................
శాస్తమ్రేదైనా సంపూర్ణంగా అవగాహన చేసుకోవటం కష్ట సాధ్యం - కష్టసాధ్యమైనా ఆ శాస్త్రం పట్ల అభిరుచి అభినివేశం కలిగినవారు, శోధించి పరిశోధించేవారు అలుపెరుగకుండా ఆ శాస్త్రంలో కృషి చేస్తూనే ఉండాలి. అప్పుడే నూతన విషయాలు ఆవిష్కృతవౌతాయి. అట్లా చేయటం వల్లనే మహర్షులు మనకీ శాస్త్రాన్ని అందించగలిగారు. ఆ కృషిని మనమూ కొనసాగిస్తూ ఉండాలి. అయితే సామాన్యులకు లౌకిక ప్రయోజనాన్ని ఆశించే వారికి గంభీరమైన శాస్త్ర చర్చ అవసరం లేదు.
............
‘దురవగాహం శాస్త్రం’ అన్నారు పెద్దలు. శాస్తమ్రేదైనా సంపూర్ణంగా అవగాహన చేసుకోవటం కష్ట సాధ్యం - కష్టసాధ్యమైనా ఆ శాస్త్రం పట్ల అభిరుచి అభినివేశం కలిగినవారు, శోధించి పరిశోధించేవారు అలుపెరుగకుండా ఆ శాస్త్రంలో కృషి చేస్తూనే ఉండాలి. అప్పుడే నూతన విషయాలు ఆవిష్కృతవౌతాయి. అట్లా చేయటం వల్లనే మహర్షులు మనకీ శాస్త్రాన్ని అందించగలిగారు. ఆ కృషిని మనమూ కొనసాగిస్తూ ఉండాలి. అయితే సామాన్యులకు లౌకిక ప్రయోజనాన్ని ఆశించే వారికి గంభీరమైన శాస్త్ర చర్చ అవసరం లేదు. ఆయా సందర్భాలలో సంస్కారవంతమూ, సౌలభ్యమూ అయిన మార్గాలు సూచిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ దిశగానే ఈ వ్యాసాలు. అయితే అప్పుడప్పుడూ పాఠకుల అభిరుచి, అభిప్రాయాల కనుగుణంగా కొన్ని గంభీరమైన విషయాలు కూడా ముచ్చటించటం కాదనలేం.
వాస్తు శాస్త్రంలో ‘అర్వణము’ అనే ఒక మాట ఉంది. అర్వణమూ అంటే అచ్చి రావటం. గ్రామాలూ, నగరాలూ, స్థలాలూ, క్షేత్రాలూ కొన్ని కొందరికి అచ్చి వస్తాయి. కొందరికి అచ్చిరావు. ఒకరికి పని చేసిన మందు మరొకరికి పని చేయకపోవచ్చు. ఒక్కొక్కప్పుడు హాని కూడా చేయవచ్చు. అక్కడే సాపేక్ష సిద్ధాంతం (్థయరీ ఆఫ్ రిలేటివిటీ) పాటించాలి - దానే్న అర్వణము అంటారు. ఈ అర్వణం చూసే విధానం ‘కాలామృతం’ జ్యోతిర్నిబంధం, వాస్తు ప్రదీపం, జ్యోతిర్విధాభరణం, ముహూర్త రత్నాకరం వంటి గ్రంథాలలో ఒక్కొక్క విధానం చెప్పబడింది. వాటినన్నిటినీ విమర్శించి, విశదీకరించటానికి ఈ వ్యాసం సరిపోదు. ఇందుకు సులభమైన ఒక మార్గాన్ని ఎన్నుకుందాం. నామ నక్షత్ర రాశికి రెండు, ఐదు, తొమ్మిది, పది, పదకొండు రాశులైన గ్రామ నక్షత్ర రాశులు చక్కగా అర్వణవౌతాయి. వాస్తు శాస్తర్రీత్యా అర్వణం చూసేటప్పుడు, జన్మనక్షత్రం కాకుండా నామ నక్షత్రమే చూడాలని శాస్త్రంలో నిర్దేశించారు.
ఉదా: రామారావుగారికి అర్వణం చూడాలి అన్నప్పుడు ‘రా’ తులారాశి క్రిందకు వస్తుంది. తులారాశి తొమ్మిదవ స్థానం మిధునం - హైదరాబాద్’ అన్నప్పుడు ‘హ’ మిధునరాశిలోకి వస్తుంది. అంటే రామారావు పేరు గల వ్యక్తికి హైదరాబాద్ అర్వణమైనదన్నమాట’ - నక్షత్ర రీత్యా కూడా అర్వణమైతే ఇంకా బాగుంటుందని సంసత్, క్షామ, సాధన, మిథ్ర, పరమ మైత్ర తారలయితే ఇంకా బావుంటుందని చెప్పే పండితులూ ఉన్నారు.
ఉదా: రోహిణీ కుమార్ అది ఉందనుకోండి. అప్పుడు రాశి తులారాశి కావటమే కాకుండా, స్వాతీ నక్షత్రంగా హైదరాబాద్ (‘హ’) పునర్వసూ నక్షత్రంగా సంపత్తార అవుతుంది. ‘అధికస్య అధికం ఫలం’ అన్నట్టుగా ఉంటుంది.
ఇంకా అకారాది వర్గ సిద్ధాంతంగా, ధన, రుణ, సంఖ్యలనే సిద్ధాంతంగా కాకిణుల సిద్ధాంతపరంగా ఎనె్నన్నో అర్వణం చూసే విధానాలున్నాయి. పండితులు వారివారి అనుభవాలను బట్టి అనుసరిస్తూ ఉంటారు.
*
వాస్తు విశారద ఉమాపతి శర్మ
ఇం.నెం.16-2-834/బి/1, ఎస్‌బిహెచ్ కాలనీ ఎదురుగా, సైదాబాద్ (శ్రద్ధాబాద్)
హైదరాబాద్ - 500 059.
సందేహాలు - సమాధానాలు
ఎస్.ఉపేందర్‌రెడ్డి (వరంగల్)
ప్రశ్న: నాకు హైదరాబాద్, వరంగల్, హన్మకొండలలో ఆస్తిపాస్తులున్నాయి. వృత్తిరీత్యా నేను అడ్వకేటును. నా ప్రాక్టీసు ఎక్కడ చేయమంటారు?
జ: ముందుగా మూడుచోట్ల స్థిరాస్తులు కలిగి ఉన్నందుకు అభినందనలు. ఉపేందర్‌రెడ్డి పేరున వరంగల్ మీకు బాగా అర్వణమవుతుంది. అంటే అచ్చి వస్తుంది. వరంగల్‌లో ప్రాక్టీస్ చేయండి. శుభం కలుగుతుంది.
కె.లక్ష్మీకాంతరావు (ఖమ్మం)
ప్రశ్న: నేను పల్లెటూళ్లలో పని చేయాలి. ఏ అక్షరం గల ఊరిని ఎన్నుకోమంటారు?
జ: ఎన్నుకోవటమనేది మీ స్వేచ్ఛ ఐనట్టయితే ‘లీ’ కాని ‘లే’ కాని మొదటి అక్షరంగల గ్రామాన్ని ఎన్నుకోండి. ‘వా’ ‘ని’ కూడా బాగానే ఉంటుంది. అసలు విఆర్‌వోలో మొదట ఉండే ‘వి’యే మీకు లాభసాటిగా ఉంది. అంటే ఆ ఉద్యోగంలో మీరు రాణిస్తారన్నమాట.
జె.నీలకంఠేశ్వరరావు (బాన్స్‌వాడ)
ప్రశ్న: సహజంగానైతే మా ఊరు విజయవాడ కాని మా బంధుమిత్రుల ప్రోద్బలంతో బాన్స్‌వాడలో పత్తి, పొగాకు కొనుగోలు వ్యాపారం చేస్తున్నాను. అంత లాభసాటిగా కనిపించటం లేదు. విజయవాడ వెళ్లి పొమ్మంటారా?
జ: బాన్స్‌వాడ, మీకు విజయవాడ కంటే కూడా బాగా ఉండే అవకాశం ఉంది. ఎంత కాలం నుంచీ చెప్పలేదు కాని మున్ముందు బాగానే ఉంటుంది. కొనుగోలుతోపాటు అమ్మకం స్థలం కూడా బాగుండాలి. అప్పుడే లాభసాటిగా ఉంటుంది. నక్షత్ర రీత్యా కూడా అర్వణం కావాలంటే ‘్భ’ అనే అక్షరం చోట అమ్మకాలు సాగించండి.
వి.శారద (గుంతకల్లు)
ప్రశ్న: మూఢమిలో శ్లాబ్ వేసుకోవచ్చా?
జ: పై అంతస్తు శ్లాబ్ మాత్రం పనికిరాదు. కింద అంతస్తుల స్లాబ్‌ల విషయంలో వున్నంతలోనే మంచి రోజు చూసి స్లాబ్ వేసుకోండి. ఒకవేళ అంతస్తుల నిర్మాణం చేయకుండా కేవలం గ్రౌండ్‌ఫ్లోర్ ఒకటే నిర్మాణం చేసేట్లయితే వ్ఢ్యౌం (మూఢమి) వెళ్లాక స్లాబ్ వేసుకోండి.
*