చిత్తూరు, ఆగస్టు 6: సమైక్యాంధ్రకోసం వారం రోజులపాటు ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న ప్రజానాయకుడు, చిత్తూరు శాసనసభ్యులు సి.కె.బాబు దీక్షను పోలీసులు మంగళవారం మధ్యాహ్నం భగ్నం చేశారని ఆయన సతీమణి సికె లావణ్యబాబు అన్నారు. మంగళవారం మధ్యాహ్నం చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆమె మీడియాతో మాట్లాడారు. వారం రోజులపాటు ఎమ్మెల్యే సి.కె.బాబు చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపిన నాయకులు, ప్రజలు, ఆయన వెన్నంటే 24గంటలు ఉన్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. సి.కె.బాబు తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపినా వైద్యులు ఎమ్మెల్యే ఆరోగ్యం సరిగాలేదని పోలీసులకు నివేదిక ఇవ్వడంతో వారు అకస్మాత్తుగా మంగళవారం మధ్యాహ్నం అమరణ నిరాహారదీక్షను భగ్నం చేశారన్నారు. పోలీసుల ఓవరాక్షన్‌తో సి.కె.బాబు దీక్షను భగ్నం చేశారన్నారు. అయితే ఆయన కోలుకున్న వెంటనే బుధవారం నుండి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని సి.కె.లావణ్యబాబు స్పష్టంచేశారు. సి.కె.బాబు అరెస్టుకు నిరసనగా మంగళవారం మధ్యాహ్నం నుండి బుధవారం సాయంత్రం వరకు ఒకటిన్నర రోజులు చిత్తూరు బంద్‌కు ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఎమ్మెల్యే చేస్తున్న దీక్షలు ఇంకా ఉదృతం చేస్తామన్నారు. ఆయన కోలుకున్న వెంటనే చిత్తూరులోనే కాకుండా జిల్లానలుమూలలైన తిరుపతి, మదనపల్లె, పుత్తూరు, శ్రీకాళహస్తి తదితర ప్రాంతాల్లో పర్యటించి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ఆమె తెలిపారు. జడ్పీ మాజీ చైర్మన్ ఎంబి కుమార్‌రాజా మాట్లాడుతూ రాష్ట్రంలోనే సమైక్యాంధ్ర కోసం పాటుపడిన ఏకైక నాయకుడు ఒక సి.కె.బాబునే అన్నారు. అలాంటి నాయకుని దీక్షను పోలీసులు భగ్నంచేయడం దారుణమన్నారు. మాజీ ఎంపిపి బి.్ధనంజయరెడ్డి మాట్లాడుతూ సమైక్యాంధ్ర దీక్ష ఇంతటితో ఆగిపోదన్నారు. ఎమ్మెల్యేతోపాటు పూతలపట్టు మాజీ వైస్‌ఎంపిపి పి.సుబ్బారెడ్డి, సూరి, మాజీ మున్సిపల్ చైర్మన్ సురళామేరి, చిత్తూరురూరల్ మండల నాయకుడు త్యాగరాజు, గడ్డం రమణ, సాయిక్రిష్ణతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ఆయన వెంటే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారు.
అధికార లాంఛనాలతో హెడ్‌కానిస్టేబుల్‌కు అంత్యక్రియలు
పాకాల, ఆగస్టు 6: ఎర్రావారిపాళ్యంలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చెంగల్రాయులు (45)కు మంగళవారం పోలీసులు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. పాకాల మండలం దామలచెరువు మంగినాయుడుపల్లెకు చెందిన చెంగల్రాయులు హైస్కూల్ గేటు నుండి సోమవారం రాత్రి ఇంటికి వెళుతుండగా లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పాకాల పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మంగళావారం మధ్యాహ్నం స్వగ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు చేశారు. పీలేరు సిఐ పార్ట సారధి, ఎర్రావారిపాళ్యం ఎస్‌ఐ వెంకటేశ్వరు మృతదేహానికి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం గాలిలోకి మూడు రౌండ్లు పోలీసు కాల్పులు జరిపి అంత్యక్రియలు నిర్వహించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తెలున్నారు. ఈమేరకు పాకాల ఎస్‌ఐ మురళీమోహన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.