విజయనగరం (్ఫర్టు), మార్చి 2: ప్రయాణికులతో సత్సంబంధాలు మెరుగుపర్చుకోవాలని ఆర్టీసీ డిప్యూటీ ట్రాఫిక్‌మేనేజర్ పి.జీవన్‌ప్రసాద్ అన్నారు. ప్రయాణికుల సమన్వయకర్తలతో శుక్రవారం తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్‌ప్రసాద్ మాట్లాడుతూ ప్రయాణికుల ఆదరణపైనే ఆర్టీసీ మనుగడ ఆధారపడి ఉందన్నారు. అందువల్ల ప్రయాణికులతో సత్సంబంధాలను మెరుగుపర్చుకోవాలన్నారు. పెరుగుతున్న ప్రైవేటువాహనాలను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ఆదాయానికి గండి ఏర్పడకుండా చూడాలన్నారు. ముఖ్యంగా ప్రయాణీకుల అవసరాలకు అనుగుణంగా బస్సులను నడిపి ఆదాయం పెంపునకు కృషి చేయాలన్నారు. బస్సులను, బస్‌స్టేషన్‌లను పరిశుభ్రంగా ఉంచేటట్లు చూడాలన్నారు. వనితాకార్డుల విక్రయాలను పెంచాలన్నారు. ఈ సమావేశంలో ఆర్.ఎం.కార్యాలయం అసిస్టెంట్‌మేనేజర్ ఎన్.వి.ఎస్.వేణుగోపాల్, విజయనగరం, శృంగవరపుకోట, సాలూరు, పార్వతీపురం, పాలకొండ డిపోల ప్రయాణికుల సమన్వయకర్తలు పి.జి.రాఫిల్, పెంట సత్యారావు, జి.ప్రకాశరావు, ఎ.ఎస్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.
సమస్యలుంటే తెలపండి
విజయనగరం (తోటపాలెం), మార్చి 2: గ్రామంలో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని మండల ప్రత్యేకాధికారి జి.రాజకుమారి ప్రజలను కోరారు. మండలంలోని గొల్లలపేట పంచాయతీలో శుక్రవారం గ్రామసందర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్‌డిపో, పాఠశాలలు, అంగన్‌వాడీ, పారిశుద్ద్యం పనులపై పరిశీలన జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలో పిల్లలపట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. గ్రామప్రజలు ఉపాధి హామీ పనులు లేక ఖాళీగా ఉన్నామని తెలుపగా సంబంధిత అధికారి ఎపిఓ నాగలక్ష్మిని వివరణ కోరగా 100రోజులు అయిందని తెలిపారు. కోరాడపేటలో పారిశుద్ధ్యం బాగా లేదు, మరుగునీరు నిలువ ఉందని స్థానికులు తెలుపగా గ్రామ కార్యదర్శిని వివరణ కోరగా రిపేర్ వర్కులు మంజూరుకు వేచి చూస్తున్నామని మంజూరు అవగానే చేయిస్తామని తెలిపారు. ఇందులోభాగంగా వైద్య, పశువైద్య శిబిరాలకు మంచిస్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ డి.సత్యనారాయణ, మండల తహశీల్దారు డి.లక్ష్మారెడ్డి, ఎపిఓ జి.నాగలక్ష్మి, ఎంఇఓ ఎం.మురళికృష్ణ, హౌసింగ్ ఎఇ ఎ.సూర్యప్రకాష్, వ్యవసాయశాఖ ఎణ డి.సత్యనారాయణ, ఐసడిఎస్ సూపర్‌వైజర్ కుసుమ రాకోడు వైద్యాధికారి కె.రవికుమార్, పశువైద్యాధికారి పి.్ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సులో మండలంలోని కోరాడపేట రామాపేట గ్రామాల్లో రెవెన్యూ సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ రెవెన్యూ సదస్సుకు మండల ప్రత్యేకాధికారితోపాటు మండల అధికారులు పాల్గొన్నారు. భూసమస్యలపై రెండుగ్రామాల్లో కలిపి అయిదు ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. సారిక గ్రామం రెవెన్యూ పరిధికాగా 9గ్రామాలు ఒకే గ్రామపరిధిలో ఉన్నాయి. కనుక రైతులకు ఇబ్బంది లేకుండా రోజుకు ఒకగ్రామంలో రెవెన్యూ సదస్సులు పెట్టినట్లు అధికారులు తెలిపారు. ఈకార్యక్రమంలో ఆర్‌ఐలు కె.శ్రీనివాసరావు, సర్వేయర్ తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.