Quantcast
Viewing all articles
Browse latest Browse all 69482

పవర్ హాలీడేను తక్షణమే ఎత్తివేయాలి

బొబ్బిలి, మార్చి 2: ప్రభుత్వం పరిశ్రమలకు విధిస్తున్న పవర్ హాలిడేను తక్షణమే ఎత్తివేయాలని ఇఫ్టూ, ఎఐటియుసి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సిటు కార్యాలయంలో శంకరరావు, ఎం గోపాలం శుక్రవారం విలేఖర్లతో మాట్లాడుతూ వారానికి దాదాపు మూడు రోజులు పవర్ హాలిడే వల్ల కార్మికులు రోడ్డున పడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. దీంతో జీవనోపాధికి ఇబ్బందులు తప్పడం లేదని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఈ నెల 6న ట్రాన్స్‌కో కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. దశల వారీగా వివిధ కార్యక్రమాలను చేపడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం పవర్ హాలిడేను ఎత్తివేయని పక్షంలో కార్మికులకు నష్టపరిహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు రామారావు, లక్ష్మణరావు పాల్గొన్నారు.

ప్రభుత్వం పరిశ్రమలకు విధిస్తున్న పవర్ హాలిడేను తక్షణమే ఎత్తివేయాలని
english title: 
p

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles