మార్కాపురం, ఆగస్టు 2: రాష్ట్రాన్ని విభజించి రాజకీయ లబ్ధికోసం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం దుర్మార్గపుచర్య అని విద్యార్థి సంఘనేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం స్థానిక సాధన కళాశాలకు చెందిన విద్యార్థులు విశే్వశ్వర థియేటర్ సమీపంలో రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు విద్యార్థి నేతలు మాట్లాడుతూ కెసిఆర్ పదవి రాలేదనే కాంక్షతో టిడిపిని వదిలి టిఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేసి రాష్ట్ర విభజనకు కారకుడయ్యాడని ఆరోపించారు. తెలంగాణ విభజనకు ముందు సమైక్యాంధ్ర నేతలు కాంగ్రెస్ అధిష్టానానికి ముడుపులు అందచేస్తున్నారని ఆరోపించిన కెసిఆర్ నేడు విభజన చేసేందుకు దిగ్విజయ్‌సింగ్‌కు ఎంత ముట్టచెప్పాడో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన కాంగ్రెస్‌పార్టీ చేస్తే సరిపోదని, ఆంధ్రప్రాంత ఉద్యోగుల, విద్యార్థుల, రైతుల సమస్యలపై చర్చించి పరిష్కరించి అనంతరం రాష్టవ్రిభజన చేపట్టి ఉంటే బాగుండేదని వారు అన్నారు.
* విద్యార్థి నేతల ఆగ్రహం
english title:
second phase
Date:
Saturday, August 3, 2013