Quantcast
Viewing all articles
Browse latest Browse all 69482

జొకొవిచ్ Vs నాదల్

Image may be NSFW.
Clik here to view.

న్యూయార్క్, సెప్టెంబర్ 8: యుఎస్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్ కోసం ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకొవిచ్, రెండో స్థానంలో ఉన్న రాఫెల్ నాదల్ అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. కెరీర్‌లో ఆరు మేజర్ టైటిళ్లను కైవసం చేసుకున్న జొకొవిచ్ హోరాహోరీగా సాగిన సెమీ ఫైనల్స్‌లో స్విట్జర్లాండ్ ఆటగాడు స్టానిస్లాస్ వావ్రిన్కాను 2-6, 7-6, 3-6, 6-3, 6-4 తేడాతో ఓడించి ఫైనల్ చేరాడు. అతను యుఎస్ ఓపెన్‌లో మొత్తం మీద ఐదోసారి, వరుసగా నాలుగోసారి సెమీస్‌లోకి అడుగుపెట్టాడు. గ్రాండ్‌శ్లామ్ టోర్నీల్లో అతనికిది 12వ ఫైనల్. కాగా, 2010లో యుఎస్ ఓపెన్ సహా మొత్తం 12 గ్రాండ్‌శ్లామ్ టైటిళ్లను సాధించిన ‘స్పెయిన్ బుల్’ నాదల్ 6-4, 7-6, 6-2 ఆధిక్యంతో ఫ్రాన్స్‌కు చెందిన ఎనిమిదో సీడ్ రిచర్డ్ గాస్క్వెట్‌పై గెలుపొంది, నాలుగేళ్లలో మూడోసారి ఫైనల్‌లో అడుగుపెట్టాడు. మోకాలి గాయం కారణంగా గత యుఎస్ ఓపెన్‌లో నాదల్ ఆడలేదు. కాగా, జొకొవిచ్, నాదల్ ఇప్పటి వరకూ 37 మ్యాచ్‌ల్లో పరస్పరం తలపడ్డారు. నాదల్ 21 విజయాలు సాధిస్తే, జొకొవిచ్ 15 పర్యాయాలు గెలిచాడు.
టైటిల్ వేటలో ఉన్న జొకొవిచ్, నాదల్ ఒకటిరెండు రౌండ్లను మినహాయిస్తే, ఈ టోర్నీలో ఫైనల్ చేరేందుకు విశేషంగా శ్రమించాల్సి వచ్చింది. జొకొవిచ్ తొలి రౌండ్‌లో రిచర్డ్ బెరాన్కిస్‌ను 6-1, 6-2, 6-2, రెండో రౌండ్‌లో బెంజమిన్ బెకర్‌ను 7-6, 6-2, 6-2, మూడో రౌండ్‌లో జొయవో సౌసాను 6-0, 6-2, 6-2, నాలుగో రౌండ్‌లో మార్సెల్ గ్రానోలెర్స్‌ను 6-3, 6-0, 6-0 తేడాతో ఓడించాడు. క్వార్టర్ పైనల్స్‌లో మిఖయిల్ యూజ్నీపై 6-3, 6-2, 3-6, 6-0 ఆధిక్యంతో గెలుపొందాడు. సెమీస్‌లో వావ్రిన్కాపై విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. మరోవైపు నాదల్ తొలి రౌండ్‌లో ర్యాన్ హారిస్‌ను 6-4, 6-2, 6-2, రొగిరియో దత్ర డ సిల్వను 6-2, 6-1, 6-0, మూడో రౌండ్‌లో ఇవాన్ డొడిగ్‌ను 6-4, 6-3, 6-3, నాలుగో రౌండ్‌లో ఫిలిప్ కొల్చెర్బర్‌ను 6-7, 6-4, 6-3, 6-1 తేడాతో ఓడించాడు. క్వార్టర్ ఫైనల్‌లో టామీ రొబ్రెడోపై 6-0, 6-2, 6-2 స్కోరుతో విజయాన్ని నమోదు చేశాడు. సెమీస్‌లో గాస్క్వెట్‌ను ఇంటిదారి పట్టించాడు. 1993 తర్వాత యుఎస్ ఓపెన్ ఫైనల్ చేరుకున్న తొలి ఫ్రెంచ్ క్రీడాకారుడిగా రికార్డు సృష్టించాలన్న గాస్క్వెట్ ఆశలకు నాదల్ గండికొట్టాడు. జొకొవిచ్, నాదల్ సమర్థులైన ఆటగాళ్లు కావడంతో, ఫైనల్‌లో విజ యం ఎవరిని వరిస్తుందో తెలియని పరిస్థితి. అయతే, పో రు ఉత్కంఠ భరితంగా సాగడం ఖాయం.
హ్రాడెకా, హ్లావకొవా జోడీకి డబుల్స్ టైటిల్
మహిళల డబుల్స్ విభాగంలో లూసీ హ్రాడెకా, ఆండ్రియా హ్లావకొవా జోడీ టైటిల్ సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో ఆష్లే బార్టీ, కాసీ డెలాక్వా జోడీతో జరిగిన ఫైనల్‌లో హ్రాడెకా, హ్లావకొవా 6-7, 6-1, 6-4 ఆధిక్యంతో గెలుపొందింది. తొమి సెట్‌ను కోల్పోయనప్పటికీ ఆతర్వాత హ్రాడెకా, హ్లావకొవా సత్తా చాటారు.

యుఎస్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ ఫైనల్‌లో
english title: 
j

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>