పరిగి, సెప్టెంబర్ 15: నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో జరిగిన అభివృద్ధి పనులే ఉన్నాయని, 30 సంవత్సరాలుగా పరిగిలో ఎమ్మెల్యేగా ఉండి హరీశ్వర్‌రెడ్డి ఏమి అభివృద్ధి పనులు చేశారో చెప్పాలని చర్చకు ముందుకు రావాలని పిసిసి కార్యదర్శి టి. రాంమోహన్‌రెడ్డి సవాల్ చేశారు. ఆదివారం పరిగిలోని ఆయన నివాసంలో విలేఖరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో మైనారిటిలో 4 శాతం రిజర్వేషన్‌లు అమలు జరిగాయి, మైనారిటి కార్పొరేషన్ ద్వారా మైనారిటీలకు లోన్‌లు ఇవ్వడం జరిగింది. పరిగి నియోజకవర్గం అభివృద్ధికిగాను రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన హమీలు నెరవేరుతాయని అంచలవారిగా నిధులు తీసుకురావడం ఆ పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. పరిగి అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఇచ్చిన హమీల మేరకు ఇప్పటి వరకు ఎన్నికోట్లు నిధులు మంజూరి చేసిన విషయం ఎమ్మెల్యేకి తెలియదా? ఆ డబ్బులతో పరిగిలో పనులు జరుగుతున్న విషయం తెలిసి ఈ విధంగా మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని అన్నారు. చేవెళ్ళ ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయహోదా కలుగుతుందని శంకర్‌పల్లి మండలం చందిప్ప దగ్గర పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యేగారికి తెలియదా?
కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి మునియప్ప పరిగి కేంద్రానికి వచ్చి పార్టీ కార్యకర్తల సమావేశంలో వికారాబాద్ నుంచి నస్కల్, పరిగి మీదుగా మక్తల్ వరకు రైల్వేలైన్ వేయడం జరుగుతుందని హమీ ఇచ్చారు. అందుకు సంబంధించి సర్వేలు చేసి రాళ్ళు పాతడం జరిగిందని గుర్తుచేశారు. ఎమ్మెల్యే స్థానాన్ని కాపాడుకోవడానికి పూటకు ఓ పార్టీ మారుతున్న ఎమ్మెల్యే తెలంగాణవాది అయితే స్పీకర్ ముందర తెలుగుదేశం పార్టీ అని పరిగికి వచ్చి టిఆర్‌ఎస్ పార్టీ అని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం అన్నారు. దొడ్డి దారిలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నం చేస్తున్న ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డిది ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి కాదని అన్నారు.
మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీలో మేలు జరిగిందని మైనార్టీలే చెపుతారని దాని గురించి మనం మాట్లాడటం సరైనది కాదని అన్నారు. సీనీయర్ నాయకులు అయిఉండి ఈ విధంగా మాట్లాడటం మంచిది కాదని అన్నారు. సమావేశంలో మైనార్టీ నాయకులు నసరిల్లాఉస్సేన్, ఖాజ, జమీల్, సత్తార్ తదితర నాయకులు పాల్గొన్నారు.
నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో జరిగిన అభివృద్ధి పనులే
english title:
parigi
Date:
Monday, September 16, 2013