మహబూబ్‌నగర్, మార్చి 5: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి సాధ్యమని ప్రతి వ్యక్తి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ప్రభుత్వానికి మరింత సహకారం అందించాలని రాష్ట్ర హోంశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం రాత్రి కాంగ్రెస్ నాయకుడు సంజీవ్ ముదిరాజ్ స్వగృహంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలతో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. హన్వాడ, మహబూబ్‌నగర్, మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో ఎన్నికలపై కాంగ్రెస్ కార్యకర్తలతో ముఖాముఖిగా మాట్లాడారు. పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులను సైతం మంత్రి కలిసి కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలంటూ కోరారు. దొడలోనిపల్లి గ్రామ టిడిపి మాజీ సర్పంచ్ శంకర్‌నాయక్, విఎస్‌ఎస్ చైర్మన్ హన్మంతు, మరో 30 మంది టిడిపి నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ కండువాలను కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని హోంశాఖ మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే స్వర్ణసుధాకర్‌రెడ్డి, డిసిసి అధ్యక్షుడు ఉబేదుల్లా కొత్వాల్, నాయకులు అరుణ రామన్‌గౌడ్, అనితారెడ్డి, సిజె బెనహర్, భీంరెడ్డి, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
* హోంశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి
english title:
ff
Date:
Tuesday, March 6, 2012