Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఢిల్లీ స్మాషర్స్ చేతిలో హాట్‌షాట్స్ చిత్తు

$
0
0

లక్నో, ఆగస్టు 17: ఇండియన్ బాడ్మింటన్ లీగ్ (ఐబిఎల్) టోర్నమెంట్‌లో భాగంగా లక్నోలోని బాబూ బనారసీ దాస్ అకాడమీలో శనివారం జరిగిన తొలి పోరులో ఢిల్లీ స్మాషర్స్ జట్టు 3-2 తేడాతో హైదరాబాద్ హాట్‌షాట్స్‌పై అనూహ్య రీతిలో విజయం సాధించింది. ఢిల్లీ స్మాషర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న హైదరాబాద్ బ్యూటీ జ్వాలా గుత్త భుజం నొప్పి కారణంగా శనివారం బరిలోకి దిగలేదు. దీంతో ఒకానొక దశలో 0-2 తేడాతో వెనుకబడిన ఢిల్లీ స్మాషర్స్ ఆటగాళ్లు వరుసగా మూడు మ్యాచ్‌లలో విజయాలు సాధించి తమ జట్టుకు తొలి విజయాన్ని అందించడం విశేషం. పురుషుల సింగిల్స్ విభాగంలో జరిగిన తొలి మ్యాచ్‌లో తనోంగ్సక్ 19-21, 21-19, 11-7 గేముల తేడాతో బి.సాయిప్రణీత్‌ను ఓడించి హైదరాబాద్ హాట్‌షాట్స్‌కు తొలి విజయాన్ని అందించాడు. ఆ తర్వాత మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ 21-8, 21-6 వరుస గేముల తేడాతో అరుంథతి పంట్వానే (్ఢల్లీ స్మాషర్స్)ను మట్టికరిపించడంతో హైదరాబాద్ హాట్‌షాట్స్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే పురుషుల డబుల్స్ విభాగంలో తన్ బూన్ హెయోంగ్-కూ కియెన్ కియాత్ 21-14, 21-20 గేముల తేడాతో షెమ్ ఘోష్-తరుణ్ కోన (హైదరాబాద్ హాట్‌షాట్స్) జోడీని చిత్తుచేసి ఢిల్లీ స్మాషర్స్‌కు తొలి విజయాన్ని అందించగా, పురుషుల సింగిల్స్ విభాగంలో జరిగిన రెండో పోరులో డారెన్ ల్యూ 21-10, 21-7 వరుస గేముల తేడాతో ఇండోనేషియాకు చెందిన ప్రపంచ, ఒలింపిక్ మాజీ చాంపియన్ తౌఫిక్ హిదాయత్‌పై సంచలన విజయం సాధించి ఢిల్లీ స్మాషర్స్ ఖాతాలో రెండో విజయాన్ని నమోదు చేశాడు. ఆ తర్వాత జరిగిన నిర్ణాయక మిక్స్‌డ్ డబుల్స్ పోరులో కూడా వి.దిజు, ప్రజక్తా సావంత్ 21-20, 21-15 వరుస గేముల తేడాతో హైదరాబాద్ హాట్‌షాట్స్‌కు చెందిన షెమ్ ఘోష్, ప్రద్న్యా గార్డే జోడీని మట్టికరిపించడంతో ఢిల్లీ స్మాషర్స్ జట్టు 3-2 తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీలో ఢిల్లీ స్మాషర్స్‌కు ఇదే తొలి విజయం. (చిత్రం) ఢిల్లీకి తొలి విజయాన్ని అందించిన సాయిప్రణీత్

ఇండియన్ బాడ్మింటన్ లీగ్..
english title: 
delhi

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>