ఖమ్మం(గాంధీచౌక్), సెప్టెంబర్ 18: గణేష్ నవరాత్రి ఉత్సవాలు జిల్లా ప్రజల్లో సోదరభావాన్ని పెంపొందించాయని, భక్త్భివంతో ఉత్సవాలు జరుపుకున్నారని ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ పేర్కొన్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా బుధవారం స్థానిక గాంధీచౌక్‌లో గణేష్ విగ్రహాల శోభయాత్రకు ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో వారు మాట్లాడుతూ ఖమ్మం నగర ప్రజలు క్రమశిక్షణతో శాంతియుతంగా భక్త్భివంతో ఉత్సవాలను నిర్వహించుకున్నారన్నారు. నాడు స్వాతంత్య్ర పోరాటంలో ప్రజల మధ్య శాంతి, భక్త్భివాలను పెంపొందించేందుకు బాలగంగాధర్ తిలక్ ఈ ఉత్సవాలను ప్రారంభించారని గుర్తు చేశారు. విగ్రహాలన్నింటిని మధ్యాహ్న సమయానికి గాంధీచౌక్ ప్రాంతానికి తరలివచ్చేలా అన్ని చర్యలు తీసుకున్నారు. సభ జరిగే ప్రాంతం నుంచి విగ్రహాలకు వీడ్కోలు పలుకుతూ పూలు చల్లుతూ భక్తులను ఉత్తేజపర్చేందుకు కలెక్టర్ ఎమ్మెల్యేతో పాటు ఎస్పీ తదితరులు తమ ప్రసంగాలను కొనసాగించారు. సుమారు 500కుపైగా విగ్రహాలను వరుస క్రమంలో మునే్నరుకు తరలించారు. శోభాయాత్ర పొడవునా భక్తులు నృత్యాలతో అలరించారు. త్రీటౌన్ ప్రాంతంలో హిందు, ముస్లిం భాయి భాయి అంటూ నినాదాలు చేస్తూ యాత్రను చేశారు. నగరంలోని ఐదు ప్రాంతాల గుండా విగ్రహాల తరలింపు కార్యక్రమం జరిగింది. ఎక్కువ విగ్రహాలను చర్చికాంపౌండ్ బ్రిడ్జి మీదుగా గాంధీచౌక్‌కు తరలించి, అక్కడ నుంచి మునే్నటికి తరలించారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌నియంత్రణ ఆంక్షలు పెట్టి శోభాయాత్ర విగ్రహ నిమజ్జన కార్యక్రమం విజయవంతమయ్యేలా అన్ని శాఖల అధికారులను సమన్వయంతో పని చేయించటంలో కలెక్టర్, ఎస్పీలు విజయవంతమయ్యారు. మేళతాళాలను యాత్రలో నిషేధిస్తున్నట్లు ముందుగానే ప్రకటించినా భక్తులు పట్టించుకోకపోవటంతో పోలీసులు కూడా వారికి సర్దిచెప్తూ ముందుకు సాగారు. కొద్ది మంది మద్యం సేవించి హడావుడి చేయగా, వారిని సైతం సున్నితంగా మందలిస్తూ పక్కకు తీసుకొచ్చారు. కాగా యాత్రలో జేబుదొంగలు యథావిధిగానే తమ పనిని విజయవంతంగా పూర్తి చేశారు. అనేక మంది తమ పర్సులు, వాచీలు, చైన్‌లు పోయాయంటూ శోభాయాత్రలో లబోదిబోమన్నారు. ఇదిలా ఉండగా విద్యార్థులు, మహిళలు చేసిన నృత్యాలు శోభాయాత్రలో ఆకర్షణగా నిలిచాయి. భక్తులను అధికారులు సైతం ఉత్తేజపరుస్తూ శాంతియుతంగా యాత్రను పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేశారు. ఇదిలా ఉండగా మునే్నరు వద్ద గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసే సమయంలో ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా డిఎస్పీ బాలకిషన్ ఆధ్వర్యంలో విస్తృత బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే సింగరేణి, భద్రాచలంల నుంచి గజ ఈతగాళ్ళను రప్పించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాలు జిల్లా ప్రజల్లో సోదరభావాన్ని
english title:
s
Date:
Thursday, September 19, 2013