శృంగవరపుకోట, మార్చి 2: మండలంలోని దారపర్తి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ సదస్కుకు రైతులు ఎవ్వరూ రాకపోడవంతో అధికారులు తూతూ మంత్రంగా నిర్వహించారు. ప్రత్యేకాధికారి ఎం.అశోక్‌కుమారి ఆధ్వర్యంలో వివిధ మండలస్థాయి అధికారులు నిర్వహించిన కార్యక్రమానికజ ఒక్క దరఖాస్తు మాత్రమే రావడంతో అక్కడకక్కడే పరిష్కరించారు. అదేసమయంలో కొంతమంది గిరిజనులు తమ గ్రామంలో ఎటువంటి సదస్సులు జరగడంలేదని ఏ సదస్సు అయినా చింతచెట్టు వద్ద నిర్వహిస్తున్నారని అధికారులకు తెలిపారు.
బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం
బొబ్బిలి (రూరల్), మార్చి 2: మండలం వెంకటరాయుడుపేట గ్రామంలో గోపిశెట్టి నిర్మలను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన విషయం విధితమే. దీనిపై జిల్లా జాయింట్ కలెక్టర్ పిఎ శోభ, ఆర్డీవో అంబేద్కర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.గోవర్ధనరావు, ఐసిడిఎస్ పిడి రాబర్ట్స్‌లు శుక్రవారం బాధితులనుంచి వివరాలు సేకరించారు. హత్యకు గురైన నిర్మల భర్త శ్రీనివాసరావును పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే శ్రీనివాసరావుకు ఇద్దరు పిల్లలున్నారు. ఇందులో ఒకరికి వివాహం కాగా భవాని 9వ తరగతి చదువుతోంది. అయితే భవానిని పాతబొబ్బిలిలో బాలసదన్ హాస్టల్లో చేర్పించేందుకు కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. హత్యకు పూర్వపరాలు సేకరించారు. అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం పరంగా ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేయాలని కోరారు. నిరుపేద కుటుంబమని, చిన్న పాన్‌షాపు ఉందని, అయితే పూర్తిస్థాయిలో వ్యాపారాలు లేక పలు ఇబ్బందులకు గురవుతున్నానన్నారు. అధికారులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నష్టపరిహారం అందించాలని కోరారు. జిల్లా జాయింట్ కలెక్టర్ శోభ స్పందిస్తూ ప్రభుత్వం నుంచి ఎటువంటి నష్టపరిహారం అందించే అవకాశం లేదని తేల్చి చెప్పారు.
అప్రమత్తంగా ఉండాలి
మండలం వెంకటరాయుడుపేట గ్రామంలో గోపిశెట్టి నిర్మలను బుధవారం రాత్రి దారుణంగా హత్య చేయడం దురదృష్టకరమని బొబ్బిలి మున్సిపల్ మాజీ చైర్మన్ ఆర్‌వి ఎస్‌కెకె రంగారావు(బేబీనాయన) అన్నారు. బాధిత కుటుంబాలను శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలపై దాడులను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాలన్నారు. చట్టాలను సక్రమంగా అమలు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి తమ వంతు కృషి చేస్తానన్నారు. హత్యకు గురైన నిర్మల కుమార్తె భవానిని చదివించేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఇటువంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈయనతోపాటు గోపాలరాయుడుపేట మాజీ సర్పంచ్ అక్కేన గౌరమ్మ, రామారావుతోపాటు పాల్గొన్నారు.
మండలంలోని దారపర్తి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ సదస్కుకు
english title:
s
Date:
Saturday, March 3, 2012