నెల్లూరు, సెప్టెంబర్ 8: మానవ అభివృద్ధికి అక్షరాస్యతే కీలకమని జాయింట్ కలెక్టర్ బి లక్ష్మీకాంతం తెలిపారు. ఆదివారం 47వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా కస్తూర్భా కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 8 సహస్రాబ్ది లక్ష్యాలలో అక్షర్యాసత ప్రధానమై అంశమని, అక్షరాస్యత సాధించడం ద్వారానే మానవ అభివృద్ధి సాధ్యమని తెలిపారు. అధిక జనాభా కలిగిన చైనా ప్రగతి పథంలో ముందుకు దూసుకుని పోవడానికి అక్షరాస్యతలో వారు సాధించిన అభివృద్దే కీలకమని తెలిపారు. అక్షరాస్యత ద్వారా ప్రజలలో ప్రశ్నించే తత్వం, ఆరోగ్య విషయాలపై శ్రద్ధ, సామాజిక అంశాలపై సరైన అవగాహన పెంపొందుతాయని తెలిపారు. జిల్లాలోని సాక్షరభారత్ సమన్వయకర్తలు, వాలంటీర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, స్వచ్చంద సేవా సంస్థల సహకారంతో జిల్లాలో సంపూర్ణ అక్షరాస్యత సాధించేంత వరకు కృషి చేయాలన్నారు. అనంతరం ఆదర్శవంతంగా నిర్వహిస్తున్న కోవూరు సాక్షరభారత్ గ్రామపంచాయతీ సమన్వయకర్త ఎం సంపత్‌కమార్‌కు అభినందన జ్ఞాపికను అందచేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్చంద సేవాసంస్థల అధ్యక్షుడు వివిఎస్ నాయుడు,బాల భవన్ డైరెక్టర్ సుభద్రదేవి, ఎన్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
మానవ అభివృద్ధికి అక్షరాస్యతే కీలకమని జాయింట్ కలెక్టర్ బి
english title:
literacy
Date:
Monday, September 9, 2013