వికారాబాద్, జూలై 25: రంగారెడ్డి జిల్లాలో రెండో విడతగా చేవెళ్ళ డివిజన్‌లో ఈనెల 27న జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు భారీ పోలీసుబందోబస్తు ఏర్పాటు చేసినట్లు రంగారెడ్డి జిల్లా ఎస్పీ బి.రాజకుమారి తెలిపారు. గురువారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ప్రచారం ముగిసినందున మద్యం దుకాణాలను మూయించామన్నారు. వాయిలెంట్ ఆఫ్ మోడల్ కండక్ట్‌లో భాగంగా స్టాటిక్ సర్వలెంట్ టీం పర్యటిస్తోందని, టీంలో ఎస్‌హెచ్‌వో, తహశీల్దార్ ఉంటారని ఫిర్యాదు వస్తే పరిశీలించి కేసు నమోదు చేస్తారన్నారు. ఎన్నికలు జరగున్న 167 గ్రామ పంచాయతీల్లో 1574 వార్డులున్నాయని తెలిపారు. అందులో 17 అతి సమస్యాత్మక, 76 సమస్యాత్మక, 74 సాధారణ గ్రామాలున్నాయని తెలిపారు. 46 రూట్లుగా విభజించి మొబైల్ వాహనాలను ఏర్పాటు చేశామని, ప్రతి మొబైల్‌లో ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్ళుంటారని తెలిపారు. బ్యాలెట్ బాక్సులను పోలింగ్ కేంద్రాలకు చేర్చే బాధ్యత మొబైల్‌పార్టీదేనని తెలిపారు. మొత్తం 338 పోలింగ్ స్టేషన్లున్నాయని తెలిపారు. పోలింగ్‌రోజు రూటు మొబైల్‌తో పాటు ఎస్కార్టు తిరుగుతుందన్నారు. ఇన్‌స్పెక్టర్లు ఇంచార్జిలుగా 60 మందితో కూడిన స్ట్రైకింగ్ ఫోర్స్, 45 మందితో కూడిన ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్స్ బందోబస్తులో పాల్గొంటుందన్నారు. మండలానికో డిఎస్పీని ఇంచార్జిగా నియమించనున్నట్లు తెలిపారు. జిల్లాలో నాలుగు ప్లటూన్‌లుండగా, 300 మంది పోలీసులతో కూడిన 15 ప్లాటూన్‌లు ఏపిఎస్పీ నుండి రానున్నాయన్నారు. సిఐడి, వరంగల్, బీచ్‌పల్లి, ట్రెయినీకి చెందిన 20 మంది డిఎస్పీలు, 15 మంది సిఐలు, సైబరాబాద్ నుండి రెండు సాయుధ దళాలు, వికారాబాద్ డిటిసితో పాటు మెదక్, వరంగల్ పిటిసి, హైద్రాబాద్ శిక్షణా కేంద్రాల్లో శిక్షణ పొందుతున్న వారితో పాటు 150 మంది ఎస్‌ఐలు, బయట నుండి వచ్చే 1200 మంది, జిల్లాకు చెందిన 800 మందితో కలిపి రెండు వేల మందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలో 1349 మంది బైండోవర్
గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఇప్పటివరకు 155 కేసుల్లో 1349 మందిని బైండోవర్ చేసినట్లు తెలిపారు. ఎన్నిలక కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ఐదు కేసులు నమోదవగా, 22 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. ఎక్సైజ్‌కు సంబంధించి 25 కేసులను నమోదు చేసి దాదాపు నాలుగు లక్షల రూపాయల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఐదు లక్షల నగదును పట్టుకున్నామని, 50 లీటర్ల ఐడిని స్వాధీనం చేసుకున్నామన్నారు.
ముమ్మరంగా పోలీసు తనిఖీలు
వికారాబాద్ డివిజన్‌లో మూడో విడతలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఎన్నికలు జరుగుతున్న గ్రామాలకు పరిమితికి మించి మద్యం వెళ్ళకుండా వారు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. వికారాబాద్ ఎస్‌ఐ హన్మ్యానాయక్ ఆధ్వర్యంలో బృందంతో హైద్రాబాద్ రోడ్డుపై తనిఖీలు నిర్వహించారు.
మద్యం బాటిళ్ల పట్టివేత
షాబాద్: షాబాద్ మండల పరిధిలోని సర్దానగర్ సమీపంలో అనుమానస్పదంగా ఆటో దొరికిందని పోలీసులు తెలిపారు. ఆటోలో 196 మద్యం బాటిళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. కక్కుదార్ గ్రామానికి చెందిన పట్నం శ్రీకాంత్, సర్దానగర్ గ్రామానికి చెందిన వెంకటేశంను అరెస్టు చేసినట్లు తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో తమ మద్దతు అభ్యర్థులను గెలిపించడంలో భాగంగా మద్యం పంచడానికి తీసుకెళ్తున్నట్లు నిందితులు పేర్కొన్నారని పోలీసులు స్పష్టం చేశారు. పంచయతీ ఎన్నికలలో ఎలాంటి అవాంచనీయ సంఘటన జరగకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐలు సత్యనారాయణ, నాగరాజు పేర్కొన్నారు. సమస్యాత్మక గ్రామల్లో సిసి కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసామని తహశీల్దార్ యాదయ్య పేర్కొన్నారు. మల్లారెడ్డిగూడ, మక్తగూడ, ఎర్రలిల్లి, బోబిలింగం, చందనవెల్లిలో వీడియో కెమెరాలు, దామర్లపల్లి, మాచనపల్లి, నాగర్‌కుంట, రేగడిదోస్వాడ, షాబాద్, మద్దుర్, తాళ్లపల్లి, తిరుమలపూర్, సోలిపేట, సర్దానగర్, బోడంపహాడ్‌లో మైక్రో కెమెరాలను అమరుస్తామని తెలిపారు.
గ్రామాల్లో ఓటరు చిట్టీల పంపిణీ
ధారూర్: గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల్లో భాగంగా ఓటర్లకు ఎన్నికల ఓటరు చిట్టీలను సాక్షరభారత్ గ్రామ కోఆర్డినేటర్లు, అంగన్‌వాడి టీచర్లు పంపిణీ చేస్తున్నారు. ఓటరు చిట్టీలను గతంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులే పంపిణీ చేసేవారు. చిట్టీల పంపిణీ సమయంలో ఓటర్లను అభ్యర్థులు ప్రభావితం చేస్తున్నారనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా ప్రభుత్వమే ఈ చిట్టీల పంపిణీ బాధ్యతను చేపట్టింది. మండలంలో 22 గ్రామ పంచాయతీలలో చిట్టీల పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది.
రంగారెడ్డి జిల్లాలో రెండో విడతగా చేవెళ్ళ డివిజన్‌లో ఈనెల 27న
english title:
security
Date:
Friday, July 26, 2013