మంత్రాలయం, ఆగస్టు 6:తుంగభద్ర డ్యాం నుంచి లక్షా 50వేల క్యూసెక్కుల నీటిని తుంగభద్ర నదిలో వదలడంతో మంత్రాలయం వద్ద నీటి మట్టం పెరుగుతోంది. దీంతో మంత్రాలయం వద్ద తుంగభద్ర నది పరవళ్లు తొక్కుతోంది. మంత్రాలయం వద్ద ప్రస్థుతం 311.500 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నట్లు సిడబ్ల్యూసి జెఇ విజయభారతి తెలిపారు. 312 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తే మొదటి ప్రమాద హెచ్చరికలు జారి చేస్తామని ఆయన అన్నారు. ప్రస్థుతం తుంగభద్ర నీటి మట్టం తగ్గవచ్చని ఆమె అన్నారు.
తుంగభద్ర డ్యాం నుండి పెద్ద ఎత్తున నీరు విడుదల చేయడంతో నదీతీర గ్రామ ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి వద్ద ఉన్న ఆర్డీఎస్ నదీతీర గ్రామాలను పరిశీలించారు. అనంతరం మంత్రాలయంలోని ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో విలేఖరులతో మాట్లాడుతూ, తుంగభద్ర డ్యాం నుంచి విడుదల చేసిన నీటిని ఎప్పటికప్పుడు దిగువ ప్రాంతాలకు పంపుతున్నామని, దీంతో శ్రీశైలం వద్ద ఉన్న నాగార్జునసాగర్‌కు 4లక్షల క్యూసెక్కులనీరు ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నాయని ఆయన అన్నారు. మంత్రాలయం వద్ద ఫ్లడ్ వాల్ నిర్మాణాన్ని ప్రతిపాదన పెట్టామని, ఇందుకోసం రూ. 6కోట్లు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపినట్లు ఆయన తెలిపారు. మంత్రాలయంలో అక్రమంగా లేఔట్లు వేసి ప్లాట్లు అమ్ముతున్నవారిపై కేసులు పెడుతామని ఆయన హెచ్చరించారు. మాధవరం వద్ద 133 కేవి సబ్‌స్టేషన్ నిర్మాణానికి పూర్తి స్థాయిలో స్థల పరిశీలన చేశామని నిర్మాణానికి కాంట్రాక్టర్ల ఆలస్యం వల్ల పనులలో జాప్యం జరుగుతోందని ఆయన అన్నారు. అనంతరం మంత్రాలయం వద్ద తుంగభద్ర నది నీటి మట్టాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్‌ఇ సుధాకర్, ఇఇ శ్రీనివాసులు, డిఇ లక్ష్మినరసింహ, నేహామియా, ఆర్డీఓ రాంసుందర్‌రెడ్డి, తహశీల్దార్ శ్రీనివాస్‌రావు, సిడబ్ల్యూసి జెఇ విజయభారతి, ఆర్‌ఐ ఆదాం, విఆర్‌ఓ భీమన్నగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
తుంగభద్ర డ్యాం నుంచి లక్షా 50వేల
english title:
tunga bhadra
Date:
Wednesday, August 7, 2013