Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

పల్లెలకు పాకిన విభజన సెగ

$
0
0

కర్నూలు, ఆగస్టు 7: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా స్వచ్చందంగా ఉద్యమించిన ప్రజలకు కుష్టు వ్యాధిగ్రస్తులు మేము సైతం అంటూ తమ మద్దతును తెలియజేశారు. కర్నూలు నగరంలో బుధవారం కుష్టు వ్యాధి గ్రస్తులంతా కలిసికట్టుగా ర్యాలీ నిర్వహిస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఏ నాడోచేసిన పాప ఫలితాన్ని తాము అనుభవిస్తున్నామని ఇపుడు రాష్ట్ర విభజనకు పాల్పడి పాపాన్ని మూటగట్టుకొని తమ మాదిరే శాపగ్రస్తులు కావద్దంటూ వారు పాలకులను హెచ్చరించారు. కుష్టు వ్యాధిగ్రస్తులు చేపట్టిన ర్యాలీలో సమైక్యవాదులు పాల్గొని తమకు మద్దతునిచ్చి నిరసన వ్యక్తం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ప్రభుత్వ వైద్యుల ఆధ్వర్యంలో కళ్లుండీ వాస్తవాలు చూడలేకపోతున్న పాలకుల కన్నా కళ్లులేని కబోదులు అనేక రెట్లు మేలంటూ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అదే సమయంలో ఆసుపత్రికి చికిత్సల నిమిత్తం వచ్చిన రోగులకు రహదారిపైనే వైద్య సేవలందించి తమ నిరసన వ్యక్తం చేశారు. వైద్యులకు మద్దతుగా వైద్య, ఆరోగ్య సిబ్బంది సైతం సమైక్య ర్యాలీలో పాల్గొని రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా భారీ ఎత్తున నినాదాలు చేశారు. మరోవైపు ఆరోగ్యం కోసం రోజూ యోగా చేసేవారు బుధవారం తెల్లవారుజామున 44వ నంబరు జాతీయ రహదారిపైకి చేరి అక్కడే యోగాభ్యాసాన్ని చేశారు. రెండు గంటల పాటు రాష్ట్ర సమైక్యత అవసరం గురించి వివరిస్తూ యోగాభ్యాసం చేస్తూ రహదారిపై రాకపోకలను అడ్డుకున్నారు. అనంతరం అక్కడే అల్పాహారాన్ని స్వీకరించారు. యోగాభ్యాసకులకు పత్తికొండ ఎమ్మెల్యే కెయి ప్రభాకర్ మద్దతు తెలిపి తన జీవితంలో ప్రజలే స్వచ్చందంగా ఉద్యమించడం అది తారాస్థాయికి చేరుకోవడం ఇదే ప్రథమమని వెల్లడించారు. ఏ ఒక్కవర్గమో, ఒకటి, రెండు సంఘాల వారో ఉద్యమించడం చూశానని సమైక్య ఉద్యమంలో ఎలాంటి తారతమ్యాలు లేకుండా వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని తమ డిమాండ్‌ను నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తుండటం ఎంతో గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. ప్రజాగ్రహాన్ని చూస్తున్న పాలక కాంగ్రెస్‌నేతలు జనంలోకి రావడానికి భయపడి ఇళ్లకే పరిమితమవుతున్నారని ఎద్దేవా చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యమంలో భాగంగా ర్యాలీ, ధర్నా, వంటా-వార్పు వంటి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, ప్రజా, కుల సంఘాల వారు ఒక్క తాటి పైకి వచ్చి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. గత వారం రోజులుగా విద్యా సంస్థలన్నింటిని మూసివేయగా ఆర్టీసీ బస్సులు సైతం డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని ఉద్యోగులు, కార్మికులు, అధికారులు సైతం తమ వంతు బాధ్యతగా ఉద్యమంలో పాల్గొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాల, డోన్, బేతంచెర్ల, ఆత్మకూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ తదితర పట్టణాల్లో ఉద్యమహోరు తారాస్థాయికి చేరుకుంది. శాంతియుతంగా నిర్వహిస్తున్న సమైక్య ఉద్యమం రానున్న ఒకటి, రెండు రోజుల్లో మరింత ఉధృతం చేస్తామని సమైక్య ఉద్యమ కార్యాచరణ కమిటీ ప్రకటించింది. సమ్మె చేయ తలపెట్టిన ఎన్జీవోలకు అన్ని వర్గాల నుంచి పూర్తి స్థాయి మద్దతును బేషరతుగా ఇచ్చి వారి సమ్మెను జయప్రదం చేస్తామని తెలిపారు. కేంద్రం తక్షణం దిగివచ్చిన రాష్ట్ర విభజన ప్రక్రియను ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
హంద్రీనీవాకు నీటి విడుదల
నందికొట్కూరు, ఆగస్టు 7: హంద్రీనీవా ముఖద్వారామైన నందికొట్కూరు మండలం మల్యాలవద్ద నిర్మించిన హంద్రీనీవా సుజలస్రవంతి మొదటిదశ పనుల పూర్తికావడంతో శ్రీశైలం బ్యాక్ వాటర్ సపోర్ట్ కెనాల్ ద్వారా ప్రాజెక్టులోకి నీరుచేరడంతో బుధవారం ప్రాజెక్టుకు అమర్చిన 12 పంపులలో 5వ మోటరు పంపు ద్వారా హంద్రీనీవా ప్రధాన కాలువకు అధికారులు నీటిని విడుదల చేశారు. హంద్రీనీవా ప్రధాన కాలువను ప్రాజెక్టుకు అమర్చిన కంప్యూటర్ మోనిటర్ ద్వారా నీటిని పంపింగ్‌చేసే విధానాన్ని కలెక్టర్ సుదర్శన్ రెడ్డి పరీశీలించారు. కృష్ణా జలాల నీటి ప్రవాహం విద్యుత్ మోటర్ల పనితీరును, నీటి సామర్ధ్యతను నీటిపారుదల శాఖ ఇఇ పాండురంగయ్య కలెక్టరుకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సుదర్శనరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో కృష్ణాజలాలు సంవృద్ధిగా వున్నాయన్నారు. రాయలసీమలోని కరువు ప్రాంత మండలాలకు త్రాగు,సాగు నీటిని అందించేందుకు ప్రభుత్వం జిల్లాలోని ఆయాకట్టు క్రింద 15వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు 700 క్యూసెక్కుల నీటిని విడుదలకు ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసిందన్నారు. జిల్లాలో ఈ పథకం క్రింద ఏర్పాటుచేసిన కృష్ణగిరి, పత్తికొండ, పందికొన, జిడిపల్లె రిజర్వాయరులకు పూర్తినీటిమట్టం చేసుకోవచ్చున్నారు. హంద్రీనీవా యస్‌ఇ పాండురంగయ్య మాట్లాడుతూ హంద్రీనీవా కాలువకు అమర్చిన12పంపులలో 6పంపులను ట్రయల్ రన్ నిర్వహించి పరిశీలించామన్నారు. హెచ్‌ఎన్‌యస్‌యస్ వివిధ ప్రాంతలలోగల 8పంపింగ్ స్టేషన్లు ద్వారా మల్యాల వద్దనున్న పంపింగ్ స్టేషన్ ఫేస్1 నుంచి అనంతపురం జిల్లాలోని జిడిపల్లె రిజర్వాయరు వరకూ నీటిని సరాఫరా చేస్తామన్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నందు 884.5 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ఉదయం విడుదల చేసిన ఒక్కమోటరు ద్వారా 320 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా సాయంకాలం 5, 7 మోటర్లు ద్వారా నీటిని విడుదల చేశారు. బ్రాహ్మాణకొట్కూరు వద్దనున్న హంద్రీనీవా రెండవ ఎత్తిపోతల పథకానికి 7 అడుగుల లోతు నీరు రాగనే నీటిని పంపింగ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కలెక్టరు వెంట వివిధ నీటి పారుదల శాఖ అధికారులు, హంద్రీనీవా డిఇ నాయక్, తదితరులు ఉన్నారు.
హంద్రీనీవాకు నీరు విడుదల
నందికొట్కూరు, ఆగస్టు 7: నందికొట్కూరు మండలం మల్యాలవద్ద నిర్మించిన హంద్రీనీవా సుజలస్రవంతి మొదటిదశ పనుల పూర్తికావడంతో శ్రీశైలం బ్యాక్ వాటర్ సపోర్ట్ కెనాల్ ద్వారా ప్రాజెక్టులోకి నీరుచేరడంతో బుధవారం ప్రాజెక్టుకు అమర్చిన 12 పంపులలో 5వ మోటరు పంపు ద్వారా హంద్రీనీవా ప్రధాన కాలువకు అధికారులు నీటిని విడుదల చేశారు. హంద్రీనీవా ప్రధాన కాలువను ప్రాజెక్టుకు అమర్చిన కంప్యూటర్ మోనిటర్ ద్వారా నీటిని పంపింగ్‌చేసే విధానాన్ని కలెక్టర్ సుదర్శన్ రెడ్డి పరీశీలించారు. కృష్ణా జలాల నీటి ప్రవాహం విద్యుత్ మోటర్ల పనితీరును, నీటి సామర్ధ్యతను నీటిపారుదల శాఖ ఇఇ పాండురంగయ్య కలెక్టరుకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సుదర్శనరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో కృష్ణాజలాలు సంవృద్ధిగా వున్నాయన్నారు. రాయలసీమలోని కరువు ప్రాంత మండలాలకు త్రాగు,సాగు నీటిని అందించేందుకు ప్రభుత్వం జిల్లాలోని ఆయాకట్టు క్రింద 15వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు 700 క్యూసెక్కుల నీటిని విడుదలకు ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసిందన్నారు. జిల్లాలో ఈ పథకం క్రింద ఏర్పాటుచేసిన కృష్ణగిరి, పత్తికొండ, పందికొన, జిడిపల్లె రిజర్వాయరులకు పూర్తినీటిమట్టం చేసుకోవచ్చున్నారు. హంద్రీనీవా యస్‌ఇ పాండురంగయ్య మాట్లాడుతూ హంద్రీనీవా కాలువకు అమర్చిన 12పంపులలో 6పంపులను ట్రయల్ రన్ నిర్వహించి పరిశీలించామన్నారు. హెచ్‌ఎన్‌యస్‌యస్ వివిధ ప్రాంతలలోగల 8పంపింగ్ స్టేషన్లు ద్వారా మల్యాల వద్దనున్న పంపింగ్ స్టేషన్ ఫేస్1 నుంచి అనంతపురం జిల్లాలోని జిడిపల్లె రిజర్వాయరు వరకూ నీటిని సరాఫరా చేస్తామన్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నందు 884.5 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ఉదయం విడుదల చేసిన ఒక్కమోటరు ద్వారా 320 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా సాయంకాలం 5, 7 మోటర్లు ద్వారా నీటిని విడుదల చేశారు. బ్రాహ్మాణకొట్కూరు వద్దనున్న హంద్రీనీవా రెండవ ఎత్తిపోతల పథకానికి 7 అడుగుల లోతు నీరు రాగనే నీటిని పంపింగ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కలెక్టరు వెంట వివిధ నీటి పారుదల శాఖ అధికారులు, హంద్రీనీవా డిఇ నాయక్, తదితరులు ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మోసం చేసింది
నంద్యాల రూరల్, ఆగస్టు 7: సమైక్యాంధ్ర విషయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రకటన వల్ల కాంగ్రెస్ పార్టీ అదిష్టానం మోసం చేసిందని అందువల్లే స్పీకర్‌కు రాజీనామా లేఖ అందించినట్లు నంద్యాల ఎమ్మెల్యే శిల్పామోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం నంద్యాలలోని జర్నలిస్టుల రిలేనిరాహారదీక్షలకు సంఘీభావం తెలుపుతూ జర్నలిస్టులకు నిమ్మరసం ఇచ్చి ఎమ్మెల్యే వారితో దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా విలేఖరులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రజలు ఏపార్టీ కోరితే ఆపార్టీలోకి వెళ్లి నంద్యాల నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడతానన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదుకాని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. ఎంపి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తెలంగాణ విభజన విషయం తెలియదన్నారు. సోనియాగాంధీ, ప్రధానమంత్రి చేతుల్లో ఉందని ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులు అందరు కలిసి అదిష్టానానికి లేఖ ఇచ్చామన్నారు. సమైక్యాంధ్రకు చిన్నపెద్ద, విద్యార్థులు, ప్రజాసంఘాలు ప్రతి ఒక్కరు సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నారన్నారు. సమైక్య విభజన విషయం తెలిసిన తరువాత భవిష్యత్తు ప్రణాళికను రూపొదిస్తానన్నారు. త్వరలోనే సోనియాగాంధీ, ప్రధానమంత్రి విభజన విషయాన్ని తెలియజేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. అన్నిపార్టీలు సమైక్యంగా ఉండి సమైక్యాంధ్ర సాధించుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
ఎన్నికల్లో పార్టీల తరపున
పోటీ చేయమని తీర్మానం చేయండి
నంద్యాల రూరల్, ఆగస్టు 7: రాష్ట్రాన్ని విభజించినా కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయకుండా మోసం చేస్తున్నారని సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని, కాంగ్రెస్ పార్టీతో పోటీచేయమని తీర్మాణం చేసి, రాజీనామా లేఖలు చూపించి ఉద్యమాల్లో పాల్గొనాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర గవర్నింగ్ సభ్యులు మాజీ ఎంపి భూమానాగిరెడ్డి అన్నారు. బుధవారం నంద్యాలలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో భూమా నాగిరెడ్డి మాట్లాడుతూ రాయల తెలంగాణ కావాలంటూ మంత్రులు మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎందుకు వౌనంగా ఉన్నారో తెలపాలని భూమా అన్నారు. రాజీనామాలు చేయని మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లను జెఎసి నాయకులు ముట్టడించాలని భూమా నాగిరెడ్డి సూచించారు. రాష్ట్రంలో సమైక్యంగా ఉండేందుకు ప్రజలు ఉన్నారన్నారు. సమైక్యాంధ్ర కోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు, దళితులు, ఎన్‌జిఓలు ప్రతి ఒక్కరు పోరాటాలు చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఇంతవరకు సమైక్యాంధ్ర గుర్తుకురాలేదా అంటూ నిలదీశారు. రాజీనామా చేసి పార్టీలకు దూరంగా ఉండి రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని జిల్లా మంత్రులను భూమా కోరారు. ఆంధ్రప్రదేశ్‌ను తాకట్టుపెట్టి పార్టీలను రాబోయే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని భూమా అన్నారు.

రాహుల్‌గాంధీ కోసమే
రాష్ట్రంలో చిచ్చు
ఎమ్మిగనూరు, ఆగస్టు 7 : రాహూల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకే సోనియాగాంధీ కుట్రపన్ని రాష్ట్రాన్ని విభజిచడం దారుణమని, యుపిఎ చ ర్యల ఫలితంగానే రాష్ట్రం రావణకాష్టం లా మండుతోందని ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి స్పష్టం చేశారు. సోమప్పసర్కిల్‌ల్లో బుధవారం రాష్ట్ర విభజనపై ప్రజలనుద్దేశించి మాట్లాడారు. వేలాదిమంది వలసలు వచ్చి హైదరాబాద్‌లో ఉంటే వారు వెళ్లాలని కెసిఆర్ శాసించడం తగదన్నారు. వైకాపా దీక్షల్లో నాయకులు శ్రీనివాసులు, మధుసూదన్‌రెడ్డి, నాగేశ్వరరావు, రామలింగారెడ్డి కూర్చున్నారు. టిడిపి ఇన్‌చార్జి డాక్టర్ జయనాగేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో టిడిపి నాయకులు సోమప్ప సర్కిల్లో పెద్దఎత్తున రాస్తారోకో నిర్వహించారు.
ప్రజాభీష్టం మేరకే సిలికాన్ తవ్వకాలకు అనుమతి
* జెసి కన్నబాబు
ఓర్వకల్లు, ఆగస్టు 7: ప్రజలు అంగీకరిస్తేనే సిలికాన్ తవ్వకాలను అనుమతిస్తామని జెసి కన్నబాబు అన్నారు. మండల పరిధిలోని లోద్దిపల్లె గ్రామ మజార అయిన మంగంపల్లె ప్రాంతంలోబుధవారం ఆయన సిలికాన్ తవ్వకాలపై ప్రజాభిప్రాయసేకరణ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ హనుమాన్ మినరల్స్ అనే కంపెనీ ఈ ప్రాంతంలోని 270, 275, 273, 279 సర్వేనంబర్లకు సంబందించిన 153 హెక్టార్ల ప్రభుత్వ భూములలో సిలికాన్ తవ్వకం జరిపేందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తులు చేసిందన్నారు. ఈ విషయమై ఈ ప్రాంతపు ప్రజలు, రైతుల అభిప్రాయాలు సేకరించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. సదస్సులో ఆయాయా గ్రామాల ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతానికి చెందిన పుడిచెర్లరైతులు సిలికాల్ తవ్వకాల వల్ల ఈ ప్రాంతంలో వాతావరణ కాలుష్యం ఏర్పడి పొలాలలో పంటలకు నష్టం సంభమించే అవకాశం వుందని అబిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్పందించిన జెసి ప్రజాభిప్రాయాలను ప్రభుత్వానికి పంపి తుదినిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈకార్యక్రమంలో లొద్దిపల్లె సర్పంచు రాజేశ్వరరెడ్డి, సింగిల్ విడోచైర్మన్ వీర భద్రారెడ్డి, గ్రామ రైతులు పాల్గొన్నారు.
తెలుగుజాతిని విభజిస్తే సహించం
ఓర్వకల్లు, ఆగస్టు 7: ఎన్నో ఏళ్ల చరిత్రగల్గిన తెలుగు జాతిని విభజిస్తే సహించేది లేదని ప్రాణాలైన త్యాగంచేసి విభజనను అడ్డుకుంటామని నన్నూరు గ్రామ సర్పంచ్ చెన్నారెడ్డి అన్నారు. మండల పరిధిలోని నన్నూరు గ్రామంలో రాష్టవ్రిభజనను నిరసిస్తు ఆయన ఆధ్వర్యంలోబుధవారం మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కర్నూలు చిత్తూరుజాతీయ రహదారిపై రాస్తారోకో ధర్నానిర్వహించారు. శ్రీపతి, పరమేష్, కాంగ్రెస్ కార్యకర్తలు యేసు, పాల్గొన్నారు.
పోలీసుస్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్‌పి
నందికొట్కూరు, ఆగస్టు 7, మండల పరిధిలోని బ్రాహ్మణకొట్కూరు పోలీసుస్టేషన్‌ను బుధవారం జిల్లా ఎస్‌పి రఘురామిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలో ఉన్న సమస్యాత్మక గ్రామాలైన కోళ్లబావాపురం, దామగట్ల గ్రామాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
ఉయ్యాలవాడ, ఆగస్టు 7:ప్రభుత్వం అర్హులైన రైతులకు సబ్సీడి రూపంలో అందించే అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయాధికారి సుధాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం కార్యాలయానికి సరఫరా అయిన 80 తార్పాలిన్ పట్టలను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు 50 శాతం సబ్సీడితో వ్యవసాయ పనిముట్లు, ఇతర యంత్ర పరికరాలు సరఫరాకు డిడిలు చెల్లించినట్లయితే పరికరాల కొనుగోలుకు అనుమతి ఇస్తామన్నారు. తార్పాలిన్ పట్టలు మంజూరైన రైతులకు వాటిని అందజేశారు. ఏఈఓలు రాజు, నాగరాజు, రైతులు పాల్గొన్నారు.
సమైక్యాంధ్రను కొనసాగించాలి
క్రిష్ణగిరి, ఆగస్టు 7: సమైక్యాంధ్రప్రదేశ్‌ను కొనసాగించాలని కర్నూలు డివిజన్ విఆర్వో సంఘం అధ్యక్షులు పి.రామకష్ణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో మండల వీఆర్వోలు, వీఆర్‌ఎలు, కార్యాలయ సిబ్బంది రాష్ట్ర విభజనకు నిరసనగా నల్లబ్యాడ్జిలు ధరించి విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వార్థ రాజకీయ నాయకులు తమ పదవుల కోసం రాష్ట్రాన్ని విభజించడం దారుణమన్నారు. సమైక్యాంధ్ర జెఎసి పిలుపుమేరకు ఈనెల 12 నుంచి మండల విఆర్వోలు, విఆర్‌ఎలు నిరవధిక సమ్మె నోటీసును తహశీల్దార్ మాధవరావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి తహశీల్దార్ ప్రసన్న మోజెస్, సీనియర్ అసిస్టెంట్ మధుసుధన్‌రావు, విఆర్వోలు పార్ధసారధి, ప్రసాద్, రాజశేఖర్‌రెడ్డి, విఆర్‌ఎలు మాధవకృష్ణ, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ముట్టడికి భారీగా తరలిరండి
కర్నూలు టౌన్, ఆగస్టు 7: కల్లూరు మండలంలోని హంద్రీ పరివాహక ప్రాంతాల రైతులు కలెక్టరేట్‌ను బుధ, గురువారాల్లో ముట్టడి చేసేందు భారీగా వాహణాలలో తరలివెళ్తున్నామని హంద్రీ నది పరివాహక కమిటి సభ్యులు రామకృష్ణరెడ్డి తెలిపారు.

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా స్వచ్చందంగా
english title: 
p

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>