కోచి, ఆగస్టు 12: భారత్ నావికాదళం అమ్ముల పొదిలో మరో భారీ విమానవాహక నౌక చేరింది. కొచ్చి నౌకాశ్రయంలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ‘ఐఎన్‌ఎస్ విక్రాంత్’ విమానవాహక నౌక జల ప్రవేశం చేసింది. కేంద్ర రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ సతీమణి ఎలిజబెత్ స్వీచాన్ చేసిన విక్రాంత్‌ను జలప్రవేశం గావించారు. నాలుగున్నర ఏళ్లు శ్రమించి భారత శాస్తవ్రేత్తలు దీన్ని రూపొందించారు. ఈ తరహా విమానవాహక నౌకలు ఉన్న దేశాల జాబితాలో భారత్‌కు చోటు లభించడం పట్ల రక్షణ రంగ నిపుణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి విక్రాంత్ నిర్మాణంతో యుద్ధనౌకలు తయారు చేసే స్వావలంబన గల ఐదు దేశాల సరసన భారత్ చేరిందని రక్షణ మంత్రి ఆంటోనీ ప్రకటించారు. 37.500 టన్నుల బరువున్న ఈ నౌక 2018 నాటికి పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తుందని ఆయన అన్నారు. విక్రాంత్ తరహా విమానవాహక నౌకలు ప్రస్తుతం అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్ దేశాల్లో మాత్రమే రూపుదిద్దుకుంటున్నాయి. కొచ్చిన్ షిప్‌యార్డ్స్ లిమిటెడ్ (సిఎస్‌ఎల్)లోని ప్రతి ఒక్కరి సమష్టి కృషి ఫలితమే విక్రాంత్ అని ఆంటోనీ స్పష్టం చేశారు. అనుకున్న సమయానికే దీన్ని తీసుకురాగలిగినట్టు ఆయన చెప్పారు. కాగా చైనా నావికాపాటానికి విక్రాంత్ సరైన సమాధానం చెబుతుందని రక్షణశాఖ శాస్తవ్రేత్తలు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం భారత్ వద్ద ఐఎన్‌ఎస్ విరాట్ విమానవాహక నౌక ఒక్కటే ఉంది. కాగా రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య త్వరలోనే భారత్ నావికాదళంలో చేరుతుంది. విక్రాంత్ పొడవు 260 మీటర్లు, వెడల్పు 60 మీటర్లు. 2018 నాటికి ఇది పూర్తిగా అందుబాటులోకి వస్తుందని మంత్రి వెల్లడించారు.
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను సోమవారం జలప్రవేశం చేయంచిన సందర్భంగా రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ