ముంబయి, ఆగస్టు 28: అమాయక మదుపర్లను ఆర్థిక మోసాల నుంచి కాపాడే బాధ్యత అటు ప్రభుత్వంపై ఇటు రిజర్వ్ బ్యాంకుపై ఉందని ఆర్‌బిఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. శారదా చిట్‌ఫండ్ కుంభకోణంతోపాటు మరికొన్ని చిట్‌ఫండ్ మోసాలు మదుపర్లను నిండా ముంచుతున్న నేపథ్యంలో బుధవారం దువ్వూరి మాట్లాడుతూ ఆకర్షణీయ ప్రకటనలతో మదుపర్ల సొమ్మును సేకరించి ఆపై బోర్డు తిప్పేసే సంస్థలు, మోసపూరిత పథకాల నుంచి ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంతోపాటు ఇతర రెగ్యులేటర్లపై ఉందని అన్నారు. రిజర్వ్ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
విదేశీ మారకం కొనుగోళ్లకు స్పెషల్ విండో
రూపాయి విలువ నానాటికీ భారీగా పతనమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలకున్న డాలర్ల అవసరాల కోసం రిజర్వ్ బ్యాంకు బుధవారం ఓ స్పెషల్ విండోను ఏర్పాటు చేసింది. ఐఒసి, హెచ్‌పిసిఎల్, బిపిసిఎల్ సంస్థలకు నెలనెల 8.5 బిలియన్ డాలర్లు అవసరం. దీంతో ఆర్‌బిఐ విదేశీ మారకం మార్పిడి క్రయవిక్రయ కేంద్రంను తెరిచింది.
దువ్వూరి సుబ్బారావు
english title:
p
Date:
Thursday, August 29, 2013