నెల్లూరు, సెప్టెంబర్ 8: పార్టీలు తమ జెండాలను పక్కన పెట్టిన సమైక్యమే లక్ష్యంగా ముందుకు సాగే వారంతా కలిసి కట్టుగా రావాలని నెల్లూరుసిటీ,రూరల్ ఎమ్మెల్యేలు ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి, ఆనం వివేకానందరెడ్డి పిలుపు నిచ్చారు. ఆదివారం విఆర్సీలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్లేందుకు ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశానికి వివిధ సంఘాలకు చెందిన ప్రతినిధులు, వ్యాపార వర్తకులు, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్, ఉపాధ్యాయ, ఉద్యోగ, విద్యార్థి, జర్నలిస్టు సంఘాలు హాజరైయ్యారు. ముందుగా నెల్లూరురూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మాట్లాడుతూ సమైక్యాంధ్రకు మద్దతుగా నిలిచే ప్రతి పార్టీ జెఎసిలో పాల్గొనవచ్చున్నారు. తెలంగాణ విభజనపై ప్రజారెఫరెండమ్ పెడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని విడగొట్టడం అంత తెలికగా లేదన్నారు. వినాయచవితి సందర్భంగా 5రోజుల పాటు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నిలుపుదల చేసి 17వ తేదీ నుంచి సమైక్యాంధ్రకు మద్దతుగా విష్ణుదేవాలయాల్లో యాగాలు, శివాలయాల్లో రుద్రభిషేకాలు, అమ్మవారి దేవాయాల్లో చండీహోమలు జరుపుతామన్నారు. సహస్ర రథయాత్ర పేరుతో 1000 వాహనాలతో భారీ ఎత్తున ర్యాలీని నిర్వహిస్తామని చెప్పారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును పెట్టినప్పుడు సకలం బంద్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు రైల్‌రోకో కార్యక్రమాలను కూడా నిర్వహిస్తామని చెప్పారు. నెల్లూరుసిటీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం అన్ని పార్టీలు తమ జెండాలను పక్కన పెట్టిన ఒక కమిటీగా ఏర్పడి పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమైక్యవాదులంతా ఒక వేదిక మీదకు వచ్చినప్పుడే ఉద్యమం సఫలీకృతం అవుతుందన్నారు. ఈ సమావేశంలో డిసిసి ఇన్‌చార్జ్ చాట్ల నరసింహారావు, జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యలమూరి రంగయ్యనాయుడు, మాజీ మేయర్ భానుశ్రీ, సన్నపురెడ్డి పెంచలరెడ్డి, వెంకటజ్యోతి, మునిసిపల్ ఎంప్లాయిస్ అధ్యక్షుడు చక్రపాణి, శివనాగేశ్వరరావు, విద్యుత్ ఉద్యోగ సంఘం నాయకులు సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
పార్టీలు తమ జెండాలను పక్కన పెట్టిన సమైక్యమే లక్ష్యంగా
english title:
s
Date:
Monday, September 9, 2013