విజయవాడ, జూలై 28: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం త్వరగా ఏదో ఒకటి తేల్చాలని ఒకవేళ తమవల్ల సాధ్యం కానిపక్షంలో పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెడితే అన్ని రాజకీయ పక్షాలు వాటంతటవే తమ అభిప్రాయాలను వెల్లడిస్తాయని సిపిఎ రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం ఆదివారం నగరానికి విచ్చేసిన రాఘవులు తనను కలసిన విలేఖరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎటూ తేల్చి చెప్పలేక గత మూడున్నర సంవత్సరాలుగా అనిశ్చితి స్థితిని కొనసాగిస్తోందన్నారు. స్వార్థ రాజకీయాలు మినహా దేశ ప్రయోజనాలు ఏ ఒక్కరికీ పట్టడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలోని కొందరు ఇదిగో తెలంగాణ వచ్చేస్తున్నదంటే, మరికొందరు రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. గతంలో ఒకమారు కోర్ కమిటీ, సిడబ్ల్యుసి అన్నారు... మళ్లీ అదేపాట పాడుతున్నారని రాఘవులు ఎద్దేవా చేసారు. పంచాయతీ ఎన్నికల్లో ఎవరికి వారు తమదే ఆధిక్యత అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు పార్టీ గుర్తులపై త్వరలో జరిగే మండల పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో అసలు రంగు బైటపడుతుందన్నారు.
* సిపిఎం నేత రాఘవులు
english title:
sachivetha
Date:
Monday, July 29, 2013