చోడవరం, మార్చి 2: నకిలీ పాసుపుస్తకాల ద్వారా బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారిపై కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ బి. వెంకట్రావు తెలిపారు.
స్థానిక పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కె.కోటపాడు మండలంలోని చంద్రయ్యపేట, కెకె అగ్రహారం, కె.సంతపాలెం గ్రామాలకు చెందిన సుమారు 52మంది నకిలీ పట్టాదారుపాసుపుస్తకాలతో సుమారు 40లక్షల రూపాయల రుణాలను కోటపాడు గ్రామీణ వికాస బ్యాంకు ద్వారా పొందినట్లుగా తమకు ఫిర్యాదులు అందాయన్నారు. బ్యాంకు మేనేజర్ కె. సూర్యచంద్రరావు చేసిన ఫిర్యాదుల మేరకు కేసులునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇటువంటి తప్పుడు రికార్డులను చూపి బ్యాంకుల ద్వారా రుణాలు పొందటం చట్టరీత్యా నేరమన్నారు. ఇటువంటి పాసుపుస్తకాలపై ఎటువంటి వ్యాజ్యాలు చేయకూడదని, బ్యాంకు అధికారులు క్షుణ్ణంగా ఆయా పుస్తకాలను పరిశీలించిన మీదటనే రుణాలు మంజూరు చేయాలన్నారు. తనకు అందిన ఫిర్యాదుల మేరకు త్వరలో సమగ్ర విచారణ జరిపించి నిజాలను నిగ్గుతేలుస్తానని చెప్పారు. బుచ్చెయ్యపేట మండలంలోని వడ్డాది వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాలకు గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆ ఉత్సవాల పేరిట ఏర్పాటు చేయనున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో అశ్లీల నృత్యాలను నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
గుళ్ళు బోర్డులు, మట్కాజూదాలను నిర్వహించరాదన్నారు.అలాచేసినచో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. తమవద్దనున్న సిబ్బందితో ఎ,బి, సి షిఫ్టుల మాదిరిగా ఉత్సవాల రోజుల్లో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
నకిలీ పాసుపుస్తకాల ద్వారా బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారిపై కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ బి. వెంకట్రావు తెలిపారు.
english title:
t
Date:
Saturday, March 3, 2012