బొబ్బిలి, మార్చి 2: మండలం వెంకటరాయుడుపేట గ్రామంలో బుధవారం రాత్రి హత్యకు గురైన నిర్మల కుటుంబానికి నష్టపరిహారం అందించాలని మహిళా సంఘాల నాయకులు వి ఇందిర, బి పద్మజ డిమాండ్ చేశారు. ఈ మేరకు బొబ్బిలి డిఎస్పీ ఎన్.శ్రీదేవిరావుకు శుక్రవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు విలేఖర్లతో మాట్లాడుతూ మహిళలపై నానాటికి దాడులు పెచ్చుమీరుతున్నా ప్రభుత్వం నిద్రావస్థలో ఉందని దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్న పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తక్షణమే నిర్మల కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో బెల్ట్‌షాపులను తక్షణమే ఎత్తివేయాలన్నారు. మద్యానికి బానిసై ఇటువంటి దాడులను కొంతమంది ఒడిగట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తిగా మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మహిళా సంఘాల నాయకులు లక్ష్మి, సరస్వతి పాల్గొన్నారు.
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
బొబ్బిలి (రూరల్), మార్చి 2: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు శుక్రవారం పట్టణంలో ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 6 కేంద్రాలలో దాదాపు 2,200 మంది విద్యార్థులకు హాజరయ్యారు. ఆరు కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. పరీక్షాకేంద్రాలను తహశీల్దార్ ఎం అప్పారావు తనిఖీ చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎస్‌ఐ కె.సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షాకేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను విధించారు.
పాచిపెంటలో
పాచిపెంట: మండలంలోని ప్రారంభమైన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ప్రథమ సంవత్సరం తెలుగు పేపరు 1కు 80 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 73 మంది హాజరయ్యారు. ఒకేషనల్ జిపిసి పేపర్ 1కు 166 మంది హాజరుకావల్సి ఉండగా 159 మంది హాజరయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ ముఖలింగేశ్వరరావు తెలిపారు. పరీక్షల డిపార్టుమెంటల్ అధికారి వై.శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఈ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. పి.కోనవలస గిరిజన సంక్షేమ బాలుర కళాశాల వద్ద జరిగిన ఇంటర్ ప్రథమ పరీక్షకు 194 మంది విద్యార్థులు హాజరుకావల్సి ఉండగా 184 మంది హాజరైనట్లు కళాశాల ప్రిన్సిపల్ పి నాగభూషణరావు తెలిపారు. ఈపరీక్షలు డిపార్టుమెంట్ అధికారి పివి రమణమూర్తి పర్యవేక్షణలో ప్రశాంతంగా జరిగాయి.
సీతానగరంలో
సీతానగరం: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. సీతానగరం ప్రభుత్వ జూనియర్ కళాశాల, జోగింపేట ప్రతిభా గురుకుల పాఠశాలను పరీక్షా కేంద్రాలకు కేటాయించారు. గత ఏడాదితో పోలిస్తే విద్యార్థులకు ఈ రెండు పరీక్షా కేంద్రాల్లో పూర్తిస్థాయిలో సౌకర్యాలు ఉన్నాయి. గత ఏడాది చినబోగిలి వివేకవర్థిని జూనియర్ కళాశాల పరీక్షాకేంద్రంగా ఉండేది. కానీ ఈ ఏడాది ప్రతిభా గురుకుల పాఠశాలను అధికారులు ఎంపిక చేశారు. తెలుగు, జిఎఫ్‌సి పరీక్షలకు సీతానగరం 260 మందికి 250 మంది, జోగింపేట ప్రతిభా గురుకుల పాఠశాలలో 277 మందికి 262మంది విద్యార్థులు హాజరయ్యారు. సీతానగరం, జోగింపేట పరీక్షా కేంద్రాలను తహశీల్దార్ సత్యనారాయణస్వామి తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక గాయత్రీ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు సీతానగరం పరీక్షా కేంద్రానికి 40 నిలు ఆలస్యంగా రావడంతో వారిని నిర్వాహకులు పరీక్షలకు అనుమతించలేదు. దీంతో విద్యార్థులు నిరాశగా వెనుదిరిగారు.
మండలం వెంకటరాయుడుపేట గ్రామంలో బుధవారం రాత్రి హత్యకు గురైన నిర్మల
english title:
b
Date:
Saturday, March 3, 2012