Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ల్యాబ్ టు ల్యాండ్

$
0
0

అనంతపురం, మార్చి 1 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు అమలుచేస్తున్న వివిధ పథకాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు చేరువ చేసేందుకు ‘ల్యాబ్ టు ల్యాండ్’ అనే వినూత్న కార్యక్రమాన్ని జిల్లాలో చేపట్టనున్నట్లు కలెక్టర్ వి.దుర్గాదాస్ వెల్లడించారు. స్థానిక జడ్పీ ప్రత్యేక అధికారి ఛాంబరులో గురువారం మధ్యాహ్నం కలెక్టర్ వివిధ శాఖలకు చెందిన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కో సం ప్రభుత్వం గ్రామీణ పేదరిక నిర్మూలన, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, నీటి సరఫరా పథకం, ఇందిరా ఆవాస్ యోజన, స్వర్ణ జయంతి గ్రామీణ స్వరాజ్‌గార్ యోజన, సమగ్ర బంజరు భూముల అభివృద్ధి పథకం తదితర పథకాలెన్నో అమలు చేస్తున్నట్లు తెలిపారు. వాటి సమాచారం ఇంకా కొంత శాతం మంది లబ్దిదారులకు తెలియక పోవడం వల్ల చాలా మంది లబ్దిదారులకు అర్హత ఉండి వాటిని వినియోగించుకోలేక పోతున్నారన్నారు. ఆయా పథకాల మార్గదర్శకాలు, నిర్దేశిత లక్ష్యాల గురించి ప్రజలకు తెలియపరచాలనే సంకల్పంతో కేంద్ర కార్యాలయం నుంచి క్షేత్రస్థాయిలో పనిచేసే వారి వరకు అందరినీ భాగస్వాములను చేస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి త్వ శాఖ ల్యాబ్ టు ల్యాండ్ అనే వినూత్న విధానాన్ని చేపట్టిందన్నారు. విజ్ఞానవంతమైన సాధికారత పొందిన సమాజమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మూలాధారం అనే నినాదంతో ఎంపిక చేసిన మం డలాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగా మం డలానికి రెండు గ్రామాలు ఎంపిక చేసి ఆ గ్రా మాల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్గించాలన్నారు. ఈ కార్యక్రమం అమలుకు జిల్లా కలెక్టరు అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ ఉంటుందని అందులో జడ్పీ సిఇఓ కన్వీనర్‌గా, డ్వామా, డిఆర్‌డిఏ, హౌసింగ్ పిడిలు, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఎస్‌ఈలు, ఎస్సీ కార్పొరేషన్ ఇడి, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక శాఖ, నెహ్రూ యువ కేంద్రం, ఆకాశవాణి, ఎన్‌ఐసి, ఎన్‌జిఓలు సభ్యులుగా ఉంటారన్నారు. గ్రామాల్లోని ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు భారత్ నిర్మాణ్ వాలంటీర్లు స్వఛ్చందంగా ముందుకు రావాలన్నారు. మండల ప్రత్యేకాధికారు లు, ఎంపిడిఓలు కలిసి గ్రామాలను ఎంపిక చేయాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో ఆత్మకూరు మండలం వడ్డిపల్లె గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే 22 మంది భారత్‌నిర్మాణ్ వాలంటీర్లు గ్రామంలో పనిచేసేందుకు ముందుకు వచ్చారని వారందరినీ ఈ సందర్భంగా అభినందిస్తున్నామన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు వారి శాఖలు అమలు చేస్తున్న పథకాలపై రూపొందించిన కరపత్రాలు, పుస్తకాలు, ల్యాబ్ టు ల్యాండ్ కార్యక్రమం కన్వీనర్‌కు అందచేయాలన్నారు. ఎంపికైన భారత్ నిర్మాణ్ వాలంటీర్లకు హైదరాబాద్‌లోని అపార్డ్ కమిషనర్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. సమావేశంలో ఎస్‌ఈలు వినయ్‌కుమార్, రవికుమార్, హౌసింగ్ పిడి ప్రసా ద్, డ్వామా అదనపు పిడి మునాఫ్, ఎన్‌ఐసిడిఐఓ రామసుబ్బారెడ్డి జిల్లా శిక్షణా కేంద్రం మేనేజర్లు నరసింహారెడ్డి, శివయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
* పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఆంక్షలు
* ఆర్‌ఐఓ వన్నప్ప
అనంతపురం సిటీ, మార్చి 1: ఇంటర్మీడియట్ పరీక్షలకు జిల్లాలోని అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలులో ఉండేలా పోలీసుశాఖ సహకారం తీసుకుంటామని ఆర్‌ఐఓ వన్నప్ప తెలిపారు. గురువారం స్థానిక ఆర్‌ఐఓ కార్యాలయంలో ఇంటర్ పరీక్షలపై విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీగా అన్ని ఏర్పాట్లును పూర్తి చేశామని తెలిపారు. ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు పరీక్షలను జరుగుతాయని తెలిపారు. జిల్లాలో 97 పరీక్ష కేంద్రాలలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అందులో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 50, 7ఎయిడెడ్, 9 రెసిడెన్షియల్, 31 ప్రైవేటు జూనియర్ కళాశాలలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇంటర్ మొదటి సంవత్సరంలో జనరల్ 29,764 మంది విద్యార్థులు, ఓకెషనల్‌లో 3,193, రెండవ సంవత్సరంలో జనరల్ 31,604 మంది విద్యార్థులు, ఓకెషనల్‌లో 4,042 పరీక్షలు వ్రాస్తున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాలను పోలీసుల అధ్వర్యంలో 4 ఫ్లైయింగ్ స్వ్కాడ్స్, అధ్యాపకుల ఆధ్వర్యంలో 12 సిట్టింగ్ స్వ్కాడ్స్‌ను, వీరితోపాటు డివిఈఓ గోపినాయక్, డిసిఈబి సభ్యులు పరీక్ష కేంద్రాలను తనీఖీ చేస్తారని ఆయన తెలిపారు. జిల్లాలో 8 సమస్యాత్మక పరీక్ష కేంద్రాలుగా నిర్ణయించామని తెలిపారు. బస్సు సౌకర్యం లేని 16 పరీక్ష కేంద్రాలకు పరీక్ష సమయానికి బస్సులను నడపాలని ఆర్‌టిసి ఆర్‌ఎంను కోరినట్లు తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొన్ని సెంటర్లలో పర్నిచర్ లేకపోవడంతో విద్యార్థులు కింద కూర్చునే పరీక్షలు రాయాల్సి ఉంటుందని తెలిపారు. పరీక్ష కేంద్రాల లోపల ఎటువంటి మాస్ కాఫీయింగ్ జరగకుండా అన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్ష కేంద్రా వద్ద ఉదయం 7 నుండి 144 సెక్షన్‌ను విధించాలని పోలీసు శాఖను కోరినట్లు తెలిపారు.
సైన్స్ విద్యార్థులకు 60శాతం పైన హాజరు ఉండాలి
జూనియర్ కళాశాలలో సైన్స్ విద్యార్థులకు 60శాతంపైగా హాజరు ఉండాలని ఆయన తెలిపారు. జిల్లాలో కొన్ని జూనియర్ కళాశాలలో విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వలేదని కొన్ని సంఘాలు కళాశాలల వద్దకు వచ్చి హాల్‌టికెట్లు ఇవ్వమని ఓత్తిడి తీసుకరావాడాన్ని సంఘాలు ప్రోత్సహించవద్దని కోరారు. అలా చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు పాడవుతుందని తెలిపారు.
రిజర్వేషన్లపై ఆశావహుల్లో ఉత్కంఠ!
* బిసి ఓటర్ల గణనపై ఆరా
హిందూపురం, మార్చి 1: త్వరలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు సాగిస్తున్న నేపథ్యంలో వార్డులు, మున్సిపల్ చైర్మన్ పదవుల రిజర్వేషన్‌లపై ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తోంది. జిల్లాలో అన్ని మున్సిపాలిటీల కాల పరిమితి ముగియడంతో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కించుకునేందుకు కాంగ్రెస్, టిడిపి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ వంటి రాజకీయ పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు అప్పుడే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కౌన్సిలర్లు, చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్న నాయకులు బిసి ఓటర్ల గణనపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. తమ వార్డు ఏ వర్గానికి రిజర్వు అవుతుందోనన్న ఉత్కంఠకు గురవుతున్నారు. ఇదే విషయమై మున్సిపల్ అధికారులు, సిబ్బందితో బిసి ఓటర్ల గణనపై వివరాలు తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో 50 శాతం సీట్లు మహిళలకు రిజర్వు అవుతుండటంతో పదవులపై ఆశలు పెంచుకున్న నాయకుల్లో గుబులు పుట్టిస్తోంది. అనంతపురం నగర పాలక సంస్థతో పాటు హిందూపురం, ధర్మవరం, రాయదుర్గం, కదిరి, గుంతకల్లు, తాడిపత్రి మున్సిపాలిటీలు ఇప్పటికే ఉండగా ఇటీవల మడకశిర, కళ్యాణదుర్గం, పుట్టపర్తి, పామిడిలను నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయా నగర పంచాయతీల్లో కూడా ఓటర్ల జాబితా తయారు చేసే ప్రక్రియలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. పాత, కొత్త మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. గత పాలక వర్గాల్లో కేవలం కదిరి మున్సిపాలిటీకి మాత్రమే మహిళా చైర్మన్‌గా వేమల ఫర్హాన బాధ్యతలు నిర్వహించారు. తాజా రిజర్వేషన్‌లతో జిల్లాలో సగానికి పైగా మహిళా కౌన్సిలర్లు, మహిళా చైర్‌పర్సన్‌లు ప్రాతినిధ్యం వహించే అవకాశాలు ఉన్నాయి. దీంతో రిజర్వేషన్‌ల ప్రక్రియపై ఆయా పదవులపై ఆశలు పెట్టుకున్న నాయకులు ఆతృతగా ఉన్నారు. ఒకవేళ తమకు అవకాశం లభించకపోతే తమ సతీమణులను రంగంలోకి దించేందుకు అప్పుడే ఎత్తులు వేస్తున్నారు. కాగా బిసి ఓటర్ల గణన విస్తృతంగా సాగుతుండగా గత నెల 28వ తేదీన ముసాయిదా బిసి ఓటర్ల జాబితాను మున్సిపల్ అధికారులు విడుదల చేశారు. ఈ నెల 3వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తుండగా 4 నుండి 9వ తేదీ వరకూ అభ్యంతరాలపై విచారణ జరుపుతారు. ఈ నెల 12వ తేదీన వార్డుల వారీగా తుది బిసి ఓటర్ల జాబితాను ఆయా మున్సిపల్ అధికారులు విడుదల చేస్తారు. ఆ ఓటర్ల జాబితాను ఈ నెల 13, 14వ తేదీల్లో మున్సిపల్ ఉన్నతాధికారులు నివేదిస్తుండగా 20వ తేదీన ఉన్నతాధికారులు ప్రభుత్వానికి రిజర్వేషన్‌ల ఖరారు కోసం ప్రతిపాదించనున్నారు. హిందూపురం మున్సిపాలిటీలో 38 వార్డులు ఉండగా అందులో 87,457 మంది ఓటర్లు ఉండగా దాదాపు 35,860 దాకా బిసి ఓటర్లు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా బిసి ఓటర్ల గణన ప్రక్రియ పూర్తయితే తప్ప రిజర్వేషన్‌లపై అవగాహన వచ్చే అవకాశం లేకపోవడంతో ఆశావహులను ఉత్కంఠకు గురి చేస్తోంది.
తాగునీటి ఎద్దడిని సమర్థవంతంగా ఎదుర్కోవాలి
* అధికారులకు కలెక్టర్ ఆదేశం
అనంతపురం టౌన్, మార్చి 1: జిల్లాలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కంటింజెన్సీ ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ దుర్గాదాస్ ఆదేశించారు. రెవెన్యూ డివిజన్లవారీగా తాగునీటి సరఫరాను 15 రోజులకొకసారి సమీక్షించేందుకు స్పెషలాఫీసర్లను నియమించారు. అనంతపురానికి జాయింట్ కలెక్టర్ అనితా రామచంద్రన్, పెనుకొండకు అదనపుజె.సి చెన్నకేశవరావు, ధర్మవరానికి జడ్‌పి సిఇఓ వెంకటసుబ్బారెడ్డిని నియమించారు. అలాగే అసంపూర్తిగా ఉన్న తాగునీటి పథకాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. గురువారం స్థానిక జడ్‌పి కౌన్సిల్ హాలులో ఆర్‌డబ్ల్యూఎస్, మున్సిపాలిటీలు, పబ్లిక్ హెల్త్ ఇఇలు, డిఇఇలు, కమిషనర్లతో తాగునీటి ఎద్దడి నివారణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్ష జరిపారు. కలెక్టర్ దుర్గాదాస్ మాట్లాడుతూ విద్యుత్ కోతలు, లో వోల్టేజీ సమస్యల కారణంగా తాగునీటి సరఫరాలో సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్, ఎంపిడిఓలు, ట్రాన్స్‌కో, మున్సిపల్, పబ్లిక్‌హెల్త్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. పైపులైను లీకేజీలను సత్వరం అరికట్టాలని సూచించారు. లీకేజీల పేరుతో నీరు వృథా కాకుండా చూడాలన్నారు. ప్రతి నీటిబొట్టును సద్వినియోగం చేయాలన్నారు. వేసవి తీవ్రత పెరగటానికితోడు భూగర్భజలాలు అడుగంటటంతో బోర్లు ఎండిపోతున్నాయన్న సమాచారం వస్తోందన్నారు. క్షేత్రస్థాయిలో ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు గ్రామాలలో పర్యటించి తక్షణం తాగునీటి సమస్యలు పరిష్కరించాలన్నారు. లోవోల్టేజీ సమస్య ఉన్న గ్రామాల జాబితాను తయారుచేసి విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించాలన్నారు. విద్యుత్ కోత వలన తాగునీటిని సరఫరా చేయలేకపోయామని కుంటిసాకులు చెప్పరాదన్నారు. అంతేకాకుండా విడిభాగాలు స్టాకు తెప్పించి ఉంచుకోవాలన్నారు. పైపులైను మరమ్మతులు చేయాల్సి వచ్చినపుడు సామగ్రి లేదన్న సమాధానం రాకూడదన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రసాదరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఆర్‌డబ్ల్యూఎస్‌లో 91 ఎఇ పోస్టులకుగాను 29 మంది మాత్రమే ఉన్నారని అన్నారు. కనీసం వర్క్ ఇనస్పెక్టర్లు కూడా లేని పరిస్థితి నెలకొందన్నారు. మండలాలలో మెకానిక్‌లు కొరత తీవ్రంగా ఉందన్నారు. కొన్నిచోట్ల ఎంపిడిఓలు తాత్కాలికంగా మెకానిక్‌లను ఏర్పాటు చేసి మరమ్మతులు చేపడుతున్నారని అన్నారు. సమీక్షా సమావేశంలో శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం, సత్యసాయి వాటర్ స్కీమ్‌ల పనితీరును కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ కార్పొరేషన్‌లో పైపులైను లీకేజీలను అరికట్టాలని సూచించారు. అలాగే గుంత కొళాయిలను పూడ్చివేసి తాగునీటి కాలుష్యాన్ని నివారించాలన్నారు. కమిషనర్ నీలకంఠారెడ్డి మాట్లాడుతూ నగరంలో 60 శాతం ప్రాంతానికి రోజూ నీరు ఇస్తున్నామన్నారు. పైపులైను లేని ప్రాంతాలకు ఒక ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. కదిరి కమిషనర్ లక్ష్మి మాట్లాడుతూ కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరిగే పది రోజులపాటు విద్యుత్ కోత లేకుండా చూడాలన్నారు. విద్యుత్‌కోత ఉంటే లక్షలాది మంది భక్తులకు తాగునీటిని సరఫరా చేయటం కష్టమవుతుందన్నారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని ట్రాన్స్‌కో ఎస్‌ఇకి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో అదనపుజెసి చెన్నకేశవరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఇ వినయ్‌కుమార్, ట్రాన్స్‌కో ఎస్‌ఇ రమణమూర్తి, జిల్లా పంచాయతీ అధికారి శంకరయ్య, జడ్‌పి సిఇఓ వెంకటసుబ్బారెడ్డి, పబ్లిక్ హెల్త్ ఇఇ శ్రీనాథరెడ్డిలు పాల్గొన్నారు.

భూ సేకరణను అడ్డుకుంటాం
* కాలువ పనులు జరగనివ్వం
* ప్రత్యేక కలెక్టర్‌తో రైతుల వాగ్వివాదం
పుట్టపుర్తి, మార్చి 1: ప్రాణాలు పణంగా పెట్టి అయినా తమ భూములను రక్షించుకునేందుకు వెనుకాడబోమని తెలుగుగంగ ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ భానుప్రసాద్‌కు రైతాంగం తెగేసి చెప్పింది. హంద్రీ నీవా కాలువ ఎనిమిదవ కాలువ పనులు చేపట్టడానికి భూ సేకరణల నెలకొన్న ప్రతిష్టంభనను పరిష్కరించడానికి స్పెషల్ కల్టెర్ భా నుప్రసాద్, హంద్రీనీవా స్పెషల్ డిప్యూ టీ కలెక్టర్ రామారావు, ఇంజనీరింగ్ అధికారులు శుభచంద్రారెడ్డి, డిఈ రామనాయక్‌లు పుట్టపర్తి విచ్చేశారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో గురువారం భూ సేకరణ జరిపేందుకు గల అవరోధాలను అధికమించేందుకు రైతాంగం అభిప్రాయాలను తెలుసుకొనే ప్రయత్నం చేసింది. రైతులతో ముచ్చటించి వారిలో అవగాహన కల్పించి ఆమోదయోగ్యమైన పరిష్కా రం చేపట్టాలనే చర్యలకు రైతాంగం ఎదురు దాడికి దిగడంతో అధికారుల వ్యూహం బెడిసి కొట్టింది. పెద్దకొమ్మవారిపల్లి, పుట్టపర్తికి చెందిన రైతులతో స్పెషల్ కలెక్టర్ భానుప్రసాద్ మాట్లాడుతూ హంద్రీనీవా రెండవ దశ కింద పనులు చేపట్టడానికి భూ సేకరణ సమ స్య వల్ల పనులు ఆగాయనే విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇప్పటికే హంద్రీనీవా పథకం కింద వివిధ దశలలో 90 శాతం మేర భూ సేకరణ ప్రక్రి య పూర్తయి పనులు ప్రగతిలో వున్నాయన్నారు. 8వ ప్యాకేజీలో దాగిన సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశ్యంతోనే తాము ఇక్కడికి విచ్చేశామని వివరించా రు. 8వ ప్యాకేజీ కింద పట్టా భూము లు 44 ఎకరాలు, డికేటి భూములు 27 ఎకరాలు, వంక, రస్తా పోరంబోకు భూములు పది ఎకరాలు ఉన్నట్లు వివరించారు. 8వ ప్యాకేజీ కింద అలైన్‌మెంట్ మార్పుపై ప్రభుత్వపరంగా జీఓ విడుదలైందని వివరించారు. అయితే ఇందులో భూ సేకరణకు సంబంధించి మీకున్న అభ్యంతరాలు ఏమిటని రైతులతో అడిగి వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయాత్నాన్ని స్పెషల్ కలెక్టర్ చేపట్టారు. దీనిపై రైతులు స్పం దిస్తూ 2007లోనే 8వ ప్యాకేజీ కింద 18 కిలోమీటర్లకు టెండరు ప్రక్రియ ముగిసి బీడిపల్లి, బ్రాహ్మణపల్లి, రాయలవారిపల్లి మీదుగా పనులు చేపట్టేందుకు ప్రక్రియ కూడా ప్రారంభమైందన్నారు. ఇందులో నాలుగు కిలోమీటర్ల పనులు చేపట్టారని, అయితే అనూహ్యంగా తిరిగి అలైన్‌మెంట్‌ను పెదకమ్మవారిపల్లి, పుట్టపర్తి మీదుగా ఎందుకు మార్చాల్సి వచ్చిందని నిలదీశారు. పెదకమ్మవారిపల్లి గ్రామానికి మూడు వైపులా చెరువు వుండటం వల్ల ద్వీప కల్పం లాగా ఇప్పటికే తమ గ్రామం వుందని నాలుగవ వైపున కాలువ నిర్మిస్తే తమ గ్రామం మరుగునపడే అవకాశం వుందని తెలియజేశారు. ఇప్పటికే పుట్టపర్తి విమానాశ్రయం, 4 లైన్ల రోడ్లు తదితర అవసరాలకు తమ భూములను పోగొట్టుకున్నామని, వున్న కాస్త భూమిని కాలువ నిర్మాణం ద్వారా పోగొట్టుకుంటే తమ జీవితమే దుర్భరమవుతుందన్నారు. గ్రామంలో ఐదారు వందల కుటుంబాలు నివసిస్తున్నాయని, తమకు కేవలం 400 ఎకరాల వ్యవసాయ భూమి మాత్రమే వుందని, దానిని నమ్ముకొనే పిల్లలను చదివిస్తూ బతుకు భారం గడుపుతున్నామన్నారు. కావున పూర్వ అలైన్‌మెంట్ ప్రకారమే పనులు కొనసాగించాలని తెగేసి చెప్పారు. తమ గ్రామానికి చుట్టూ రివర్‌బెడ్ వున్నందున కా లువ తవ్వే అవకాశమే లేదని, రివర్‌బెడ్‌లో కాలువలు ఎలా నిర్మిస్తారని నిలదీశారు. 2007లోనే పనులు ప్రారంభించాక అలైన్‌మెంటు మార్చాల్సిన ఆవశ్యకత ఎందుకు ఏర్పడింది, అలైన్‌మెంట్ మార్చే విషయంలో ఇప్పటి దాకా ఏ ఒక్క అధికారి కూడా తమ గ్రామానికి క్షేత్ర స్థాయి పరిశీలనకు వచ్చిన దాఖలాలు లేవని, కేవలం రాజకీయ పెత్తనంతోనే మార్చి వేశారని పెద్ద ఎత్తున ఆరోపించారు. దీనిపై స్పందించిన స్పెషల్ కల్టెర్ భాను ప్రసాద్ అలైన్‌మెంట్ మార్చడానికి కారణాలు ఏమిటన్నది ప్రశ్నిస్తే మా దగ్గర సమాధానం లేదన్నారు. పూర్వ అలైన్‌మెంటును మార్చడానికి అధికారులు తప్పిదమే కారణమని ఇంజనీరింగ్ హైపవర్ కమి టీ నిర్ధారించినందు వల్లనే మార్పులు చోటు చేసుకున్నాయని సర్దిచెప్పే ప్రయ త్నం చేశారు. అయితే ఇందులోని లో టు పాట్లను క్షేత్ర స్థాయి పరిశీలనలో మార్పు చేసుకునే వెసులుబాటు వుంద ని ఇఇ తెలిపారు. ఇప్పటికే 9వ ప్యాకేజీ పనులు పుట్టపుర్తి సమీపం దాకా చేశారని, దానికి అనుసంధానంగా పూర్వపు అలైన్‌మెంట్ ప్రకారమే పనులు చేపట్టాలని రైతాంగం సూచించింది. ప్రధానంగా పెదకమ్మవారిపల్లి, పుట్టపర్తి ప్రాంతాల వద్ద క్షేత్ర స్థాయిల పరిశీలన జరుపుతామని, రైతులతో కలసి స్పెషల్ కలెక్టర్ గ్రామానికి విచ్చేశారు. అక్కడ ప్రత్యక్షంగా భూములను పరిశీలించిన పిమ్మట తలపెట్టిన కాలువ నిర్మాణ భూముల్లో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాన్ని అధికారులు పరిశీలించారు. తదుపరి రైతులతో మరోమారు సమ్మతింపజేసే ప్రయత్నం స్పెషల్ కలెక్టర్ చేపట్టే ప్రయత్నం చేశారు. భూ సేకరణ విషయంలో మీ కోరికలకు అనుగుణంగానే సంప్రదింపులు జరుపుతామని స్పెషల్ కలెక్టర్ పేర్కొన్నప్పటికీ రైతాంగం ఎట్టి పరిస్థితుల్లోను భూ సేకరణ జరపనివ్వబోమని, కాలువ పనులు కొనసాగించేది లేదని ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రాణాలు పణంగా పెట్టైనా తమ భూములను రక్షించుకుంటామని ఇందులో మరో మాటకు తావులేదని హెచ్చరికగా తెలియజేశారు. రైతులు తెగేసి చెప్పడంతో స్పెషల్ కల్టెర్‌తోపాటు ఇతర ఇంజనీరింగ్ అధికారులు అక్కడి నుండి నిష్క్రమించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కోదండరామిరెడ్డి, సర్వేయర్ కరుణాకర్, సింగిల్‌విండో అద్యక్షులు వెంకటేష్, దారిపనేని చంద్ర, సుబ్రమణ్యం, పూరువాసి చలపతి, మల్లికార్జున, గంగన్న, రైతులు పాల్గొన్నారు.

చెరువుబాట రైతు ప్రగతికి
బంగారు బాట
అనంతపురం కల్చరల్, మార్చి 1: చెరువుబాట రైతుల పాలిట బంగారుబాట కాగలదని నగర మాజీ మేయర్ రాగే పరశురామ్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాయలసీమ వికాస సాధనా సమితి అధ్యక్షులు, సినీ నటులు నరేష్ జిల్లాలో చేపట్టిన చెరువుబాట రథయాత్రను మాజీ మేయర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆర్డీటి ప్రోగ్రామ్ డైరెక్టర్ తిప్పేస్వామి, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు ఎస్‌ఆర్ నాగభూషణం, సిపిఐ ఎంఎల్ న్యూ డెమూక్రసీ ప్రభాకర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. మాజీ మేయర్ మాట్లాడుతూ వ్యవసాయాన్ని కాపాడుకోవాలంటే చెరువులను పునరుద్దరించుకోవాలని అన్నారు. ఈ బాధ్యత జిల్లా ప్రజలందరిపైనా ఉందన్నారు. తిప్పేస్వామి మాట్లాడుతూ నేడు కుంటలు, వంకలు అనేకం కనుమరుగయ్యాయని, దాని మూలంగా భూగర్భ జలాలు అడుగంటాయని అన్నారు. రాయలసీమ వికాస సాధన సమితి వ్యవస్థాపకులు, సినీ నటుడు నరేష్ మాట్లాడుతూ జిల్లాలో చెరువులను పునరుద్దరించుకోవడం ద్వారానే కరవు పరిస్థితులను ఎదుర్కోగల మన్నారు. చెరువులు మన జాతీయ సంపద అని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉన్నదని తెలిపేందుకే చెరువుబాట రథయాత్ర చేపట్టామని ఆయన తెలిపారు. జిల్లాలో అనాదిగా వస్తున్న కరవుకాటకాలను అధిగమించడానికే మన పూర్వీకులు కొన్ని వేల చెరువులు, కుంటలు నిర్మించారని పేర్కొన్నారు. ప్రస్తుతం లభిస్తున్న సమాచారం ప్రకారం 1373 చెరువులు, 2094 కుంటలు, 1834 ఊటకాలువలు, 173 తలిపిరులు, 37 జవుకు కాలువలు ఉన్నాయని పేర్కొన్నారు. పల్లవుల కాలం నుండి శ్రీ కృష్ణదేవరాయల కాలం వరకు చెరువుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని, ప్రస్తుత ప్రభుత్వాలు చెరువులు అన్యాక్రాంత మవుతున్నా పట్టించుకోవటం లేదన్నారు. ఆరు రోజులపాటు 800 కి.మీ.లుసాగే యాత్రలో 38 మండలాలలో పర్యటిస్తుందన్నారు. ఈ సందర్భంగా 5 లక్షల మందిని కలసి, ముఖాముఖి చర్చించి, వారిని ఉద్యమంలో భాగస్వాములను చేస్తామన్నారు. కేంద్ర వ్యవసాయ కమిటీ కరవు నివారణకు చెరువుల పునరుద్దరణే శరణ్యమని తెలిపిందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల జిల్లాకు వచ్చిన అయ్యప్పన్ కమిటీ పర్యటన తరువాత ప్రభుత్వం కరవు నివారణ చర్యలకు రు. 500 కోట్లు ప్రకటించిందన్నారు. ఈ నిధులు కేంద్రమిస్తుందా, రాష్టమ్రిస్తుందా అన్నవిషయం తెలుపలేదని, దేనికి ఖర్చు చేస్తామన్నది తెలుపలేదని విమర్శించారు. దీనిపై బడ్జెట్‌లో కూడా చర్చ జరుగలేదన్నారు. తెలంగాణా అభివృద్ధికి 13 వేల కోట్లు కేటాయించినా, రాయలసీమకు చెందిన నాయకులకు సీమ అభివృద్ధిపట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. జిల్లాలో చెరువుల మరమ్మతులకు రు. 8 వేల కోట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రథయాత్రలో మెగసెసె అవార్డు గ్రహీత రాజేంద్ర సింగ్ ధర్మవరంలో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కన్వీనర్ ఆవుల చక్రధర్ యాదవ్, సభ్యులు ఆదరణ రామక్రిష్ణ, బాషా, రమేష్ గౌడ్, ప్రభాకర్, మధురశ్రీ, రవిశంకర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
రైతు ఆత్మహత్య
బత్తలపల్లి, మార్చి 1: పంటలు పండక, చేసిన అప్పులు తీర్చ లేక ఓ రైతు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన బత్తలపల్లి మం డలం పోట్లమర్రి గ్రామంలో గురువారం చోటుచేసుకుం ది. పోట్లమర్రి గ్రామానికి చెందిన బోయ నరసింహు లు (57) తనకున్న ఎకరా పొలంలో పంటలు సాగు చేయడానికి బోరు బోరు బావులు తవ్వించగా, వాటిలో నీరు రాక అప్పులు మిగిలాయి. ఇదే క్రమం లో భార్య మంగమ్మ అనారోగ్యంతో మూడు సంవత్సరాల క్రితం మృతి చెందింది. పంటల కోసం, భార్య ఆరోగ్యం కోసం లక్ష రూపాయలకుపైగా అప్పులు చేశాడు. నరసింహులు సైతం అనారోగ్యానికి గురయ్యాడు. ఈ విషయమై కుమారుడు ఆదినారాయణతో గొడవ పడేవారన్నారు. బుధవారం రాత్రి ఆదినారాయణతో గొడవపడి ఇంటిలోని ఊజీ మాత్రలు మింగాడు. దీంతో అపస్మారక స్థితిలో ఉన్న బోయ నరసింహులను స్థానిక ఆర్‌డిటి ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. బత్తలపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
తపంచా స్వాధీనం.. వ్యక్తి అరెస్టు
హిందూపురం, మార్చి 1: అక్రమంగా తపంచా కలిగి ఉన్న చెనే్నకొత్తపల్లి మండలం న్యామద్దెల గ్రామానికి చెందిన ఎరికల మాధవ (26)ను గురువారం అరెస్టు చేసినట్లు పెనుకొండ డీఎస్పీ కోలార్‌కృష్ణ తెలిపారు. అందిన సమాచారం మేరకు మాధవ్‌ను అరెస్టు చేయడంతో పాటు తపంచా, రెండు తూటాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి డీఎస్పీ స్థానిక వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గతం లో న్యామద్దెల సమీపంలో పీపుల్స్‌వార్ కార్యకలాపాలు వున్న సమయం లో ఆకర్షితుడైన మాధవ దళ సభ్యులతో సాన్నిహిత్యం పెంచుకవగా అప్పట్లో వారు అతడికి తపంచా, రెం డు తూటాలు ఇచ్చారు. అయితే అత డు వాటిని పోలీసులకు అప్పచెప్పకుండా దగ్గరే ఉంచుకున్నట్లు సమాచారం అందడంతో నిందితుడి కదలికలపై దృష్టి పెట్టినట్లు వివరించారు. ఇందులో భాగంగా గురువారం ఉద యం 6.30 గంటల సమయంలో కొట్నూరు వద్ద అరెస్టు చేసి తపంచా, తూటాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కాగా ఇతని అరెస్టులో ప్రధాన భూమిక వహించిన స్పెషల్ పార్టీ హెడ్ కానిస్టేబుళ్లు రాజప్ప, జయరామిరెడ్డి, కానిస్టేబుళ్లు రాము, విక్టర్ రాజ్‌కుమార్, ప్రసాద్, గంగాధర్‌లను డీఎస్పీ అభినందిస్తూ రివార్డుకు ఎస్పీకి సిఫార్సు చేశారు. ఇకపోతే నిందితుడు తపంచాను ఉపయోగించి ఎలాంటి నేరాలకు పాల్పడలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సిఐలు బి.శ్రీనివాసులు, ఇదుర్‌బాషా, వేణుగోపాల్ పాల్గొన్నారు.

కామిరెడ్డిపల్లి హత్య కేసుల్లో
బెయిల్ రద్దు
ధర్మవరం, మార్చి 1 : జిల్లాలో సంచలనం సృష్టించిన కామిరెడ్డిపల్లి హత్య కేసుల్లో నిందితులకు జిల్లా కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేస్తూ గురువారం హైకోర్టు తీర్పు వెలువరించినట్లు హైకోర్టు న్యాయవాదులు విద్యావతి, అంజన్‌రెడ్డి తెలిపారు. గత ఏడాది సెప్టెంబర్ 15న కుటుంబ నియంత్రణ ఆపరేషన్ నిమిత్తం ధర్మవరం వస్తున్న కామిరెడ్డిపల్లికి చెందిన టిడిపి కార్యకర్తలు నరసింహులు, ఆంజనేయులు, పద్మావతిలను ప్రత్యర్థులు దారుణంగా హత మార్చిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి నిందితులు 22 మంది వుండగా వీరిలో నేసే సుధాకర్, వడ్డె వెంకటస్వామి, మామిళ్ళపల్లి పరమేశ్వరరెడ్డి, కుణుతూరు నారాయణ, వీరారెడ్డిలకు జనవరి 4న జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీన్ని ఛాలెంజ్ చేస్తూ మృతుడు నరసింహుడు కుమారుడు సత్యమయ్య ఫిబ్రవరి 6న హైకోర్టును ఆశ్రయించారు. వీటిని విచారణకు స్వీకరించిన జస్టిస్ కేసి భాను బెయిల్‌ను రద్దు చేస్తూ తీర్పునిచ్చినట్లు న్యాయవాదులు తెలిపారు. ఇందుకు సంబంధించి నిందితుల తరపున న్యాయవాది విద్యావతి కోర్టులో తమ వాదనలను వినిపించి ఫిర్యాదుదారుడు సత్యమయ్యతోపాటు కుటుంబ సభ్యులకు, సాక్షులకు ప్రాణ హాని వుందని కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగదని హైకోర్టులో తమ వాదనను వినిపించారని అలాగే ముద్దాయిల తరపున న్యాయవాది పద్మనాభిరెడ్డి తమ వాదననను వినిపిస్తూ ముద్దాయిలకు కేసుతో సంబంధం లేదని వారి పేర్లు సైతం కేసులో లేవని హైకోర్టులో వాదన వినిపించినట్లు తెలిపారు. కాగా ఈ హత్య కేసుల్లో నిందితులు సుధాకర్‌దరెడ్డి, నారాయణరెడ్డిలకు మంజూరు చేసిన బెయిల్‌ను హైకోర్టు రద్దు చేయలేదని న్యాయవాదులు తెలిపారు.

* ప్రభుత్వ పథకాలు అర్హులకందించడమే లక్ష్యం * కలెక్టర్ వి.దుర్గాదాస్
english title: 
lab to land

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>