శృంగవరపుకోట, మార్చి 2: పట్టణంలోని ఆక్స్‌ఫర్డ్ డిగ్రీ కళాశాలలో గురువారం పరీక్షాకేంద్రంలో పిజి పరీక్షలు రాయవలసిన 15మంది స్వంత ఇంటిలో ప్రైవేటు పాఠశాలలో తమ ఇష్టం వచ్చినట్లు మాస్‌కాపీయింగ్‌తో పరీక్ష రాస్తున్నారన్న వార్త విదితమై. పత్రికల్లో వెలువడిన వార్తమేరకు శుక్రవారం ఎయు ఎకనామిక్స్ ప్రొఫెసర్ డి.పుల్లారావు పరిశీలించారు. కళాశాలలో పరీక్షలు నిర్వహణ రికార్డులను పరిశీలించి అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ కళాశాలలో ఎంఎ సోషల్‌వర్క్ 4వ సెమిష్టరీ పరీక్షలు 2నుండి 7వరకు జరుగనున్నాయన్నారు. మొదటిరోజు డెవలప్‌మెంట్ ఎడ్మినిస్ట్రేషన్ అనే పరీక్ష రాస్తున్నవారు వేరేకళాశాలలో, ఇళ్ళలో పరీక్ష నిర్వహిస్తున్నారనే వార్త పేపర్లలో చూసి విచారణ నిమిత్తం వచ్చామన్నారు. కళాశాలలో మొదటిరోజు 70మంది పరీక్ష రాయవలసి ఉండగా 54మంది పరీక్షకు హాజరయ్యారన్నారు. మిగిలిన 16మంది పరీక్ష ఎక్కడ రాస్తున్నది విచారణ జరిపి గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అదేసమయంలో పిజి పరీక్షలకు యూనివర్సిటీ నుండి పైస్థాయి అధికారులను పర్యవేక్షక నిమ్తిత్తం నియమించాలని పత్రికా విలేఖర్లు ప్రశ్నించగా కొత్తగా 16యూనివర్సిటీలను ఏర్పాటు చేయడంవల్ల యూనివర్సిటీలల్లో గ్రాంట్స్ తక్కువగా ఉన్నాయన్నారు. ఐదేళ్ళుగా ఎటువంటి అధికారులను నియమించలేదన్నారు. ఎస్.సి.ఎఫ్ పారాలు గురువారం కళాశాలకు ఎన్నివచ్చాయి, పరీక్షరాయగా ఎన్ని మిగిలాయని ప్రశ్నించగా పరీక్ష అనంతరం ఎయుకు పంపించడం జరుగుతుందన్నారు.
విలీన గ్రామాల అభివృద్ధికి చర్యలు
విజయనగరం (్ఫర్టు), మార్చి 2: విజయనగరం మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ ఎస్.గోవిందస్వామి తెలిపారు. వార్డు పర్యటనలో భాగంగా శుక్రవారం అయ్యన్నపేటలో పర్యటించారు. మున్సిపాలిటీలో ఇటీవల ఈ గ్రామం విలీనమైంది. ఈ గ్రామాన్ని శుక్రవారం మున్సిపల్ అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను మున్సిపల్ కమిషనర్ ఎస్.గోవిందస్వామి అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మంచినీటి ఎద్దడి ఎక్కువగా ఉందని, పారిశుద్ధ్య నిర్వహణ ఏమాత్రం బాగోలేదని, డ్రైనేజి వ్యవస్థ అస్తవ్యస్తంగా స్థానికులు తెలిపారు. ఈ సమస్యలపై స్పందించిన కమిషనర్ గోవిందస్వామి మాట్లాడుతూ పట్టణంలో తొమ్మిది గ్రామాలు మున్సిపాలిటీలో విలీనమయ్యాయని తెలిపారు. ఈ గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు.
పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టిని సారిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రణాళిక విభాగం అధికారి వి.శోభన్‌బాబు, మున్సిపల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి.వెంకటరావు, మున్సిపల్ స్కూల్స్ సూపర్‌వైజర్ వై.అప్పలనాయుడు, మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ సన్యాసినాయుడుతోపాటు పలు విభాగాల అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.