విశాఖపట్నం, మార్చి 2: ఈ ఏడాది జనవరి 10న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, జనవరి 12న అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు నిర్వహించిన రాత పరీక్షలో నడక పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులకు సంబంధించిన హాల్ టికెట్ల నెంబర్లను డివిజనల్ అటవీశాఖాధికారి తెలిపారు.
ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నడక పరీక్ష ఈ నెల 12న ఉదయం 5 గంటలకు ఇందిరాగాంధీ జంతు ప్రదర్శన శాల(జూపార్కు) వద్దకు హాజరుకావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ నడక పరీక్ష కేవలం వౌఖిక పరీక్షకు అర్హత సాదించడానికేనని తెలిపారు. ఈ పరీక్షకు ఎటువంటి మార్కులు ఉండవని గ్రహించాలని, నడక పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థులు తమ అన్ని ఒరిజనల్ సర్ట్ఫికేట్లు తీసుకుని ఈ నెల 13వ తేదీ ఉదయం 10 గంటలకు డివిజనల్ అటవీశాఖాధికారి వారి కార్యాలయంలో, వన వికాస కాంప్లెక్స్, ఆర్‌కె మిషన్ ఎదురుగా వౌఖిక పరీక్షకు హాజరుకావాల్సిందిగా సూచించారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ : 046, 052, 059, 078, 085, 118, 150, 162, 178, 207, 209, 239, 271, 304, 305, 321, 325, 326, 341, 343, 347, 596 హాల్‌టికెట్లు అభ్యర్థులు దీనికి హాజరుకావాల్సి ఉంటుంది. ఇదే తరహాలో అసిస్టెంట్ చీట్ ఆఫీసర్: 001, 040, 061, 064, 072, 083, 085, 136, 144, 151, 159, 186, 290, 305, 354, 358, 418, 444, 453 హాల్‌టికెట్లు కలిగి ఉన్న అభ్యర్థులు హాజరుకావాల్సిందిగా పేర్కొన్నారు.
జగన్‌ను పాయకరావుపేట తీసుకువస్తా
పాయకరావుపేట, మార్చి 2: కడప ఎం.పి. వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డిని పాయకరావుపేట మండలంలో పర్యటించేందుకు కృషి చేస్తానని వైఎస్సార్ పార్టీరాష్ట్ర సమన్వయ కార్యకర్త, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అన్నారు. మండలంలోని వెంకటనగరం గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కలిసిన నాయకులు, కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ గత నెలలో జరిగిన జగన్ పర్యటనలో కొన్ని గ్రామాల్లో పర్యటన రద్దు అయిందని, దీంతో ఆయా గ్రామాల కార్యకర్తలు నిరుత్సాహంతో ఉన్నారన్నారు. అయితే వారి నిరుత్సాహాన్ని పొగొట్టేందుకు ఈనెల 18వ తేదీ తరువాత జగర్ పర్యటన షెడ్యూల్డ్‌ను ఖరారు చేస్తామని కార్యకర్తలంతా ఒకే తాటిపై నిలిచి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో వీసం రామకృష్ణ, కె. కోటేశ్వరరావు, జమీలు తదితరులు పాల్గొన్నారు.