Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

దైవభక్తి అలవర్చుకోవాలి

$
0
0

కర్నూలు ఓల్డ్‌సిటీ, సెప్టెంబర్ 17 : దేశభక్తి తొణికిసలాడాలంటే.. ప్రతి ఒక్కరూ దైవభక్తిని అలవర్చుకోవాలని శ్రీ కమలానంద భారతీ స్వామీజీ అన్నారు. మంగళవారం నగరంలోని వినాయక ఘాట్ వద్ద జరిగిన నిమజ్జనోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ కమలానంద భారతీ స్వామిజీ మాట్లాడుతూ నగరంలో గణేష్ నవరాత్రులు పురస్కరించుకుని నిమజ్జన వేడుకలు గొప్పగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా రాంబొట్ల దేవాలయం వద్ద గణేష్ వేడుకల్లో ముస్లింలు పాల్గొనడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇలాంటి ఉత్సవాలు యుగయుగాల నుండి మన దేశంలో జరుపుకోవడం జరుతోందన్నారు. గణపతి ఆరాధన మొదట వినాయకుడి ప్రతిమకు పూజ చేయడం జరుగడం ఎంతో విశేషమని తెలిపారు. ఆమెరికా, రష్యా వంటి దేశాల్లో కూడా గణపతి విగ్రహాలు బయల్పడిన సంఘటనలు మనం చూస్తున్నామన్నారు. గణనాథుడు అంటే గ్రామం అని అర్థం అన్నారు. 5వేల సంవత్సరాల క్రితం శ్రీ కృష్ణదేవరాయ పరిపాలనలో ఎక్కడ 12 కుటుంబాలు నివాసం ఉంటాయో అది గ్రామమని, 10 కుటుంబాలు ఉంటే పల్లె అని తెలిపారు. గ్రామం అనేది గణపతి అనే పదం నుండి వచ్చిందన్నారు. గ్రామంలో ఉత్సవాలను అన్ని వర్గాల ప్రజలు కలిసి జరుపుకున్నపుడే సంతోషంగా ఉంటారన్నారు. అయితే గణపతి అంటే సమాజంను పరిపాలించే వాడని అర్థమని అన్నారు. పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవని, కానీ కలియుగంలో కలిపురుషుడు వల్ల ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం అవుతూ సమాజం ధ్వంసం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశాన్ని 2003 సంవత్సరాలు అలెగ్జాండర్ దండయాత్ర చేశారని, అలాగే తెల్లవారి బానిస నుండి విముక్తి కోసం పోరాటం చేసి మన సంస్కృతిని, సంప్రదాయలను సాధించుకుంటామని స్వామి వివేకానందుడు అన్న మాటలు మనమందరం ఒకసారి మననం చేసుకోవాలన్నారు. యావత్తు భారతదేశం ఒక పవిత్రమైన దేవాలయమని స్వామి వివేకానందుడు అన్నారన్నారు. గణేష్ నవరాత్రులల్లో గణనాథుడిని 21 పత్రాలతో భక్తులు పూజలు చేస్తున్నారని తెలిపారు. కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు దేశంలోని ప్రాజెక్టులు, నదులు, కాలువలు నీటితో కళకలాడుతు పంటలు సస్యశ్యామలంగా పండుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ గణేశ మహోత్సవ కేంద్ర సమితి నిర్వాహకులు కపిలేశ్వరయ్య, కాళింగ నరసింహవర్మ, కిష్టన్న, కార్యకర్తలు పాల్గొన్నారు.
కొనసాగిన సమైక్య పోరు
కర్నూలు, సెప్టెంబర్ 17: జిల్లా వ్యాప్తంగా సమైక్య ఉద్యమం అలుపెరగని పోరులా కొనసాగుతోంది. రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని కేంద్రం ప్రకటించే వరకూ విశ్రమించేది లేదని సమైక్యవాదులు తెగేసి చెబుతున్నారు. కర్నూలులో మంగళవారం వినాయక నిమజ్జనం ఉన్నప్పటికీ న్యాయవాదులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు ఇతర వర్గాల వారు రిలే దీక్షలు కొనసాగించారు. వినాయకులతో పాటు కేంద్రంలోని కాంగ్రెస్ పెద్దల దిష్టిబొమ్మలను సైతం వినాయక రథాల వెంట తీసుకెళ్లి కేసీ కాలువలో నిమజ్జనం చేశారు. ఆలూరులో విభజనకు పూనుకున్న కేంద్ర నాయకులు, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రుల మాస్క్‌లు ధరించి మంత్రగాళ్ల వేషంలో ఉన్న సమైక్యవాదులు పదవీ దయ్యాన్ని విడిపిస్తామంటూ నిర్వహించిన ఆందోళన అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సమైక్యవాదులు మాట్లాడుతూ మరో నాలుగైదు నెలలు ఉండే పదవిని పట్టుకుని వేలాడుతున్న నాయకులకు భవిష్యత్తులో ఎలాంటి పదవులు లేకుండా చేస్తామని హెచ్చరించారు. అలాగే బేతంచెర్లలో మానవహారం నిర్వహించారు. అవుకులో వికలాంగులు తాము సైతం అంటూ దీక్షలు ప్రారంభించారు. ఇక నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, ఆత్మకూరు, నందికొట్కూరు, డోన్, కోడుమూరు తదితర పట్టణాల్లో ఆందోళనలు కొనసాగాయి. రాష్ట్ర ప్రైవేటు వైద్యశాలల యాజమాన్య సంఘం పిలుపు మేరకు కర్నూలు మినహా జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒకరోజు వైద్య సేవల నిలుపుదల చేశారు. అత్యవసర కేసులు మినహా ఇతర వైద్య సేవలందించకుండా నిరసన తెలిపారు. కర్నూలులో నిమజ్జనోత్సవం కారణంగా ఈ నిరసన కార్యక్రమం 20వ తేదీన నిర్వహిస్తున్నట్లు సంఘం ప్రకటించింది. కాగా ఎపి ఎన్జీవో సంఘం నాయకులు ప్రకటించిన కార్యాచరణ ప్రకారం సమైక్య ఉద్యమం కొనసాగుతుందని సమైక్య ఐకాస ప్రకటించింది.
కేంద్రం దిగివచ్చేంత వరకు ఉద్యమం ఆగదు
కర్నూలు టౌన్, సెప్టెంబర్ 17 : కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి విభజన ప్రకటన ఉపసంహరించుకునేంత వరకు ఉద్యమాలు ఆగవని చెట్ల మాట్లాపురం సర్పంచు వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. కల్లూరు మండల పరిధిలోని చెట్లమాట్లారం గ్రామానికి చెందిన కాంగ్రాస్ నాయకులు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు మంగళవారం కూడా కొనసాగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులందరూ తమ పదవులతో పాటు పార్టీలకు రాజీనామాలు చేసి కేంద్ర ప్రభుత్వం వత్తిడి తీసుకురావాలని, లేనిపక్షంలో ప్రజాప్రతినిథుల ఆస్తులు ముట్టడిస్తామన్నారు. కొంతమంది స్వార్థపరుల స్వలాభం కోసం రాష్ట్రాన్ని విభజించి పాలించాలనుకోవడం దారుణమన్నారు. సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ రాజధానిని తెలంగాణ ప్రజలు వదిలి వెళ్లాలనడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైన కేంద్ర ప్రభుత్వం స్పందించి తెలంగాణను ఉపసంహరించుకుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాలరాజు, సుధాకర్, మధు, వంశీధర్, రాఘవులు, రమేష్, రాజు,తదితరులు పాల్గొన్నారు.
డోన్‌లో...
డోన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా మండలంలో నిరసనలు రోజురోజుకూ మిన్నంటుతున్నాయి. ఉద్యమం ప్రారంభమై 50 రోజులు కావస్తున్నా ప్రజల్లో ఏ మాత్రం వేడి తగ్గలేదు. పట్టణ ప్రాంతాలకే పరిమితం కాక పల్లెల్లో సైతం కొనసాగుతోంది. ఇందులో భాగంగా మంగళవారం ఉద్యోగ, ఉపాద్యాయ, కార్మికులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ పురవీధుల గుండా తిరుగుతూ భిక్షాటన చేశారు. గాంధీ విగ్రహం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ గాంధీ చౌక్, కంబాలపాడు చౌరస్తా నుంచి పాతబస్టాండ్ వరకు సాగింది. జెఎసి సంఘం నాయకులు గిడ్డయ్య, చెన్నయ్య, సుంకన్న, ఆర్టీసీ సంఘం నాయకులు సుదర్శన్, రమణారెడ్డి ఆధ్వర్యంలో భిక్షాటన నిర్వహించారు. కెసిఆర్ డౌన్‌డౌన్, సోనియా డౌన్‌డౌన్, సమైక్యాంధ్ర వర్థిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జెఎసి అధ్యక్షులు పామయ్య మాట్లాడుతూ ఉద్యమాన్ని పల్లెల దాకా తీసుకెళ్లేందుకు ప్రణాళికలను రూపొందించినట్లు తెలిపారు.
కొనసాగుతున్న దీక్షలు
విభజనను వ్యతిరేకిస్తూ తలపెట్టిన రిలే దీక్షలు 49వ రోజుకు చేరుకున్నాయి. మంగళవారం దీక్షల్లో వినియోగదారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు, బిసి సంక్షేమ సంఘం నాయకులు ఎఇ నాగరాజు, సోమన్న గౌడు, కృష్ణమూర్తి గౌడు, శ్రీరాములు గౌడు, రవికుమార్, నారాయణ, గురుస్వామి, వెంకటేశ్వర రెడ్డి, పృద్విరాజ్‌లు కూర్చున్నారు. దీక్షలకు డోన్ తహశీల్దార్ పుల్లయ్య తోపాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘం నాయకులు చెన్నయ్య, గిడ్డయ్య తదితరులు సంఘీభావం తెలిపారు.
బేతంచెర్లలో...
బేతంచెర్ల : సమైక్యాంధ్ర కోరుతూ పట్టణంలోని సంజీవనగర్ కాలనీ ఆదర్శ పాఠశాల విద్యార్థులు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయం ఎదురుగా మానవహారం ఏర్పాటు చేసిన నిరసన తెలిపారు. విభజనో కలిగే కష్ట, నష్టాల గురించి నాటిక రూపంలో ప్రదర్శించారు. అనంతరం రోడ్డుపై ఖోఖో, కబడ్డీ అడి నిరసన తెలిపారు.
కొనసాగుతున్న రిలే దీక్షలు
స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం కూడా కొనసాగాయి. ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకుల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలో విద్యాగణపతి, ప్రశాంత్, నరసింహనాయుడు, రాంమోహన్, జి.వెంకటేశ్, వెంకటేశ్వరగౌడ్‌లు దీక్షలో కుర్చున్నారు. వీరికి పలువురు సంఘీభావం తెలిపారు.
అవుకులో...
అవుకు : అవుకు పట్టణంలో జెఎసి ఆధ్వర్యంలో స్థానిక వికలాంగులు మంగళవారం రిలే దీక్షలు చేపట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రకటన వెలువడే వరకు తాము జెఎసి సూచించిన విధంగా ఉద్యమంలో పాల్గొంటామని వివరించారు.
ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం
నందికొట్కూరు : విభజనకు వ్యతిరేకంగా 49 రోజులుగా వివిధ రూపాల్లో ఉద్యమాలు, ఆందోళనలు చేస్తున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లైనా లేకపోవడం శోచనీయమని జెఎసి చైర్మన్ రాజశేఖరరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక ఎన్‌జిఓ కార్యాలయంలో జెఎసి అధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో రాజశేఖరరెడ్డి, ఎంఇఓ సుబ్బరాయుడు మాట్లాడుతూ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసి కేంద్రం దిగివచ్చే వరకు పోరాటం ఆగదన్నారు. జెఎసి రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు పిలుపుమేరకు నందికొట్కూరు నియోజకవర్గంలో ఈనెల 19, 20, 27, 28 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ బ్యాంకుల బంద్, 24న రహదారుల దిగ్బంధం, బంద్, 25, 26న ప్రైవేట్ ట్రావెల్స్, ఆటోలు బంద్, 29న కర్నూలులో జరిగే భారీ బహిరంగసభకు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జె ఎసి నాయకులు సత్యనారాయణ, రాముడు, అర్‌టిసి జె ఎసి నాయకులు రాబర్ట్, వైడిఅర్.స్వామి, శీలం రవికుమార్, భూపాల్ పాల్గొన్నారు.
కొనసాగిన దీక్షలు
జెఎసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు మంగళవారం కూడా కొనసాగాయి. వీరికి మద్దతుగా ఆర్‌టిసి జెఎసి నాయకులు, వివిధ ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించి దీక్షలకు మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో జెఎసి నాయకులు రవికుమార్, రాజశేఖరరెడ్డి, రాముడు, సత్యనారాయణ, రాబర్ట్, వైడిఅర్ స్వామి, తదితరులు పాల్గొన్నారు. మరోవైపు వైకాపా నియోజకవర్గ ఇన్‌చార్జి శివానందరెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి.

* శ్రీ కమలానంద భారతీ స్వామీజీ
english title: 
d

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>