పామూరు, జూలై 26: విధి నిర్వహణలో ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో తెలిపేదే ఈ ఘటన. కడప జిల్లాలో గురువారం జరిగిన రోడ్ ప్రమాదంలో మృతదేహాలను వారి స్వగ్రామమైన భద్రాచలం తరలించకుండా పామూరులో రోడ్డు పక్కన పడేసి చేతులు దులుపుకున్నారు. పామూరుకు చెందిన వేముల సురేష్ కూలీ పనుల నిమిత్తం భద్రాచలానికి చెందిన కూలీలను ఒక ఏజెన్సీ ద్వారా మాట్లాడుకుని మినీలారీలో బెంగళూరుకు తీసుకువెళ్తుండగా లారీ కడప జిల్లా గవ్వలచెరువు సమీపంలో బోల్తాపడి ఆరుగురు మృతి చెందారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి ఏజెంట్‌కు అప్పగించారు. ఆ ఏజెంట్ ఆ మృతదేహాలను వారి స్వగ్రామమైన భద్రాచలం తరలించకుండా వాహనంలో పామూరుకు తీసుకొచ్చి కనిగిరి రోడ్డులో శ్మశానం పక్కన పడేసి చేతులు దులుపుకున్నాడు. దీనిపై ఆగ్రహించిన స్థానికులు ఏజెంట్‌ను నిలదీసినా ఫలితం లేకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సాయంత్రం 5 గంటల వరకు మృతదేహాలు రోడ్డుపక్కనే పడి ఉన్నాయ. ఎట్టకేలకు పోలీసుల జోక్యంతో వేరొక వాహనంలో మృతదేహాలను భద్రాచలం పంపడానికి ఏర్పాట్లు చేశారు.
కొనసాగుతున్న ద్రోణి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూలై 26: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం జార్ఖండ్ వైపు వెళ్లిపోయింది. అయితే, ఒడిశా నుంచి కోస్తా ఆంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ వ్యాపించిన అల్పపీడన ద్రోణి యథావిధిగా కొనసాగుతోంది. దీని ప్రభావం వలన రాష్ట్రంలో అక్కడక్కడ చెదురు మదురు వర్షాలు కురుస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం శుక్రవారం రాత్రి వెల్లడించింది. పశ్చిమ దిశగా గంటకు 45 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయ.
- మృతదేహాలను రోడ్డుపై పడేసిన వైనం -
english title:
y
Date:
Saturday, July 27, 2013