రస్టెన్‌బర్గ్ (దక్షిణాఫ్రికా), ఆగస్టు 17: దక్షిణాఫ్రికా-ఎ జట్టుతో రెండు టెస్టుల అనధికార క్రికెట్ సిరీస్‌లో భాగంగా రస్టెన్‌బర్గ్‌లోని ఒలింపియా పార్కులో శనివారం ప్రారంభమైన తొలి టెస్టు (నాలుగు రోజుల మ్యాచ్)లో సౌరాష్ట్ర యువ బ్యాట్స్‌మన్ ఛటేశ్వర్ పుజార అద్భుత సెంచరీతో కదం తొక్కాడు. పుజారాకు తోడు మురళీ విజయ్ (44), రోహిత్ శర్మ (70-నాటౌట్) తమవంతు రాణించడంతో భారత-ఎ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 281 పరుగలు సాధించి భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. టాస్ గెలిచిన భారత-ఎ జట్టు బ్యాటింగ్‌ను ఎంచుకుంది. దీంతో మురళీ విజయ్‌తో కలసి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఓపెనర్ శిఖర్ ధావన్ (11) హర్మర్ బౌలింగ్‌లో హెన్డ్రిక్స్‌కు క్యాచ్ ఇవ్వడంతో భారత జట్టు 28 పరుగులకే మొదటి వికెట్‌ను చేజార్చుకుంది. ఈ తరుణంలో భారత జట్టు కెప్టెన్ పుజారా క్రీజ్‌లో నిలదొక్కుకుని దక్షిణాఫ్రికా బౌలర్లను సమర్థవంతంగా ప్రతిఘటించాడు. మురళీ విజయ్ నుంచి లభించిన సహకారాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని రెండో వికెట్‌కు 66 పరుగులు జోడించాడు. అనంతరం బ్రిచ్ బౌలింగ్‌లో విజయ్ (44) హెర్మర్ చేతికి చిక్కడంతో వీరి భాగస్వామ్యం ముగిసింది. విజయ్ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ శర్మ కూడా క్రీజ్‌లో నిలదొక్కుకుని పుజారాకు చక్కటి సహకారానిన అందించాడు. దీంతో 170 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న పుజారా ఆ తర్వాత దూకుడును మరింత పెంచి మూడో వికెట్‌కు 176 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించాడు. 205 బంతులను ఎదుర్కొన్న పుజారా 17 ఫోర్ల సహాయంతో 140 పరుగులు సాధించి వేన్ పార్నెల్ బౌలింగ్‌లో వెనుదిరగడంతో 270 పరుగుల స్కోరు వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత రోహిత్ శర్మ (70), అజింక్యా రహానే (11) మరో వికెట్ చేజారకుండా జాగ్రత్తగా ఆడటంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 3 వికెట్లు నష్టపోయి 281 పరుగులు సాధించింది. (చిత్రం) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అలరించిన సౌరాష్ట్ర హీరో ఛటేశ్వర్ పుజారా (140)
* దక్షిణాఫ్రికా-ఎపై భారత్ 281/3
english title:
pujara
Date:
Sunday, August 18, 2013