చాంద్రాయణగుట్ట, జూలై 25: హకీంపేట్‌లోని ఎపి స్పోర్ట్స్ స్కూల్‌లో రాష్ట్రంలోని వివిధ స్పోర్ట్స్ స్కూల్‌లో ప్రవేశం కోసం 2013-14 విద్యా సంవత్సరానికి గాను నిర్వహించిన ఎంపిక పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. ఎంపిక పోటీలో భాగంగా జోన్-1 పరిధిలోని వరంగల్, కరీంనగర్, ఖమ్మం, గుంటూరు, నిజామాబాద్, కృష్ణా జిల్లా పోటీలు హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్‌లో నిర్వహించారు. ఈ పోటీలకు ఆరు జిల్లాల నుండి మొత్తం 147 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విరీలో 113 మంది బాలురు, 34 మంది బాలికలున్నారు. ఎంపిక పోటీలో భాగంగా విద్యార్థులకు వివిధ అంశాల్లో పరీక్షలు నిర్వహించారు. ఎత్తు, బరువు, ఫ్లేక్సిబ్లిటీ, స్టాండింగ్ వర్టీకల్ జంప్, స్టాండింగ్ బోర్డు జంప్, మెడిసిన్ బాల్‌పూట్, 800 మీటర్ల పరుగు పందెంతో పాటు వివిధ పోటీలు నిర్వహించారు. పోటీలకు ముందు విద్యార్థుల సర్ట్ఫీకెట్లను పరిశీలించారు. ఈ ఎంపిక పోటీల ప్రక్రియాను ఎప్పటికప్పుడు పరిశీలించి తనిఖీ చేసిన వారీలో హకీంపేట్ ఎపి స్పోర్ట్స్ స్కూల్ స్పెషలాఫీసర్ డా.కె.నర్సయ్య, శాప్ డిప్యూటీ డైరెక్టర్ జిఎ.శోభ, ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎస్‌ఎం ఆరీఫ్ ఉన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఎంపిక పోటీలకు ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం ప్రతినిధితో పాటు రాష్ట్రానికి చెందిన పలువురు క్రీడాకారులు హజరు కాకపోవడం విశేషం. ఎంపిక పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు విద్యార్థులకు ఏలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని స్పోర్ట్స్ స్కూల్ స్పెషలాఫీసర్ నర్సయ్య తెలిపారు. ఎంపిక పోటీల నిర్వహణ సందర్భంగా అయా క్రీడాంశాలకు చెందిన కోచ్‌లను కూడా నియమించిన్నట్లు పేర్కొన్నారు. ఈ ఎంపిక పోటీలు ఆగస్టు 1 వరకు కొనసాగుతాయని వెల్లడించారు.
హకీంపేట్‌లోని ఎపి స్పోర్ట్స్ స్కూల్‌లో రాష్ట్రంలోని వివిధ స్పోర్ట్స్
english title:
sports school
Date:
Friday, July 26, 2013