ముంబయి, ఆగస్టు 13: ప్రభుత్వం రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు, కరెంటు ఖాతా లోటు పెరగకుండా తీసుకున్న చర్యలు మదుపరుల్లో విశ్వాసాన్ని నింపడంతో పాటు మార్కెట్‌కు మద్దతు ఇచ్చినట్లయింది. దాంతో ముంబయి స్టాక్ మార్కెట్ ఇండెక్స్ సెన్సెక్స్ మంగళవారం 282.86 పాయింట్లు లాభపడి 19,229.84 వద్ద ముగిసింది. ప్రభుత్వ చర్యలతో రియల్టీ, బ్యాంకింగ్, ఆటో, ఐటి రంగం కంపెనీల షేర్లకు కొనుగోలు మద్దతు లభించింది. గత రెండు రోజుల్లో 282 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ మూడవరోజైన మంగళవారం ఒక్కరోజే 282 పాయింట్లు వృద్ధి చెందింది. ఈ నెలలో ఒక్కరోజులో ఇంత భారీగా లాభపడడం ఇది తొలిసారి. మరో వైపు బలహీనపడిన రూపాయి ఐటి సంస్థలకు లాభాలను ఆర్జించి పెడతాయన్న ఉద్దేశ్యంతో ఆ రంగం స్టాక్స్ పెరగ్గా ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ దాదాపు రెండేళ్ల గరిష్ఠ స్థాయిలో పెరిగింది. కాగా రూపాయి డాలర్‌తో పోలిస్తే 61 స్థాయిలో ట్రేడయింది. బిఎస్‌ఇ సెన్సెక్స్‌లోని 30 స్టాక్స్‌లో 25 స్టాక్స్ లాభపడగా 5 నష్టాలతో ముగిసాయి. సెక్టార్ పరంగా రియల్టీ ఇండెక్స్ 4.46 శాతం, బ్యాంకింగ్ 2.92 శాతం వృద్ధి చెందాయి. దీనికి తోడు హిందాల్కో, ఎం అండ్ ఎం,డిఎల్‌ఎఫ్ కంపెనీ మంచి ఫలితాలను సాధించడంతోమార్కెట్ సెంటిమెంట్ మరింత బలపడిందని బ్రోకర్లు వెల్లడించారు. బిఎస్‌ఇలో 1,444 స్టాక్స్ లాభపడడంతో 77వేల కోట్ల మదుపరుల సంపద 62.40 లక్షల కోట్లకు పెరిగింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి ఇండెక్స్ నిఫ్టీ 86.90 పాయింట్లు వృద్ధి చెంది 1.55 శాతం పెరిగి 5,699.30 వద్ద ముగిసింది. ఇక ఆసియన్,ఐరోపా మార్కెట్లు అనుకూల ధోరణులతో సాగుతుండడం దేశీయ మార్కెట్ సెంటిమెంట్ బలాన్ని పెంచింది. దేశీయంగా ఇన్ఫోసిస్ 2.65 శాతం పెరిగి 3,084.90కి షేర్ ధర చేరింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.83 శాతం లాభపడింది.
* మార్కెట్‌కు మద్దతిచ్చిన రూపాయి కట్టడి చర్యలు * సెన్సెక్స్ 283 పాయింట్లు వృద్ధి
english title:
ప్రభుత్వం రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు, కరెంటు ఖాతా లోటు పెరగకుండా
Date:
Wednesday, August 14, 2013