నాగర్‌కర్నూల్, మార్చి 5: ఈనెల 18న జరిగే ఉప ఎన్నికలలో పోటీ చేస్తున్న ప్రధాన అభ్యర్థులు చేస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి అనూ హ్యమైన స్పందన వస్తుండటంతో అభ్యర్థులలో ఆనందం వ్యక్తమ వుతున్నది. నామినేషన్‌లను వేసే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థికి కూచుకుళ్ల దామోదర్‌రెడ్డికి, టిడిపి అభ్యర్థి మర్రి జనార్ధన్‌రెడ్డికి, స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగం జనార్ధన్‌రెడ్డికి ప్రజలు భారీ సంఖ్యలో తరలి రావడంతో ఆయా ఎన్నికల శిబిరాలలో ఆనందానికి అడ్డులేకుండా పోయింది. అదేవిధంగా అభ్యర్థులకు మద్దతుగా గ్రామాలలో కళాకారులు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు సైతం ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, నేతలు వెళ్లినప్పుడు కూడా సాదారంగా ఆహ్వానిస్తున్నారని ఆయా పార్టీల నేతలు అంటున్నారు. ఉప ఎన్నికలలో ఓటు ఎవ్వరికి వేస్తారనేది వందడాలర్ల ప్రశ్న మారిందని పలువురు నేతలు అభిప్రాయ పడుతున్నారు.
మున్ముందు ఎన్నికల ప్రచారాన్ని ఇంకా ముమ్మరంగా చేపట్టేందుకు ప్రధాన అభ్యర్థులు సిద్దమవుతున్నారు. ఇప్పటికే గ్రామాలలో సమావేశాలను నిర్వహిస్తు ఓటు వేయాల్సిందిగా కోరుతునే రహస్య సమావేశాలను నిర్వహించి కుల సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలతో ఒప్పాం దాలను చేసుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా ఎన్నికల బహిరంగ సభను నిర్వహించేందుకు ఇప్పటికే నాగంకు మద్దతు ఇస్తున్న కెసిఆర్ ఈనెల 10 నాగర్‌కర్నూల్ నియో జకవర్గంలో పర్యటించనుండగా, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఈనెల 11న పర్యటించనున్నారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన కూడా ఉంటుందని, ఇంకా ఖరారు కాలేదని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. మొత్తంమీద ఈ ఉప ఎన్నికలలో గెలుస్తామని పైకి గాంభీర్యాన్ని ప్రకటిస్తున్నప్పటికీ ఓటర్ల నాడి తెలియక అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు.
ఓటర్ల నాడి తెలియక అయోమయం 10న కెసిఆర్, 11న చంద్రబాబు పర్యటన
english title:
f
Date:
Tuesday, March 6, 2012