కోట,ఆగస్టు 2: కోట మండలంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌లు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టారు. మండలంలోని చెందోడు పంచాయతీలో బండి విజయమ్మ సర్పంచ్‌గా ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆమెను పంచాయతీ మాజీ సర్పంచ్ వేణుంబాక సాయికోటారెడ్డి , వైకాపా అభిమానులు ఘనంగా సత్కరించారు. కోట పంచాయతీ సర్పంచ్‌గా కోట రాఘవయ్య, జరుగుమల్లి సర్పంచ్‌గా శేషాద్రిరెడ్డి, వెంకన్నపాళెం సర్పంచ్‌గా పనబాక విజయలక్ష్మీ, మద్దాలి సర్పంచ్‌గా కోటేశ్వరనాయుడు, ఉత్తమనెల్లూరు సర్పంచ్‌గా మస్తానమ్మ, రుద్రవరం సర్పంచ్‌గా బుజ్జమ్మ, కర్లపూడి సర్పంచ్‌గా చెంచురాఘవరెడ్డి, అల్లంపాడు సర్పంచ్‌గా, సిద్దవరం సర్పంచ్‌గా సునందమ్మ, తినె్నలపూడి సర్పంచ్‌గా శ్రీనివాసులు, పుచ్చలపల్లి సర్పంచ్‌గా కందల ఇంద్రసేనయ్య, వంజివాక సర్పంచ్‌గా కె దీప, నెల్లూరుపల్లికొత్తపాళెం సర్పంచ్‌గా రమాదేవి, తిమ్మనాయుడుపాళెం సర్పంచ్‌గా నాగభూషణం, కొత్తపట్నం సర్పంచ్‌గా పెంచిలమ్మ, కేశవరం కృష్ణస్వాతి, చిట్టేడు సర్పంచ్‌గా సిహెచ్ రాము, గూడలి సర్పంచ్‌గా గౌరాబత్తెన శారదలు ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. దీంతో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులు సర్పంచ్‌ల ముందు పలుసమస్యలు పెట్టారు. కోటలో జరిగిన ప్రమాణస్వీకారోత్సవంలో సర్పంచ్‌తో పాటు వైకాపా మండల కన్వీనర్ నల్లపరెడ్డి వినోద్‌కుమార్‌రెడ్డి, మండల మాజీ అధ్యక్షులు మానికల పవన్‌కుమార్, ఉపసర్పంచ్ గాది విజయభాస్కర్ పాల్గొన్నారు.
వాకాడులో..
వాకాడు: వాకాడు పంచాయతీ పరిధిలోని అన్ని ప్రాంతాల ప్రజలకు వౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా తాను పనిచేస్తానని సర్పంచ్ భార్గవ్‌రాం అన్నారు. శుక్రవారం పంచాయతీ కార్యాలయాలంలో పంచాయతీ పాలక వర్గ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సర్పంచ్ మాట్లాడుతూ అన్ని ప్రాంతాల ప్రజలకు తాగునీటి సరఫరా, డ్రైనేజి, వీధి లైట్ల నిర్వహణ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. పంచాయతీని మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. వార్డు మెంబర్లు తమ ప్రాంతంలోని సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సమావేశంలో కార్యదర్శి ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.
ఓజిలిలో..
ఓజిలి: మండల కేంద్రమైన ఓజిలిలో శుక్రవారం నూతనంగా సర్పంచ్ పదవి చేపట్టిన ఓజిలి అల్లెమ్మ(కాంగ్రెస్)ను వార్డు మెంబర్లు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముమ్మడి సుబ్బారావు మాట్లాడుతూ ఎం సుమ జడ్పీటిసిగా కొనసాగిన ఐదేళ్లలో కోటి రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఓజిలి పంచాయతీని మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమన్నారు. ఓజిలిలో ఉన్న తాగునీటి ఎద్దడి శాశ్వత నివారణకు కృషి చేస్తానన్నారు. ఎన్‌ఎస్‌ఆర్, మహబూబ్ నగర్ కాలనీలకు 3వ విద్యుత్ లైను సౌకర్యాన్ని కల్పించేలా పంచాయతీ తీర్మానం చేసింది. 35 సంవత్సరాలు ఓజిలి పంచాయతీని టిడిపి పాలించిందని, అభివృద్ధి మాత్రం శూన్యమని పేర్కొన్నారు. తాము చేసిన అభివృద్ధి పనుల వలనే గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారన్నారు.
డక్కిలిలో..
డక్కిలి: రాజకీయాలకు అతీతంగా దగ్గవోలు గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని గ్రామ సర్పంచ్‌గా గురువారం బాధ్యతలు స్వీకరించిన యద్దల ఉదయకుమార్ అన్నారు. గురువారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో కలసి పంచాయతీ కార్యదర్శి తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తాను రాజకీయాలకు కొత్త అయినా గ్రామ పెద్దల సహాయ సహకారాలతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శితో పాటు మాజీ సర్పంచ్‌లు సద్దికూటి రమణయ్య, దందోలు వెంకటయ్య, కాచిన రామస్వామి, హరిబాబు, ఉమామహేశ్వర్, దయాకర్, నారిబోయిన రంగయ్య, సురేంద్రరెడ్డి, తిరుపాల్ రాజు, కాచిన మస్తాన్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ని, వార్డు మెంబర్లును పలువురు పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
ఉప సర్పంచ్ అభ్యర్థులుగా ప్రమాణ స్వీకారం
పెళ్లకూరు: పెళ్లకూరు మండల పరిధిలో ఎన్నికలు జరిగిన 15 పంచాయతీల్లో ఉప సర్పంచ్‌ల అభ్యర్థుల ఎంపిక కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. మండల పరిధిలోని రోసనూరులో చెందోటి మాధవి, తాళ్వాయిపాడులో బత్తల లక్ష్మీదేవమ్మ, కానూరులో చీమల అనిత, పెనే్నపల్లి గోగుతట్టు ఆనంద్, శిరసనంబేడులో మల్లి శ్రీనివాసులు, బంగారమ్మపేటలో అక్కుర్తి కృష్ణమ్మ, చెంబేడులో మారాబత్తిన గురవయ్య, అర్ధమాల మణికిరి బత్తెమ్మ, పునబాక పి లలితమ్మ, రావులపాడు అంజూరు పరమేశ్వరి, చింతపూడి వేణుంబాక మునిరామానాయుడు, కుల్లూరు మారాబత్తిల లక్ష్మమ్మ, పాలచ్చూరు పెళ్లూరు వెంకటరమణారెడ్డి, నందిమాల మూరతొట్టి ఈశ్వరయ్యలు ఏకగ్రీవంగా ఉప సర్పంచ్‌లుగా ఎంపికయ్యారు. అనకవోలు పంచాయతీలో టిడిపికి 4, కాంగ్రెస్‌కు 4 వార్డులు రావడంతో అక్కడ ఎంపిక కార్యక్రమం వాయిదా పడింది. ఎంపికైన అభ్యర్థుల చేత పోలింగ్ కేంద్రాల రిటర్నింగ్ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు.
మనుబోలులో..
మనుబోలు:మండలంలోని 19 పంచాయతీ ఎన్నికలలో కొత్తగా గెలుపొందిన సర్పంచ్, వార్డుమెంబర్లు శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం ఆయా గ్రామాల పంచాయతీ కార్యాలయాలలో పంచాయతీ కార్యదర్శి అధ్యక్షతన సర్పంచ్, వార్డుమెంబర్లతో కలిసి మొదటి సాధారణ సమావేశం నిర్వహించారు. మనుబోలు, గురివిందపూడి గ్రామాలలో స్థానిక తహశీల్దారు వెంకటనారాయణమ్మ మాట్లాడుతూ నిధులు సక్రమంగా వినియోగించి గ్రామాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని కొత్తగా ఎన్నికైన సర్పంచ్, వార్డు మెంబర్లకు సూచించారు. స్థానిక మనుబోలు పంచాయతి సర్పంచ్ కంచి పద్మ మాట్లాడుతూ తనను గెలిపించిన ఓటర్లకు తాను రుణపడివుంటానన్నారు. గురివిందపూడి సర్పంచ్ మనె్నమాల వసుధ మాట్లాడుతూ తమ గ్రామంలో ముఖ్యంగా పారిశుద్ధ్యం,మంచినీటి కొరత తీర్చడానికి కృషి చేస్తానన్నారు. చెర్లోపల్లి గ్రామ సర్పంచ్ చెడిమాల శ్రీలత మాట్లాడుతూ గ్రామంలో వౌలికసదుపాయాలుకు మొదటి ప్రాధాన్యత నిస్తానని చెప్పారు. ప్రతి పంచాయతీ కార్యాలయంలలో ఆర్భాటంగా మొదటి సమావేశాన్ని నిర్వహించారు.
‘ ముర్రుపాలు బిడ్డకు శ్రేయస్కరం’
మనుబోలు, ఆగస్టు 2:ముర్రుపాలు బిడ్డకు శ్రేయస్కరం అని వెంకటాచలం సిడిపిఓ శారదాంబ చెప్పారు. స్థానిక కోదండరామపురంలోని అంగన్‌వాడీ కేంద్రంలో శుక్రవారం జరిగిన తల్లిపాల వారోత్సవాలలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంలో ఆమె మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు ముర్రి పాలు తాగించడం వలన బిడ్డలో వ్యాది నిరోదక శక్తి పెరుగుతుందని చెప్పారు. గర్భవతులు,బాలింతలు పోషకాహారం తీసుకోవాలని సూచించారు. చిన్న పిల్లలకు వ్యాది నిరోదక టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు అంగన్‌వాడీ సూపర్‌వైజర్ రత్నమ్మ, కార్యకర్తలు సుగుణమ్మ, మునెమ్మ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం
బాలాయపల్లి, ఆగస్టు 2: మండలంలోని గొల్లగుంట గ్రామం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి భవనాజీ హరిబాబు(20) దుర్మరణం చెందాడు. సంగవరం గ్రామానికి చెందిన హరిబాబు మోటార్‌సైకిల్‌పై వెళుతూ గొల్లగుంట గ్రామం వద్ద టాటా ఏస్ వాహనాన్ని ఢీ కొన్నాడు. దీంతో హరి బాబు సంఘటన స్థలంలోమృతి చెందాడు. కాగా హరిబాబు మృత దేహాన్ని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సందర్శించి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఎస్సై పి మాలకొండయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
‘తల్లి పాలు బిడ్డకు ప్రాణ వాయువు’
నాయుడుపేట, ఆగస్టు 2: తల్లి పాలు బిడ్డకు ప్రాణ వాయువుతో సమానమని ఐసిడిఎస్ సిడిపివో విజయలక్ష్మి తెలిపారు. తల్లిపాల వారోత్సవాలలో భాగంగా శుక్రవారం పట్టణంలోని ముస్లిం వీధిలో బిడ్డ తల్లులకు, బాలింతలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలకు తల్లి పాలు ఇవ్వడం వలన ఆడవారికి వచ్చే అవకాశం ఉండే బ్రెస్టు క్యాన్సర్ వంటి పలు రోగాలు దరిచేరవని తెలిపారు. మార్కెట్‌లో లభించే వివిధ రకాల బిస్కెట్ల వల్ల పిల్లల్లో అజీర్తి రోగాలు దరిచేరే అవకాశం ఉందన్నారు. అంగన్‌వాడి కేంద్రాలలో లభించే పిండి పదార్ధాలు అన్ని రకాల పౌష్టిక పదార్థాల మేళవింపన్నారు. వీటిని ఇవ్వడం వలన పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్‌వైజర్ హెలన్ డోరతి, అంగన్‌వాడి సూపర్‌వైజర్ శారద, ఎఎన్‌ఎమ్‌లు శిరిషా, మల్లీశ్వరి, అంగన్‌వాడీలు రత్నమ్మ, రుషీంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.