హైదరాబాద్, జూలై 25: ఈ నెల 27న జరుగనున్న రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టరు బి.శ్రీధర్ వెల్లడించారు. చేవెళ్ళ డివిజన్‌లోని 9 మండలాల్లో 222 గ్రామ పంచాయతీలకు, 2204 వార్డులకు ఎన్నిక జరుగనుందని తెలిపారు. డివిజన్‌ను 71 క్లస్టర్లుగా విభజించడం జరిగిందని, ఎన్నికల విధులు నిర్వహించేందుకు 80 స్టేజి-1 అధికారులను, 2204 మంది ప్రిసైడింగ్ అధికారులను, 2694 మంది పోలింగ్ అధికారులను నియమించడం జరిగిందని అన్నారు. చేవెళ్ల డివిజన్‌లోగల మొత్తం 2204 పోలింగ్ స్టేషన్లలో 47 అతిసున్నిత, 71 సున్నిత పోలింగ్ కేంద్రాలుగా గుర్తించడం జరిగిందని, వాటికి అదనపు భద్రత కల్పించామని కలెక్టరు వెల్లడించారు. ఈ పోలింగ్ స్టేషన్లలో జరిగే పోలింగ్ ప్రక్రియను వెబ్‌కాస్టింగ్/వీడియోగ్రఫీ ద్వారా గమనించనున్నట్లు ఆయన పేర్కొంటూ 73 మంది సూక్ష్మ పరిశీలకులు కూడా పోలింగ్‌ను నిశితంగా గమనిస్తుంటారని తెలిపారు. చేవెళ్ల డివిజన్ ఆర్‌డిఓ నాగేందర్, డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారిగాను, ఆయా మండలాల తహసీల్దార్లు, అధనపు సహాయ జిల్లా ఎన్నికల అధికారులు, ఎంపిడిఓలు, సహాయ జిల్లా ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తారని తెలిపారు. మొత్తం 1,81,379 మంది పురుషులు, 1,75,220 మంది మహిళలు ఈ ఎన్నికల్లో ఓటు వేయనున్నట్లు కలెక్టరు తెలిపారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలకు పురస్కరించుకొని చేవెళ్ల డివిజన్‌లోని ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యా సంస్థలకు ఈ నెల 27న స్థానిక సెలవు దినంగా ఇదివరకే ప్రకటించడం జరిగిందని ఆయన అన్నారు. అదేవిధంగా పోలింగ్ స్టేషన్లుగా వినియోగించే ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు పోలింగ్‌కు ఒక రోజు ముందు కూడా స్థానిక సెలవు దినంగా ప్రకటించామని పేర్కొన్నారు. ఓటర్లు ఫొటో గుర్తింపు కార్డులు తీసుకొని రావాలని సూచించారు. గుర్తింపు కార్డులు లేని పక్షంలో డ్రైవింగ్ లైసెన్సు, ఆధార్ కార్డు, పాస్‌పోర్టు తదితర 21 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తీసుకొని వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవలసిందిగా సూచించారు. జూలై 27న ఉ.గం.7.00ల నుండి మ.గం.1.00ల వరకు జరిగే పోలింగ్‌లో ఓటర్లందరూ సంబంధిత పోలింగ్ కేంద్రాలలో నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఓటు వేయాల్సిందిగా కలెక్టరు సూచించారు.
ఎన్నికల విధులకు ప్రైవేటు బస్సులు
దోమ, కుల్కచర్ల, గండీడ్, పరిగి మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి జిల్లా యంత్రాంగం ప్రైవేటు బస్సులను ఏర్పాటుచేసిందని రంగారెడ్డి జిల్లా కలెక్టరు బి.శ్రీ్ధర్ తెలిపారు. ఈ బస్సులన్ని జూలై 26న ఉ.గం.6.00లకు మెహిదీపట్నం నుండి బయలుదేరుతాయని అన్నారు. అదేవిధంగా మొయినాబాద్, చేవెళ్ల, షాబాదు మండలాల్లో ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందిని కూడా ఆయా మండల హెడ్ క్వార్టర్స్‌కు చేరేందుకు మెహిదీపట్నంలోని నానల్‌నగర్ జంక్షన్ వద్దగల ఆర్డీఓ కార్యాలయం నుండి శుక్రవారం ఉ.గం.6.00లకు ప్రైవేటు బస్సులను ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు. సంబంధిత పోలింగ్ సిబ్బంది శుక్రవారం ఉ.గం.6.00లకల్లా నిర్దేశిత స్థానాల్లో బస్సుల్లో ఎక్కి తమకు కేటాయించిన మండలాలకు చేరుకోవాల్సిందిగా ఆయన సూచించారు. ఈ విషయంలో సమయపాలనను కచ్చితంగా పాటించాలని లేని పక్షంలో పంచాయతీలకు వెళ్లడంలో ఆలస్యమవుతుందని ఆయన పోలింగ్ సిబ్బందికి స్పష్టం చేశారు.
ఎన్నికలకు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు: సివి ఆనంద్
గచ్చిబౌలి: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 27న జరగబోవు రెండో విడత ఎన్నికలకు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమీషనర్ సివి ఆనంద్ తెలిపారు. కమిషనర్ విలేఖర్లతో మాట్లాడుతూ శనివారం జరిగే రెండో విడతలో 44 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నట్లు సిపి తెలిపారు. ఎన్నికల సమయంలో పోలీసు అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీచేయడం జరిగింది. పోలీసు అధికారులు కఠినంగా వ్యవహరించడంతో మొదటి విడత ఎన్నికలు ప్రశాంతం జరిగాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. శుక్రవారం ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో పర్యటిస్తున్నట్లు సిపి తెలిపారు. ఎస్‌ఓటిని రెండు విభాగాలు చేసి అడిషనల్ డిసిపిలను నియమించి ప్రస్తుతం ఉన్న 15 మందికి బదులుగా 20 మంది సిబ్బందిని పెంచాలని యోచిస్తున్నట్లు సిపి తెలిపారు. ట్రాఫిక్ సమస్యను త్వరలో అధిగమిస్తామని చెప్పిన ఆయన ట్రాఫిక్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని కమీషనర్ వెల్లడించారు. సైబరాబాద్‌లో పనిచేస్తున్న పోలీసు కానిస్టేబుళ్లకు కూడా సిఆర్‌పి, ఐపిసిలపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొందరు పోలీసు అధికారులు దురుసుగా వ్యవహరిస్తున్నారని విలేఖర్లు ప్రశ్నించగా పనిచేసే వారిపై విమర్శలు సహజమేనని, అయితే ప్రజల హక్కులకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు.
ఈ నెల 27న జరుగనున్న రెండవ విడత గ్రామ పంచాయతీ
english title:
second round
Date:
Friday, July 26, 2013