నందికొట్కూరు, ఆగష్టు 6: కరువుసీమకు కృష్ణాజలాలను అదించేందుకు కోట్లాది రూపాయల వ్యయంచేసి, నందికొట్కూరు మండల పరిధిలోని మల్యాల గ్రామంలో నిర్మించిన హంద్రీనివా సుజలస్రవంతి మొదటి పంప్‌హౌస్ వద్ద నీటి విడుదలకు రంగం సిద్ధం చేశామని, నీటిపారుదల శాఖ డిఇ నాయక్ మంగళవారం తెలిపారు. ఇటివల కురిసిన వర్షాలకు వరదనీరు కృష్ణానదికి భారీగా రావడంతో హంద్రీనీవాకు సామర్ధ్యాని మించినీరు చేరడంతో నీటిని కాలువకు వదిలేందుకు అన్నిఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. 256 మీటర్లు నీటి సామర్ధ్యం ఉంటే కాలువకు నీటిని వదులవచ్చునని, ప్రస్తుతం 268 మీటర్లు నీరు హంద్రీనివా సుజలస్రవంతిలో ఉందన్నారు. హంద్రీనివా ప్రాజెక్టు అమర్చిన 12 పంపులలో 4,5,6,7,9,10 పంపుల ద్వారా ట్రయల్ నిర్వహించి హెచ్‌ఎన్‌యస్‌యస్ వివిధ ప్రాంతలలోగల 8పంపింగ్ స్టేషన్ల్‌ల ద్వారా 216 కిలోమీటర్లు మల్యాల నుండి అనంతపురము జిల్లాలోని జిడిపల్లె వరకు గత ఏడాది నీటిని సరాఫరా చేశామన్నారు. కాలువలో అక్కడక్కడ నీటిపారుదలకు అడ్డంగా వున్నా మట్టికుప్పలను, రాళ్లును మంగళవారం తొలగించడం జరిగిందన్నారు. ఈనెల 7వ తేది హంద్రీనివా నుండి 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామని ఆయన తెలిపారు. హంద్రీనివా సుజలస్రవంతి ద్వారా కర్నూలు, అనంతపురము జిల్లాలో తాగు, సాగునీరు సరాఫరా కావడంతో రైతుల కలలు నెరవేరనున్నాయి. ప్రస్తుతం ఖరీఫ్‌కు రెండు జిల్లాలకు 40వేల ఎకరాలకు సాగునీటిని అందించడం జరుగుతుందని రైతులు ఆయకట్టు క్రింద ఆరుతడి పంటలు వేసుకోవాలని ఆయన సూచించారు. తొలిదశలో హంద్రీనివా పనులు పూర్తి అయినప్పటికి 1,97లక్షల ఎకరాలకు సాగునీరు అందించవలసి ఉండగా ప్రస్తుతం ఖరీఫ్‌కు కర్నూలుజిల్లాకు 20వేలు ఎకరాలకు, అనంతపురం జిల్లాకు 20వేల ఎకరాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఆయన తెలిపారు.
ఎసిబి వలలో వ్యవసాయాధికారి
ఆదోని, ఆగస్టు 6: ఆదోని డివిజన్‌లోని హొళగుంద మండలం వ్యవసాయశాఖ అధికారి వెంగళరెడ్డి, మహబూబ్‌బాషా అనే ఎరువుల దుకాణం వ్యాపారితో రూ. 3వేల లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు పట్టుబడిన సంఘటన మంగళవారం ఆదోనిలో చోటుచేసుకుంది. హొళగుంద మండలంలోని గజ్జహళ్లి గ్రామంలో ఉన్న క్రిమిసంహార మందులు, రసాయనిక ఎరువుల దుకాణం లైసన్స్‌ను తిరిగి రెన్యూవల్ చేయడానికి లంచం వెంగళరెడ్డి అడిగినట్లు ఏసిబి డిఎస్పీ విజయ్‌పాల్ తెలిపారు. మహబూబ్‌బాషా నుండి వెంగళరెడ్డి రూ. 3వేలు డిమాండ్ చేయడంతో మహబూబ్‌బాషా ఏసిబిని ఆశ్రయించినట్లు డిఎస్పీ తెలిపారు. మహబూబ్‌బాషా ఫిర్యాదు మేరకు వెంగళరెడ్డిపై విచారించగా అనేక అవినీతి ఆరోపణలు తమ దృష్టికి వచ్చినట్లు డిఎస్పీ తెలిపారు. దీంతో తాము పక్కా ప్రణాళికగా మంగళవారం ఆదోనిలోనే రాజశ్రీ హొటల్ వద్ద ఉన్న సైకిల్‌స్టాండ్ సీమీపంలో కాపుకాసినట్లు ఆయన తెలిపారు. ఇంతలో సైకిల్ స్టాండ్ వద్ద ఉన్న మహబూబ్‌బాషా వద్దకు వెంగళరెడ్డి వచ్చి రూ. 3వేల లంచం తీసుకుంటుండగా వెళ్లిపట్టుకున్నట్లు డిఎస్పీ చెప్పారు. ఆ తరువాత వెంగళరెడ్డిని అదుపులోకి తీసుకొని హోటల్ గదిలో విచారించగా లంచం తీసుకున్నట్లు వెలుగుచూసిందన్నారు. తాము ఇచ్చిన రూ. 3వేల రూపాయలు కూడా నెంబర్లు సరిపోయినట్లు పేర్కొన్నారు. ఈయన ఇంటిపై కూడా దాడులు నిర్వహించి అక్రమ ఆస్తుల వివరాలను కూడా పరిశీలిస్తున్నట్లు డిఎస్పీ చెప్పారు. ఈ దాడిలో తనతోపాటు, సిఐలు నాగరాజు, ప్రసాద్, కృష్ణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు. వెంగళరెడ్డి పని చేస్తున్న హొళగుంద మండలంలో కూడా విచారణ చేస్తున్నట్లు డిఎస్పీ వివరించారు. మహబూబ్‌బాషా మాట్లాడుతూ తన ఎరువుల దుకాణం లైసన్స్‌ను రెన్యూవల్ చేయకుండా వేదిస్తున్నట్లు చెప్పారు. చివరికి రూ. 3వేల లంచం అడగడంతో తాను ఏసిబి అధికారులను ఆశ్రయించానన్నారు. ఏసిబి అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డిఎస్పీ తెలిపారు.
ఏసిబి దాడితో మూతబడిన కార్యాలయం
హొళగుంద, ఆగస్టు 6:నిత్యం రైతులతో రద్దీగా ఉండే వ్యవసాయ కార్యాలయం మంగళవారం మూతబడింది. గజ్జహళ్లిలో సనా ఎరువుల దుకాణం రెన్యూవల్ చేయడానికి వ్యవసాయ అధికారి వెంగళరెడ్డి రూ. 3వేలు లంచం అడుగగా యజమాని బాషా అవినీతి నిరోదకశాఖ అధికారులను ఆశ్రయించాడు. ఆదోనిలో వ్యవసాయశాఖ అధికారికి రూ. 3వేలు ఇస్తుండగా ఏసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు. వ్యవసాయ అధికారి ఏసిబికి చిక్కిన విషయం బయటికిపొక్కడంతో వ్యవసాయశాఖ సిబ్బంది కార్యాలయానికి తాళంవేసి పరారైయ్యారు. వ్యవసాయశాఖ అధికారి ఏసిబికి చిక్కడం ఇది మూడవ సంఘటన.
కరువుసీమకు కృష్ణాజలాలను అదించేందుకు కోట్లాది రూపాయల వ్యయంచేసి
english title:
handri neeva
Date:
Wednesday, August 7, 2013