జైపూర్, సెప్టెంబర్ 21: చాంపియన్స్ లీగ్ టి-20 క్రికెట్ టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బోణీ చేసింది. ఆరో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) విజేత ముంబయి ఇండియన్స్‌తో చివరి వరకూ హోరాహోరీగా సాగిన తొలి మ్యాచ్‌లో ఈ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
టాస్ గెలిచిన రాజస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో, తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబయి తొమ్మిది పరుగుల స్కోరువద్ద డ్వేన్ స్మిత్ (9) వికెట్‌ను కోల్పోయింది. కెరీర్‌లో చివరి ప్రొఫెషనల్ టి-20 టోర్నీ ఆడుతున్న భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ (15), వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ దినేష్ కార్తీక్ (2), అంబటి తిరుపతి రాయుడు (3) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరడంతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ (44), కీరన్ పొలార్డ్ (42) జట్టును ఆదుకోవడానికి శక్తివంచన లేకుండా కృషి చేశారు. 37 బంతులు ఎదుర్కొని, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 44 పరుగులు చేసిన శర్మను సంజూ శాంసన్ క్యాచ్ అందుకోగా షేన్ వాట్సన్ అవుట్ చేశాడు. కొద్ది సేపటి తర్వాత పొలార్డ్ ప్రతిఘటనకు తెరపడింది. అతను 36 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 42 పరుగులు చేసి విక్రంజిత్ మాలిక్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ సంజూ శాంసన్‌కు దొరికిపోయాడు. హర్భజన్ సింగ్ ఎనిమిది పరుగులకు రనౌట్‌కాగా, చివరిలో నాథన్ కౌల్టర్ నైల్ (12) పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ముంబయి బౌలర్లలో మాలిక్ మూడు వికెట్లు పడగొట్టాడు.
సచిన్ మాదిరిగానే కెరీర్‌లో చివరి ప్రొఫెషనల్ టి-20 టోర్నీ ఆడుతున్న రాజస్థాన్ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే అవుటయ్యాడు. రాజస్థాన్ ఐదు పరుగుల స్కోరువద్ద మొదటి వికెట్ కోల్పోయింది. అయితే, ఆజింక్య రహానే, సంజూ శాంసన్ జట్టుకు అండగా నిలిచారు. 31 బంతుల్లో 33 పరుగులు చేసిన రహానేను రిషీ ధావన్ క్లీన్ బౌల్డ్ చేసే సమయానికి అతను సంజూ థామస్‌తో కలిసి రెండో వికెట్‌కు 74 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. సంజూ శాంసన్ 47 బంతుల్లో 54 పరుగులు సాధించి పొలార్డ్ బౌలింగ్‌లో స్మిత్ క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. చివరిలో వాట్సన్, స్టువర్ట్ బిన్నీ చెరి 27 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, 19.4 ఓవర్లలో రాజస్థాన్ మూడు వికెట్లకు 148 పరుగులు చేసి, ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బిన్నీ భారీ సిక్స్‌తో జట్టును గెలిపించడం విశేషం. అర్ధ సెం చరీతో రాణించిన సంజూ శాంసన్ రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
చాంపియన్స్ లీగ్ టి-20 క్రికెట్ టోర్నమెంట్
english title:
rajasthan royals
Date:
Sunday, September 22, 2013