డమాస్కస్, సెప్టెంబర్ 21: సిరియాపై సైనిక దాడులను నివారించడానికి అమెరికా, రష్యాల మధ్య కుదిరిన ఒప్పందం కింద విధించిన గడువులోగానే సిరియా తన వద్ద ఉన్న రసాయనిక ఆయుధాలకు సంబంధించిన పూర్తి వివరాలను అంతర్జాతీయ రసాయనిక ఆయుధాల నిఘా సంస్థ అయిన ‘ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్’కు అందజేసింది. సిరియా ప్రభుత్వం ఇప్పటికే హేగ్‌లోని ఈ సంస్థకు ఈ వివరాలను పంపించింది. అయితే ఈ ప్రక్రియ ఇప్పుడు పూర్తయిందని ఆ సంస్థ శనివారం తెలియజేసింది. రసాయనిక ఆయుధ కార్యక్రమానికి సంబంధించి సిరియా ప్రభుత్వంనుంచి వివరాలు తమకు అందాయని ఆ సంస్థ ధ్రువీకరిస్తూ, ప్రస్తుతం ఈ వివరాలను టెక్నికల్ సెక్రటేరియట్ సమీక్షిస్తోందని తెలియజేసింది. రష్యా, అమెరికా మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం సిరియా తన వద్ద ఉన్న రసాయనిక ఆయుధాలన్నిటినీ విధ్వంసం చేయడం కోసం అప్పగించాల్సి ఉంటుంది. ఈ ఒప్పందానికి సంబంధించిన తీర్మానంలోని పదజాలం ఎలా ఉండాలనే దానిపై ఐక్యరాజ్యసమితిలోని వివిధ దేశాల దూతలు మల్లగుల్లాలు పడుతున్న సమయంలో ఈ ప్రకటన వెలువడ్డం గమనార్హం.
సిరియాపై సైనిక దాడులను నివారించడానికి అమెరికా, రష్యాల మధ్య కుదిరిన
english title:
s
Date:
Sunday, September 22, 2013