచి 63.13 కోట్ల రూపాయలకు పెరిగింది.
38 శాతం పెరిగిన
యెస్ బ్యాంక్ లాభాలు
ముంబయి: ప్రైవేట్‌రంగ బ్యాంకిం గ్ సంస్థ యెస్ బ్యాంక్ నికర లాభాలు ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 38.1 శాతం పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో 290.1 కోట్ల రూపాయల లాభాలను పొందిన ఈ సంస్థ ఇప్పుడు 400.8 కోట్ల నికర లాభాలను సొంతం చేసుకుంది. ఆదాయం కూడా క్రిందటిసారితో పోల్చితే 2,174.4 కోట్ల రూపాయల నుంచి 2,839.9 కోట్ల రూపాయలకు పెరిగింది.

వరుస లాభాలకు బ్రేక్

ముంబయి, జూలై 24: దేశీయ స్టాక్‌మార్కెట్లలో వరుస లాభాలకు బుధవారం బ్రేకులు పడ్డాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 211.45 పాయింట్లు నష్టపోయి 20,090.68 వద్ద, జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 87.30 పాయింట్లు క్షీణించి 5,990.50 వద్దకు దిగజారాయి. బ్యాంకింగ్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురవడంతో మార్కెట్లు నష్టపోయాయి. నష్టపోయిన వాటిలో ప్రధానంగా జిందాల్ స్టీల్, లార్సెన్ షేర్లతోపాటు ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఎస్‌బిఐ తదితర షేర్లు ఉన్నాయి.
నెల గరిష్ఠానికి రూపాయి
రిజర్వ్ బ్యాంకు తీసుకున్న తాజా చర్యలతో డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ నెల గరిష్ఠ స్థాయిని అందుకుంది. బుధవారం నాటి ట్రేడింగ్‌లో 63 పైసలు పెరిగి 59.13 వద్ద స్థిరపడింది.

దేశ ఆర్థిక వ్యవస్థపై మూడీస్ నిపుణుల విశే్లషణ
english title: 
d

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>