Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

వర్షాలకు కూలిన మట్టి మిద్దెలు

$
0
0

ఉయ్యాలవాడ, సెప్టెంబర్ 17 : మండలంలోని మాయలూరు, ఉయ్యాలవాడ గ్రామాల్లో రెండు మట్టిమిద్దెలు కూలాయి. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు మాయలూరు గ్రామానికి చెందిన కొర్రపాటి శివారెడ్డి, ఉయ్యాలవాడకు చెందిన ఖాతా లక్ష్మీరెడ్డిల ఇంటి పైకప్పులు కూలిపోయినట్లు బాధితులు తెలిపారు. ఉదయం కుటుంబ సభ్యులు ఇంటిలో నిద్రిస్తుండగా వర్షాలకు మట్టి మిద్దె ఒక పక్కకు కూలింది. దీంతో కుటుంబసభ్యులు ఉన్న ఫళంగా బయటికి పరుగులు తీయడంతో పెద్దప్రమాదం నుండి బయటపడ్డామన్నారు.
కోవెలకుంట్లలో...
కోవెలకుంట్ల : పట్టణంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని మట్టిమిద్దె గోడలు కూలాయి. పట్టణంలోని స్వామినగర్‌కు చెందిన కడియాలగోపాల్‌కు చెందిన మిద్దె వర్షానికి తడిసి అకస్మాత్తుగా కూలింది. దీంతో ఇళ్లు పాక్షికంగా దెబ్బతినింది. అలాగే సంతపేటలోని జెండాచెట్టు సమీపంలోని ఫాతీమాబీకి చెందిన మట్టిమిద్దె సోమవారం కురిసిన భారీ వర్షానికి గోడ కూలిపోవడంతో మిద్దె పాక్షికంగా దెబ్బతింది. పట్టణంలోని లోతట్టు ప్రాంతమైన స్వామినగర్‌లో ఇళ్ళలోకి వరం నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. బాధితులు దెబ్బతిన్న ఇళ్ళకు మరమ్మతులు చేయించుకునుందుకు అర్థికంగా వెనుకబడి ఉన్నామని, ప్రభుత్వం సహాయం అందించాలని కోరుతున్నారు.
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
చాగలమర్రి, సెప్టెంబర్ 17: మండలంలోని ముత్యాలపాడు చెరువుకట్ట వద్ద మంగళవారం తెల్లవారుజామున భారీవర్షం కురుస్తున్నా లెక్కచేయకుం డా అటవీశాఖ అధికారులు దాడులు నిర్వహించి సుమారు రూ. 2 లక్షలు విలువచేసే ఎర్రచందనం దుంగలను, తుఫాన్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని ఓజి తాండ గ్రామం వైపు నుండి తుఫాన్ వాహనంలో అక్రమంగా ఎర్రచందనం తరలిస్తుండగా అందిన సమాచారంతో రుద్రవరం రేంజర్ రాంసింగ్ ఆదేశాల మేర కు దాడిచేశామని అటవీశాఖ అధికారి ముర్తుజావలి వివరించారు. ఈదాడిలో తుఫాన్ వాహనంలో మేలురకమైన 10 ఎర్రచందనం దుంగలతో పాటు మరో 7 ఎగిసజాతి దుంగలను పట్టుకున్నట్లు తెలిపారు. ఈదాడిలో ఎఫ్‌డిఓలు ముక్తార్‌బాషా, వెంకటన్న, ఎబిఓలు పెద్దన్న, బాలరాజు, ప్రొటక్షన్ వాచర్లు సౌరం శ్రీను, వీరయ్య, శీలం హనుమంతు, ఇళ్ళ నరసింహులు, భూపతి శ్రీనులు పాల్గొన్నట్లు తెలిపారు.
విద్యుదాఘాతంతో గుడిసె దగ్ధం
సంజామల, సెప్టెంబర్ 17 : మండల పరిధిలోని కమలపురి గ్రామంలో సోమవారం రాత్రి గ్రామానికి చెందిన చాకలి గన మద్దిలేటి గుడిసె విద్యుత్ షాట్ సర్క్యూట్ వల్ల దగ్ధమైంది. దీంతో గుడిసెలోని పదిమేకలు, ఒక మోటారు సైకిల్, పదిబస్తాల వరి ధాన్యం కాలిపోయినట్లు బాధితుడు తెలిపాడు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని బాధితుడు కోరారు.
పిడుగుపాటుకు 41 గొర్రెలు మృతి
బనగానపల్లె, సెప్టెంబర్ 17 : మండలంలోని నందవరంలో మంగళవారం సాయంకాలం పిడుగుపాటుకు గొల్ల చిన్న గోవిందప్పకు చెందిన 41 గొర్రెలు మృతిచెందాయి. గోవిందప్ప 45 గొర్రెలమందతో గ్రామానికి పడమటి దిక్కున మేపుకునేందుకు వెళ్లాడు. ఆయనతోపాటు నలుగురు వ్యక్తులు తోడుగా ఉన్నారు. కాగా సాయంకాలం సమయంలో గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోని సుద్దబావి సమీపంలో మేపుకుంటుండగా భారీ వర్షం కురవడంతో గొర్రెలకాపరులు, గొర్రెలు చెట్లకిందికి చేరారు. అదే సమయంలో భారీ ఉరుములు రావడంతో పిడుగు పడింది. దీంతో చెట్టుకింద ఉన్న 41 గొర్రెలు మృతిచెందగా మరో నాలుగు గొర్రెలు గాయపడినట్లు గొర్రెలకాపరులు తెలిపారు. కాగా గొర్రెలకాపరులు నలుగురు ఈ సంఘటనలో తృటిలో తప్పించుకున్నారు. ఈ సంఘటనతో గొర్రెల యజమానికి రెండులక్షల రూపాయలకుపైగా నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ఆదుకోవాలని గొర్రెల యజమాని గోవిందప్ప కోరారు.
బనగానపల్లెలో సమైక్య ఉద్యమం
బనగానపల్లె, సెప్టెంబర్ 17 : పట్టణంలో ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికులు, ప్రజలు సమైక్య ఉద్యమంలో పాలుపంచుకున్నారు. ఇందులో భాగంగా మంగళవారం పిఆర్‌టియు-ఎస్టీయు, ఎన్జీఓ, జెఏసి నాయకుల ఆధ్వర్యంలో రోడ్డుపై బైటాయించారు. ఈ సందర్భంగా ఒంటెద్దు బండి లాగి నిరసన తెలిపారు. అలాగే యుటిఎఫ్-ఏపిటిఎఫ్ ఆధ్వర్యంలో దినపత్రికలు తలకు, శరీరానికి చుట్టుకుని రోడ్డుపై ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని పెట్రోల్‌బంకు సెంటరు వద్ద రాస్తారోకో చేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

మఠంలో వైభవంగా ద్వాదశి పూజలు
మంత్రాలయం, సెప్టెంబర్ 17: శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో మంగళవారం ద్వాదశి పూజలు మఠం పీఠాధిపతులు సుయతీంద్రతీర్థులు, సుభూదీంద్రతీర్థులు ఆధ్వర్యంలోప్రత్యేక పూజలు నిర్వహించారు. ద్వాదశిలో భాగంగా తెల్లవారు జామునుంచి శ్రీరాఘవేంద్రస్వామి బృందావనానికి నిర్మల్య విసర్జన, సుప్రభాత సేవతో పూజలను మొదలుపెట్టి విశేష పంచాబృంతాభిషేకం, అలంకరణలో భాగంగా స్వర్ణ కవచాలతో, పట్టు వస్త్రాలతో, వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించారు. అదేవిధంగా ఉత్సవ మూర్తులైన ప్రహ్లాదరాయుల వారికి ప్రత్యేక పూజలు చేసి స్వర్ణ, రజిత, చక్క రథోత్సవాలపై అధిష్ఠించి భక్తుల హర్షధ్వనుల మధ్య ఆలయ ప్రాంగణం చుట్టూ ఊరేగించారు.
విశ్వకర్మ జయంతి
మంత్రాలయంలో మంగళవారం విశ్వకర్మ జయం తి ఉత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. విశ్వకర్మ చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేసి పల్లకిలో అలంకరించి మంగళవాయిద్యాల మధ్య గ్రామ పురవీధుల గుండా ఊరేగింపుచేశారు. అనంతరం తుంగభద్ర నది వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో శాంతప్ప ఆచారి, గురురాజాఆచారి, నరసింహ ఆచారి, ప్రహ్లాద పాల్గొన్నారు.

గ్రేటర్ రాయలసీమ ఏర్పాటు చేయాలి
ఎమ్మిగనూరు, సెప్టెంబర్ 17: ప్రస్థుత పరిస్థితుల్లో గ్రేటర్ రాయలసీమ ఏర్పాటు చేయాలని రాష్ట్ర పిసిసి లీగల్ సెల్ చైర్మన్ పురుషోత్తంరెడ్డి మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ సమైక్యాంధ్ర విషయంలోగత రెండు నెలల నుండి రాష్ట్రంలో ఉద్యమాలు ఊపందుకున్నాయని, ఇందులో భాగంగానే రాష్ట్ర చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్‌పై వైకాపా నాయకులు దాడి యత్నం చేయడం తగదని, అలా దాడికి పూనుకుంటే తాము కూడా ఎదుర్కొనేందుకు సిద్దమవుతామని పురుషోత్తంరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర విషయాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని ఒక నిర్ణయం తీసుకొవాలన్నారు, సమావేశంలో పిసిసి లీగల్ సెల్ నాయకులు విట్టారమేష్, మురళీకృష్ణ, ప్రతాప్‌రావు, ఒంకారప్ప, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
కుర్ణిదైవాచార సంఘంలో ఎమ్మెల్యే చిచ్చుపెట్టలేదు
స్థానిక కుర్ణిదైవాచార సంఘంలోఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి చిచ్చుపెట్టారని ఆ సంఘం నాయకులు మాచాని వెంకటేశప్ప, గడిగే చంద్రన్న, నీలకంఠప్పలు చేసిన ప్రకటనలో ఎలాంటి నిజం లేదని స్థానిక వైకాపా నాయకుడు మాజీ మున్సిపాల్ చైర్మన్ బుట్టారంగయ్య మంగళవారం విలేఖర్ల సమావేశంలో తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ఎర్రకోట కుర్ణి కల్యాణ మంటపాలకు నిధులు మంజూరు చేసిన వ్యక్తి అని అటువంటి ఎమ్మెల్యేపై కుర్ణి దైవాచార సంఘం పెద్దలు లేని పోని ప్రకటనలు చేయడం తగదని బుట్టారంగయ్య పేర్కొన్నారు.
ఘనంగా చౌడేశ్వరి ఉత్సవాలు
పత్తికొండ, సెప్టెంబర్ 17: పత్తికొండలో వెలసి శ్రీచౌడేశ్వరి మాత ఉత్సవాలు మంగళవారం వందలాది భక్తుల మధ్య ఘనంగా జరిగాయి.్భక్తులు జ్యోతులతోనృత్యాం చేయటం అందరిని ఆకర్షించింది. కర్నాటక, అనంతపురం, కర్నూలు జిల్లాలోప్రాంతాల నుండి వచ్చిన భక్తులు చౌడేశ్వరి దేవాలయంలో పూజలు చేశారు. ఎమ్మెల్యే కేయి ప్రభాకర్, వైకాపా నాయకులు రామచంద్రరెడ్డి ఆలలయంలోప్రత్యేక పూజలు చేశారు. బాలరంగయ్య, సత్యం, చౌడయ్య, రాజులతోపాటు వందలాది మంది చౌడేశ్వరి మాత ఉత్సవాల్లో పాల్గొన్నారు.

మండలంలోని మాయలూరు, ఉయ్యాలవాడ గ్రామాల్లో రెండు మట్టిమిద్దెలు కూలాయి
english title: 
midde

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>