పాఠశాల విద్యను మెరుగు పరచాలంటే కొన్ని మార్పులు చేర్పులు అవసరం. విద్యార్థుల భవిష్యత్తుకు పాఠశాల విద్యే గొప్ప పునాది. పునాది గట్టిగా లేకపోతే విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుంది. అంతేకాదు విద్యార్థులంతా ఒకే స్థాయలో ఉండరు. వారి వారి స్థయని బట్టి విద్యాబోధన ఉండాలి. అనుభవం ఉన్న రిటైర్డు అయిన ఉపాధ్యాయులను పిలిపించి, మానసిక శాస్తవ్రేత్తలను పిలిపించి ఏ తరగతికి ఎంత సిలబస్ ఉంటే బాగుంటుంది. డల్ స్టూడెంట్స్‌ను, మెరిట్ స్టూడెంట్స్‌ను ప్రక్కనపెట్టాలి. ఆర్డినరీ స్టూడెంట్స్‌ను గుర్తుపెట్టుకుని మేధావుల సలహా ప్రకారం సిలబస్ తయారుచేస్తే బాగుంటుంది.
ప్రతి పాఠశాలలో ప్రాథమిక స్థాయినుంచే డ్రిల్లు టీచరు, డ్రాయింగ్ టీచరు ఖచ్చితంగా ఉండాలి. డ్రిల్లు పీరియడ్, డ్రాయింగ్ పీరియడ్‌లను వేరే సబ్జెక్టు టీచర్లు వాడుకునే అవసరం రాకుండా సిలబస్ తయారుచేయాలి. చదివింది వంటబట్టి భవిష్యత్తు తరగతులకు పునాదిలా ఉండేలా అవగాహనతో నేర్పించాలి. ఎక్కువ పాఠాలు ఊరికే చెప్పాం అనకుండా తక్కువ పాఠాలు అర్థమయ్యేలా చెప్పడం ముఖ్యం. అంతేగాకుండా హోంవర్కును తీసివేయాలి. చూచిరాత పుస్తకాలు, వర్కు బుక్కులు తీసేయాలి. క్లాస్ వర్కు మాత్రం ఉండాలి. ఎలాగూ స్లిప్‌టెస్టులు, యూనిట్ టెస్టులు, క్వార్టర్లీ, హ్యాఫియర్లీ, ఆన్‌వర్లీ ఉంటాయి కదా?! వీటికోసం చదవటమే హోంవర్కు అనే అవగాహన విద్యార్థుల్లో కలిగించాలి.
ఒకసారి హోంవర్కు కరెక్షన్ లేటు అవుతోందన్న ఉద్దేశ్యంతో ఒక ఉపాద్యాయురాలు చకచకా అన్నీ టిక్ వేసింది. దురదృష్టవశాత్తు ఆ తరగతి విద్యార్థి తండ్రి ప్రభుత్వ పాఠశాల టీచర్ కావడంతో కరెక్టు వేసిన ప్రాబ్లమ్ తప్పయ్యిందని మేనేజ్‌మెంటుకు రిపోర్టు చేయడంతో చీవాట్లు తినాల్సి వచ్చింది. దాంతో హోంవర్కు ఇవ్వడం బాగా తగ్గించింది మేనేజ్‌మెంటు. ఆ టైం క్లాస్‌లోనే చేయించడం, పర్యవేక్షించడం, అర్ధంగాకపోతే మళ్ళీ చెప్పే అవకాశం ఉంటుంది. ఇంటి దగ్గర పిల్లలు కాసేపు చదువుకుని కాసేపు ఆడుకుంటే హాయిగా ఆరోగ్యంగా ఉంటారు.
ఇంక డ్రిల్లు టీచర్లు లేని స్కూళ్ళలో పిల్లలు అర కిలోమీటరు కూడా నడవలేని స్థితిలో ఉన్నారని పరిశోధకులు అంటున్నారు. ఇది శారీరక ఆరోగ్యానికి మంచిదికాదు. డ్రాయింగ్‌వల్ల మైండ్ డైవర్షన్ కావడమే కాకుండా సైన్సు, డ్రాయంగ్‌కు బాగా పనికివస్తుంది. భవిష్యత్తులో ఇంజనీరింగ్, మెడిషన్‌కు ఈ డ్రాయింగ్ బాగా ఉపకరిస్తుంది.
ముఖ్యంగా ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు ఎంట్రెన్సులు, అర్హత పరీక్షలు పెట్టడంవల్ల విద్యార్థులకు ఇచ్చే సెలవులు అన్నీ వాటికోసం ప్రిపేర్ కావటానికే సరిపోతున్నాయి. ఇదివరకు ‘బి.ఏ’, బియస్సీలో వచ్చిన మార్కులను బట్టి బిఇడికి అనుమతించేవారు. పాసయితే టీచర్‌గా ఉద్యోగం ఇచ్చేవారు. ఇప్పుడు ట్రైనింగ్‌లో చేరడానికి ఎడ్‌సెట్, మధ్యలో ఈమధ్య వచ్చిన టెట్ తర్వాత డియస్సీలో వ్రాతపరీక్ష ఈ మూడు అదనమే. ఇవన్నీ మానసికంగా కుంగదీస్తున్నాయి. తర్వాత కామర్సు వాళ్ళకి బ్యాంకుల్లో ఉద్యోగాలు ఇచ్చేవారు. ఆర్థిక కార్యకలాపాల ఉద్యోగాలు ఇచ్చేవారు. ఇప్పుడు బ్యాంకు ఉద్యోగాలకు అర్హత పరీక్ష అని ‘బి.ఏ’ బియస్సీ వారికి కూడా అవకాశం కల్పించారు. విచిత్రంగా ఇంటర్‌లో కామర్సు, డిగ్రీలో కామర్సు చదివినవారికంటే మిగతా వారకే ఎక్కువ ఉద్యోగాలొస్తున్నాయి. కోచింగ్‌కు వేలకు వేలు ఖర్చు అవుతోంది. బికామ్ వారికి ఏ సబ్జెక్టు లేదని బిఇడికి పనికిరారని చెప్పినప్పుడు, ఆ సబ్జెక్టే చదవని ‘బి.ఏ’- బియస్సీ వారికి బ్యాంకు ఉద్యోగం ఎలా ఇస్తున్నారో అర్ధంకాదు. ఇంజనీరింగ్‌కు గణితం, మెడిసిన్‌కు సైన్సు మెరిట్ ప్రకారం తీసుకోవచ్చు కదా?! దానికి పరీక్షలే. ఇవన్నీ తొలగించి చదువుకోడానికి కానీ.. ఉద్యోగానికి కానీ.. ఫౌండేషన్ కోర్సు పెట్టాలి. వాటికి ద్వారానే ఇవ్వాలి. లేకపోతే భవిష్యత్తులో వత్తిడికి విద్యార్థులు ఆహుతే!!
పాఠశాల విద్యను మెరుగు పరచాలంటే కొన్ని మార్పులు చేర్పులు అవసరం
english title:
p
Date:
Wednesday, August 28, 2013