Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

సెమీస్‌కు బొపన్న-వాసెలిన్

$
0
0

సిన్సినాటీ (ఓహియో), ఆగస్టు 17: సిన్సినాటీ మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో భారత్‌కు చెందిన రోహన్ బొపన్న, అతని భాగస్వామి ఎడ్వర్డో రోజెర్ వాసెలిన్ (ఫ్రాన్స్) సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లారు. ఈ టోర్నమెంట్‌లో ఎనిమిదో సీడ్ జోడీగా బరిలోకి దిగిన వీరు శుక్రవారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత స్టార్ ఆటగాడు లియాండర్ పేస్-రాడెక్ స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్) జోడీకి చెక్ పెట్టారు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో 6-3 తేడాతో తొలి సెట్‌ను సునాయాసంగా గెలుచుకున్న బొపన్న-వాసెలిన్‌కు ఆ తర్వాత నాలుగో సీడ్ లియాండర్-స్టెపానెక్ జోడీ నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఫలితంగా బొపన్న-వాసెలిన్ జోడీ 6-7 తేడాతో ఆ సెట్‌ను చేజార్చుకోవడంతో నిర్ణాయక మూడో సెట్ మరింత ఆసక్తికరంగా సాగింది. అయితే 10-8 తేడాతో ఈ సెట్‌ను బొపన్న-వాసెలిన్ కైవసం చేసుకోవడంతో లియాండర్-స్టెపానెక్ జోడీకి ఓటమి తప్పలేదు. బొపన్న-వాసెలిన్ సెమీస్‌లో స్పెయిన్‌కు చెందిన మార్సెల్ గ్రానోలర్స్, మార్క్ లోపెజ్ జోడీతో తలపడనున్నారు. ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న గ్రానోలర్స్-లోపెజ్ క్వార్టర్ ఫైనల్ పోరులో పోలెండ్‌కు చెందిన మారిస్ ఫ్రిస్టెన్‌బెర్గ్, మార్సిన్ మట్కోవ్‌స్కీ జోడీని 6-4, 6-2 వరుస సెట్ల తేడాతో ఓడించి సెమీస్‌కు చేరుకున్నారు.

క్వార్టర్స్‌లో లియాండర్ జోడీకి చెక్
english title: 
bopanna

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>