న్యూఢిల్లీ,ఆగస్టు 20: అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో చేర్చి రాయల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని రాయలసీమ నాయకుడు, మాజీ మంత్రి జె.సి.దివాకర్ రెడ్డి రక్షణ శాఖ మంత్రి ఎకె ఆంటోని నాయకత్వంలోని నలుగురు సభ్యుల కాంగ్రెస్ ఉన్నత స్థాయి కమిటీకి వినతిపత్రం సమర్పించనున్నారు. మంగళవారం తనను కలిసిన విలేఖరులకు ఈ విషయాన్ని తెలిపారు. ఈ జిల్లాలను తెలంగాణలో కలపడం వల్ల రెండు ప్రాంతాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన మెజారిటీ నాయకులు తెలంగాణతో కలవాలని కోరుకుంటున్నారని వివరించారు. కడప, చిత్తూరు జిల్లాల వారు కోస్తాంధ్రతో ఉండాలనుకుంటున్నందున తమ రెండు జిల్లాలను తెలంగాణలో చేర్చాలని ఆయన సూచించినట్లు తెలిసింది. కాంగ్రెస్ ఆధినాయకత్వం కూడా రాయలతెలంగాణ అంశాన్ని పరిశీలిస్తున్న నేపథ్యంలో ఈ డిమాండ్‌కు ప్రాధాన్యత లభించింది. ఇదిలా ఉంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వాదిస్తున్న సీమాంధ్ర నాయకులతో దివాకర్ రెడ్డి మంగళవారం సాయంత్రం ఎపి భవన్‌లో జరిగిన సమావేశంలో వాదనకు దిగినట్లు తెలిసింది. దివాకర్‌రెడ్డి ప్రతిపాదన పట్ల సీమాంధ్ర నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
అనంతపురం, కర్నూలు జిల్లాలను
english title:
k
Date:
Wednesday, August 21, 2013