మహబూబ్‌నగర్, మార్చి 5: ప్రజా ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పురుషోత్తంరెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదులో భాగంగా సోమవారం రెవెన్యూ సమావేశ మందిరంలో ప్రజల నుండి కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించని వారిపై తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇకపై ఫిర్యాదులపై సమగ్రంగా సమీక్షిస్తామని తెలిపారు. ప్రజా ఫిర్యాదుల రోజును పురస్కరించుకుని ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు. అధికారులు ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. ఫిర్యాదులు పరిష్కరించడంలో అధికారులు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమాజంలో పాతుకపోయిన మూఢనమ్మకాలు, దురాచారాలను రూపుమాపడంలో ప్రజల చైతన్యం చేయాల్సిన అవసరం ప్రతిఒక్కరిపై ఉందని ఆయన అన్నారు. సెప్టెంబర్‌లో దేవరకద్ర మండలం పెద్దరాజమూర్‌కు చెందిన మైనర్ బాలిక రాధకు తల్లిదండ్రులు బాలయ్య, హన్మమ్మలు బాల్య వివాహం జరిపించాలని చూడటం, గ్రామంలో కొందరు ఆ బాలికను జోగినిగా మార్చాలని యత్నించారని తెలిపారు. ఆ సంఘటనపై తాము స్పందించామని బాల్య వివాహాన్ని ఆపించడమే కాక పునరావాసం కింద రాధను మహబూబ్‌నగర్‌లోని జాగృతి నర్సింగ్ కళాశాలలో చేర్పించడం జరిగిందని అన్నారు. ఎఎన్‌ఎం కోర్సును అభ్యసించిన రాధ సోమవారం రెవెన్యూ సమావేశ మందిరంలో కలెక్టర్ చేతుల మీదుగా సర్ట్ఫికెట్‌ను పొందింది. జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ప్రజలు ఇంకా మూఢనమ్మకాలు, దురాచారాలు పాటిస్తున్నారని, వాటిని విడనాడాలని, అందుకు అధికారులు విస్తృత ప్రచారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెసి శర్మన్, అదనపు జెసి భారతి లక్పతినాయక్, డిఆర్‌డిఎ పిడి చంద్రకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
* కలెక్టర్ పురుషోత్తంరెడ్డి
english title:
f
Date:
Tuesday, March 6, 2012